Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

క్యాన్సర్ పై పోరుకు రష్యా వ్యాక్సీన్.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్న పుతిన్

త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించిన రష్యా ప్రెసిడెంట్
క్యాన్సర్ నివారణ కోసం రష్యా సరికొత్త వ్యాక్సీన్ ను తయారు చేస్తోందని ఆ దేశ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. వ్యాక్సీన్ తయారీ ప్రస్తుతం తుది దశలో ఉందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ఫ్యూచర్ టెక్నాలజీస్ పై మాస్కోలో జరిగిన ఓ సదస్సులో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సీన్ తో పాటు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కొత్తతరం మందులను తమ సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అయితే, అది ఏ రకమైన వ్యాక్సీన్, ఏ క్యాన్సర్ ను అడ్డుకుంటుందనే వివరాలను మాత్రం పుతిన్ వెల్లడించలేదు. కాగా, కరోనా వైరస్ కు రష్యా సొంతంగా స్పుత్నిక్ పేరుతో వ్యాక్సీన్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సీన్ పై దుష్ప్రచారం జరగగా.. ప్రజలలో నమ్మకం కలిగించేందుకు పుతిన్ స్వయంగా ఈ వ్యాక్సీన్ వేయించుకున్నారు.సెర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరసెస్ (హెచ్ పీవీ) ను అడ్డుకోవడానికి ఇప్పటికే వ్యాక్సీన్ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు కంపెనీలు ఈ వ్యాక్సీన్ తయారీకి లైసెన్స్ పొందాయి. పెద్ద ఎత్తున తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అలాగే లివర్ క్యాన్సర్ కు కారణమయ్యే హెపటైటిస్ బిఃకి కూడా వ్యాక్సిన్ వుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. భారత దేశంలోనూ క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఏటా 13 నుంచి 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, 2026 నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్వీఎస్ డియో ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img