Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముగిసిన శ్రీ భద్రావతి భావన రుషింద్రుల వారి 58వ కళ్యాణ మహోత్సవ వేడుకలు..

అధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మార్కెట్ వీధి లో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ఈనెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీ బద్రావతి భావన రుచేంద్రుల వారి 58వ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కమిటీ, దాతలు, శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడవరోజు అర్చకులు శ్రీవత్స శిష్య బృందం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాతలు, భక్తాదులు, కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బద్రావతి భావన రుషి ఇంద్రుల వారి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకం, శోడోచార పూజ ,అష్టోత్తరం నిర్వహించారు. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం అంగరంగ వైభవంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించుకున్నారు. అనంతరం డోలు కోత్సవం (సయనోత్సవం) సాయంత్రం అత్యంత వైభవంగా వేదమంత్రాలు నడుమ అర్చకులు నిర్వహించారు. వసంతోత్సవ ఉభయ దాతలు లీలావతి, పోలంకి కృష్ణమూర్తి అండ్ సన్స్- శాంతినగర్, జయప్రద, వర్ధి శివశంకర్- సిద్దయ్యగుట్ట, నాగరత్నమ్మ, జింక కంబగిరి- రాంనగర్, చెన్నమ్మ, వర్తి శ్రీనివాసులు- సిద్దయ్య గుట్ట, డోలికొస్తావా ఉభయ దాతలైన 23 మంది పేరిటన ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. తురుత అధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య దంపతులు, ఇతర సంఘం సభ్యుల దంపతులు హోమాలను నిర్వహించారు. తదుపరి శ్రీ అన్నమయ్య సేవా మండలి వారిచే పురాళ్ల పుల్లయ్య అధ్యక్షతన భక్తి సంకీర్తన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జింక రామాంజనేయులు, సహాయ కార్యదర్శి బోడగల శంకర, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప, కోశాధికారి పోరాళ్ల పుల్లయ్య, సమన్వయ కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు, ప్రచార కార్యదర్శులు, డైరెక్టర్లు, కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img