Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టిప్పర్ లు కాదు… మృత్యు శకటాలు

రహదారి విస్తరణ పేరిట అతి వేగంగా తిరుగుతున్న వాహనాలు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- రహదారి విస్తరణ పేరిట మన్య ప్రాంతంలో అతి వేగంగా తిరుగుతున్న వాహనాలు టిప్పర్ లు కాదని, మృత్యు శకటాలు అని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అభివృద్ధి పేరిట నిర్మిస్తున్న ఈ రహదారులు చూసేందుకు అందంగా కనిపిస్తున్నా, రహదారుల నిర్మాణ పనుల సమయంలో తిరుగుతున్న టాటా కంపెనీకి చెందిన టిప్పర్ లు దుమ్ము రేపుతూ అతి వేగంగా తిరుగుతున్నాయి. దీంతో రహదారికి ఇరువైపులా ఉన్న గృహాలు, కాఫి, మిరియాల తోటలకు నష్టం వాటిల్లడమే కాకుండా పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో పాటు దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే పోయే వాహనాలు ఏమిటో అర్థం కాక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రహదారి విస్తరణ పనుల వలన మన్య ప్రాంతంలోని పచ్చదనానికి, నిత్యం శీతల వాతావరణానికి ప్రసిద్ది గాంచిన ఆంధ్ర కశ్మీర్ లంబసింగి ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలుగుతుందని ఈ ప్రాంతీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మైదాన ప్రాంతాలలో మాదిరిగా ఈ టిప్పర్ లు మన్య ప్రాంతంలో అతి వేగంగా తిరగడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆదివారం చింతపల్లి కొలపరి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న వేములపూడి వెంకటరావు మరణించిన విషయం పాఠకులకు తెలిసిందే. రహదారుల విస్తరణ పుణ్యమా అని శనివారం నుంచి ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.

కొనసాగుతున్న ప్రమాదాలు :- శనివారం జీకే వీధి మండలం దొడ్డి కొండ సమీపంలో జరిగిన వాహన ప్రమాదంలో చింతపల్లి గ్రామం సాడిపేట కు చెందిన సాయికుమార్, ఆదివారం చింతపల్లి మండలం కొలపరి సమీపంలో జరిగిన గుర్తు తెలియని వాహన ప్రమాదంలో వెంకటరావు, ఇదే మండలంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న జీపు ప్రమాదంలో వంతల అప్పారావు, జర్త . చిన్నమ్మి లు మృత్యువాత పడగా 11 మంది తీవ్ర గాయాలతో పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుధవారం జీకే వీధి మండలం అసరాడ వద్ద జరిగిన ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కొట్నాపల్లి గ్రామానికి చెందిన యువకునికి ఎడమ కాలు విరగడం తదితర దుర్ఘటనలతో వరుస ప్రమాదాలు ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అభివృద్ధి పేరిట రహదారుల విస్తరణ జరగడాన్ని ఈ ప్రాంతీయులు స్వాగతిస్తున్నప్పటికీ, వరుస ప్రమాదాలు ఈ ప్రాంత వాసులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img