Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఢిల్లీ మద్యం కేసులో ఎట్టకేలకు కోర్టు విచారణకు హాజరైన కేజ్రీవాల్..

నేడే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష
ఢిల్లీ మద్యం కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం కోర్టు విచారణకు హాజరయ్యారు. వర్చువల్‌గా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరైన్ కేజ్రీవాల్.. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తదుపరి విచారణకు ప్రత్యక్షంగా వచ్చి హాజరు అవుతానని కేజ్రీవాల్ కోర్టుకు విన్నవించారు. దీంతో ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ మార్చి 16 వ తేదీన జరగనున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఈడీ అధికారులు 6 సార్లు సమన్లు జారీ చేశారు. అయితే 5 సార్లు ఈడీ సమన్లను పట్టించుకోని కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరయ్యారు. ఇక ఈనెల 19 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఇటీవలె ఆరోసారి ఈడీ అధికారులు మళ్లీ కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కోసం తాము ఇచ్చిన నోటీసులకు సీఎం కేజ్రీవాల్ స్పందించడం లేదని.. ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని కేజ్రీవాల్ ప్రవేశపెట్టారు. ఆ బలపరీక్షకు సంబంధించిన చర్చ నేడు శాసనసభలో జరగనుంది. అందుకే తాను ఈసారి కోర్టుకు ప్రత్యక్షంగా రాలేకపోతున్నానని కోర్టుకు విన్నవించారు. కేజ్రీవాల్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది. అయితే ఇదే ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు గతేడాది ఏప్రిల్ నెలలో కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు విచారణ జరిపింది. ఇక ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ జైల్లో ఉన్నారు.

ఇక నేడు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం బలపరీక్షకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోందని ఆరోపించిన కేజ్రీవాల్.. తమ పార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని.. నిరూపించేందుకే ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అక్రమ కేసులు పెట్టి.. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను విచ్ఛిన్నం చేయడం.. ప్రభుత్వాలను పడగొట్టడం చూస్తునే ఉన్నామని.. ఢిల్లీ మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్‌ నేతల్ని అరెస్టు చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img