విశాలాంధ్ర – ఉంగుటూరు ( ఏలూరు జిల్లా ): ఉంగుటూరు మండలం నారాయణపురం నయారా పెట్రోల్ బంకు వద్ద (గణపవరం రోడ్ ) ఆదివారం సాయంత్రం 4గంటలకు వాలంటరీలకు వందన కార్యక్రమం జరుగుతుందని మండల ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు శనివారం తెలిపారు. ఉంగుటూరు శాసన సభ్యులు పుప్పాల వాసుబాబు ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.