Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

“హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై అవగాహన కొరకు కళా జాతా కార్యక్రమం”

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాతా బృందాలతో వీధి నాటకముల ద్వారా హెచ్.ఐ.వి,ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగంగా సోమవారం స్థానిక తాడిపత్రి బస్ స్టాండ్ సర్కిల్ నందు వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి, ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది ఎలా వ్యాపించదు అనే విషయాన్ని అవగాహన కల్పించారు. హెచ్.ఐ.వి,ఎయిడ్స్ యాక్ట్ – 2017 గూర్చి ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న ఛాతీ వ్యాధి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.మితున్ మాట్లాడుతూ హెచ్. ఐ. వి., ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, హెచ్.ఐ.వి. కేవలం అరక్షిత లైంగిక సంబంధాలు, హెచ్.ఐ.వి. ఉన్న గర్భిణీ నుండి బిడ్డకు, హెచ్.ఐ.వి. తో కలుషితమైన సూదులు, సిరంజీలు, హెచ్.ఐ.వి. ఉన్న వ్యక్తి రక్తాన్ని వేరే వారికి ఎక్కించడం వంటి నాలుగు మార్గాల ద్వారానే సోకుతుందని, వ్యాధి పట్ల అవగాహన తోనే ఎవరికి వారు ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ నరేష్,ఎం ఈ ఏ బాస్కర్, ఔట్రీచ్ వర్కర్స్, శ్రీనివాసులు కళాజాతా బృందం సభ్యులు బాలు , నాగేంద్ర ,నిర్మల,లత ,శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img