Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నగ్నంగా నిలబడ్డ బీజేపీ

ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎన్నికలలో విజయం సాధించాలన్న బీజేపీ పట్టుదలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారం సంపాదించడానికి బీజేపీ సకలవిధ మాయోపాయాలకు పాల్పడుతుందనుకున్నాం. కాదు… ఒక మేయర్‌ పదవిని దక్కించుకోవడానికి ఎంత నైచ్యానికైనా దిగజార గలుగుతుందని గత నెలాఖరులో చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలలో రుజువైంది. ఆ ఎన్నికల నిర్వహణాధికారి అనిల్‌ మసీప్‌ా బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి 8 బ్యాలెట్‌ పేపర్ల మీద గీతలు గీసి బీజేపీ అభ్యర్థి సోంకర్‌ మేయర్‌గా ఎన్నికైనట్టు ప్రకటించి స్వామి భక్తి ప్రదర్శించారు. కానీ ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లిన తరవాత సుప్రీంకోర్టు ఈ కేసును కేవలం 20 రోజుల్లో విచారణ ముగించడమే కాక ఎన్నికల నిర్వహణాధికారి మసీప్‌ాపై నేర విచారణా ప్రక్రియ (సి.ఆర్‌.పి.సి.) సెక్షన్‌ 340 ప్రకారం కేసు నడపాలని ఆదేశించింది. ఒక మేయర్‌ ఎన్నిక విషయంలో సుప్రీంకోర్టు ఇంత త్వరితంగా స్పందించడం అపూర్వం. అంతే కాకుండా సదరు ఎన్నికల నిర్వహణాధికారి మసీప్‌ాను కోర్టుకు పిలిపించి ప్రశ్నలతో ముంచెత్తింది. అలవాటు ప్రకారం ఆయన మొదట చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి అనేక అబద్ధాలాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో మసీప్‌ా చేసిన తప్పుఒప్పుకోక తప్పలేదు. మసీప్‌ా చెల్లవని ప్రకటించిన ఓట్లను కూడా లెక్కించి ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ను మేయర్‌గా ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానం బ్యాలెట్‌ పత్రాలను తెప్పించుకుని పరిశీలించడమే కాదు వాటిని మసీప్‌ా ఎలా మార్చేశారో న్యాయవాదులకూ చూపించింది. మసీప్‌ా మార్చేసిన 8 బ్యాలెట్‌ పత్రాలు ఆయన ఓడినట్టు ప్రకటించిన పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా పడ్డ ఓట్లే. ఎన్నికల నిర్వహణాధికారిగా వ్యవహరించిన మసీప్‌ాది గొప్ప చరిత్రే. కేవలం ఆయన ప్రభుత్వ అధికారి మాత్రమే కాదు. బీజేపీ భక్తుడు. ఆయన చండీగఢ్‌ బీజేపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఆయనకు అప్పగించడంలో ఆశ్చర్యం లేదు. చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతం. అంటే నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరిధిలోకి వస్తుంది. చండీగఢ్‌ పాలనాధికార వర్గాల, లేదా కనీసం బీజేపీ స్థానిక నాయకుల ప్రమేయం, ప్రోత్సాహం, ప్రలోభం లేకుండా బ్యాలెట్‌ పత్రాలను మార్చే సాహసం చేసి ఉండరు. అంటే సుప్రీంకోర్టు మంగళవారం చెప్పిన తీర్పు నేరుగా బీజేపీ నాయకత్వానికే చెంప పెట్టు. చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతం కనక అది కేంద్ర బీజేపీ నాయకత్వం అవమానంతో తలదించుకోవలసిన తీర్పు. కానీ బీజేపీ నాయకులకు అంత ఔదార్యం ఉంటుందని ఆశించలేం. ఈ వ్యవహారంలో మోదీ లేదా అమిత్‌ షా స్వయంగా జోక్యం చేసుకుంటారని చెప్పలేం. కానీ ఎన్నికలలో గెలవడానికి వారు అనుసరించే విధానాలను గమనిస్తున్న బీజేపీ నేతలు అదే పద్ధతి అనుసరించారని రూఢగాి చెప్పొచ్చు. బ్యాలెట్‌ పత్రాలను మార్చినందువల్ల మసీప్‌ాకి నేరుగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అంతిమ ప్రయోజనం బీజేపీ దక్కించుకోవాలనుకుంది. కనక సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ అకృత్యాలను నగ్నంగా నిలబెట్టినట్లయింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు వద్దని వాదించే వారికీ ఇందులో ఓ గుణపాఠం ఉంది. బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించినా వాటినీ తారుమారు చేయగలిగిన ‘‘భక్తులు’’ బీజేపీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మసీప్‌ా అక్రమానికే పాల్పడి ఉండొచ్చు. ఆయనకు నిజాయితీ లేకపోవచ్చు. అలాంటి వారిని ఎన్నికల నిర్వహణాధికారులుగా నియమించి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఇలాంటి వారిని ఎంత మందిని బీజేపీ రంగంలో దించుతుందో ఊహించుకుంటేనే ప్రజాస్వామ్యం చరమాంకానికి చేరుకుందేమోనన్న నిరాశ కలగక మానదు. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. ‘‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయనివ్వం’’ అన్న మాటను ప్రధాన న్యాయమూర్తి అక్షరాలా నిలబెట్టు కున్నారు. పైనుంచి ఆదేశాలు జారీ కాకపోతే మసీప్‌ా అంత సాహసం చేయలేరు. దోషిగా నిలబడిరది మసీప్‌ా అయితే భ్రష్టు పట్టింది బీజేపీ.
అసలు నాటకం ఆడిరచింది ఎవరు అన్నది ఎప్పటికీ బయట పడక పోవచ్చు. మసీప్‌ా విచారణా క్రమంలో విషయం బయటపెడ్తే ఆ నాటకం ఆడిరచిన వారి పేర్లూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రధాన న్యాయమూర్తి తీర్పు భవిష్యత్‌ ఎత్తుగడలను కూడా నిర్వీర్యం చేసింది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలను మళ్లీ నిర్వహించమని కోర్టు ఆదేశిస్తుందని బీజేపీ అంచనా వేసింది. కానీ చంద్రచూడ్‌ ఆ ఆటలు సాగకుండా మసీప్‌ా మార్చేసిన బ్యాలెట్‌ పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు కుల్దీప్‌ కుమార్‌ను మేయరుగా ప్రకటించారు. సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, మసీప్‌ా తరఫు న్యాయవాది రోహ్తగి సుప్రీంకోర్టులో నిష్కర్షకు నిలవని వాదనలు చేశారు. హైకోర్టు చూసుకుంటుందిగా అని ప్రధాన న్యాయమూర్తికే న్యాయశాస్త్ర పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత చిన్న ఎన్నిక విషయంలో బీజేపీ పట్టుదలతో వ్యవహరించడం, శిక్షించకపోయినా బీజేపీ బండారం బట్టబయలయ్యే తీర్పు ఇవ్వడం అపూర్వం. భవిష్యత్తులో ఏం చేయాలో కూడా బీజేపీ నిర్ణయించేసింది. అందుకే ముగ్గురు ఆమ్‌ఆద్మీ కార్పొరేట్లను ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకుంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కనక అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించి ఉంటే ఈ ముగ్గురూ ఉపయోగపడే వారు. అయితే బీజేపీకి ఇంకో అవకాశం మిగిలే ఉంది. ముగ్గురు ఆమ్‌ఆద్మీ సభ్యులను బుట్టలో వేసుకున్నందువల్ల మేయర్‌ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి సుప్రీంకోర్టు తీర్పును వమ్ము చేయవచ్చు. ఒక్కటే ఇబ్బంది. ఏడాది దాకా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం లేదు. మేయర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ‘‘చూశారా మొదటి ఎన్నికలోనే ప్రతిపక్ష ఇండియా ఐక్య సంఘటన ఓడిపోయింది’’ అని దీర్ఘాలు తీశారు. మంగళవారం సుప్రీం తీర్పు తరవాత వీరి నోరు పెకలడం లేదు. సాధారణంగా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మౌనముద్రాంకితులు కావడం బీజేపీ నాయకుల అలవాటు. దీనికీ వారికి ఆదర్శం మోదీనే. ఒక నగర మేయర్‌ పదవి కోసం బీజేపీ ఎంతగా దిగజారుతుందో గమనిస్తే ఆశ్చర్యం కాదు అసహ్యం వేస్తుంది. మరో విషయమూ ఇక్కడ గమనించాలి. సాధారణంగా ఎన్నికల పిటిషన్లలో న్యాయస్థానాల తీర్పు రావాలంటే ఏళ్లు పడ్తుంది. కానీ చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు చాలా వేగంగా స్పందించడమే కాదు కొన్ని రాజకీయ పార్టీల దిగజారుడుతనాన్ని, అధికారుల బానిస మనస్తత్వాన్ని బహిర్గతం చేసింది. ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే బీజేపీ మునిసిపల్‌ కార్పొరేటర్లనూ కొనగలదని తేలింది. సుప్రీంకోర్టు దీక్షాబద్ధమైనందువల్ల ప్రజాస్వామ్యం మీద ఆశలు వదులుకోనక్కర్లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img