Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యూపీలో రాహుల్‌ యాత్రకు గొప్ప ఆదరణ

అరుణ్‌ శ్రీ వత్సవ

ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌గాంధీకి లభిస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీకి, ఎస్‌పీకి వణుకు పుడుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 19వ తదీన అమేధీలో రాహుల్‌ యాత్రలో ప్రజలు తండోపతండాలుగా పాల్గొన్నారు. ప్రచారంలో రాహుల్‌ గతంలోలేని విధంగా దూకుడుగా మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ వీధుల్లో ప్రజలు నిద్ర నుంచి ఇప్పటికైనా మేలుకోవాలని కోరుతున్నారు. ఈ నెల 14న మణిపూర్‌ దోబాలనుండి యాత్రను ప్రారంభించిన నేటి రాహుల్‌వేరు. యూపీలో వేరని ప్రచార ఉధృతిలో ప్రదర్శించారు. మోదీ పాలనలో దోపిడీ, అన్యాయాలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్పడుతున్నాయని రాహుల్‌ ఎండగడుతున్నారు. రాహుల్‌ ప్రచార తీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఆయన మాటల్లో సున్నితత్వం, మోదీ పాలనలో సంపన్నులను ఆదరిస్తూ, పేదలను పట్టించుకోక పోవడంపై వివరణలు యాత్రలో పాల్గొన్నవారిని విశేషంగా ఆకర్షించాయి. ఆయన ప్రసంగాలు జనాన్ని బాగా ఆకట్టుకోవడం బీజేపీ, ఎస్‌పీలకు ఆందోళన కలిగించాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన వారణాసిలో ప్రవేశించినప్పటినుండి ప్రసంగంతీరే మారిపోయింది. అలంకారాలు, ఉపమానాలు, హాస్య సంభాషణలతో మోదీ పాలన విధ్వంసక విధానాలను ప్రజలకు వివరించారు. నూతన వామపక్షం దేశంలో ఏర్పడిరదన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు.
దేశవ్యాప్తంగా కులగణన ఎంతో ముఖ్యమని అన్నారు. మోదీ ప్రభుత్వం కలిగిస్తున్న కష్టనష్టాలను గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. రాహుల్‌ 724 రోజుల తర్వాత అమేధీకి చేరినప్పుడు పట్టణ ప్రజలంతా ఆయనను అభినందించేందుకు కదలివచ్చారు. ‘‘ప్రజల వెనుకుబాటుతనం అంటే ఏమిటి?’’ ప్రతి సమావేశంలోనూ దళితులు, ఓబీసీలు, ఈబీసీలు, మైనారిటీలను ఈప్రశ్న అడుగుతూనే ఉన్నారు. దేశంలో ఓబీసీలు 50శాతం, దళితులు 15శాతం, గిరిజనులు 8శాతం ఉన్నారు. వీరు మొత్తం కలిస్తే 73శాతం ఉన్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న 200 కంపెనీలలో 73శాతానికి చెందిన వారిలో ఒక్కరు కూడాలేరు. అలాగే ఉన్నతస్థాయి మేనేజిమెంటులోనూ, అతి పెద్ద ఆస్పత్రి నిర్వహణలోనూ 73శాతం నుంచి ఒక్కరు కూడాలేరు. 90మంది అధికారులు దేశాన్ని నడిపిస్తున్నారు. బడ్జెట్‌ను వీళ్లే కేటాయిస్తారు. 90మంది ఐఏఎస్‌ అధికారులలో ముగ్గురు మాత్రమే దళితులు, ఆదివాసీలు ఉన్నారు. ఈ అంశాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ఈ తరగతులవారిని దోపిడీ చేయడం వారిపేదరికాన్ని ప్రస్తావిస్తూ గ్రామీణ ఉపాధిపథకం కింద పనిచేసేవారిని గుర్తు చేశారు. మీ దృష్టినంతా మళ్లిస్తున్నారు. కొన్ని సమయాల్లో పాకిస్తాన్‌లో ఏమి జరుగుతుందో చూడండి అంటారు. మరికొన్ని సమయాల్లో చైనా వలే మనం అభివృద్ధి చెందుతున్నామని చెబుతారు.
కాంగ్రెస్‌ మారిన లక్షణాలను పని విధానాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు గమనించవచ్చు. మోదీ ప్రసంగాలతో పోలిస్తే, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రసంగాలలో తేడా గమనించవచ్చు. దేశంలో ప్రజల సాంఘిక, ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచేందుకు దళితులు, ఓబీసీలు, ఈబీసీలు, ముస్లింలు తమ హక్కులను గుర్తించి తగినవిధంగా స్పందించాలని కోరారు. జమిందారులు, పెద్ద భూస్వాములు ప్రతాప్‌ఘర్‌, అమేధీ, రాయ్‌బరేలి ప్రాంతాలలో ఉండి పేరుప్రతిష్టలను పొందుతున్నారు. అయితే దళితులు, ఓబీసీలు, ఈబీసీలకు హక్కులు, గుర్తింపు లేకపోవడం చాలా ఆశ్చర్యం కలుగుతోంది. భూస్వాములు వీరిని అణచివేతకు గురిచేయడం, హింసించడం జరుగుతోంది. ఈ పరిస్థితులను మార్పు చేసేందుకు కాంగ్రెస్‌ తగిన సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. బీజేపీని మాత్రమేకాకుండా సమాజ్‌వాది పార్టీ అందోళనకు గురవుతున్నాయ న్నారు. మేధావులు, చదువరులు, రాజకీయ విశ్లేషకులు తనను కాన్షీరాం, అంబేద్కర్‌, బాబా సాహెబ్‌లాగా ప్రసంగిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌ 17సీట్లు మాత్రమే ఇస్తానని ఎక్కువ ఇవ్వకుండా ఉండాలని ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. వారణాసిలో జరిగిన యాత్రలో అప్నాదళ్‌(కమెర్వాడి) నాయకుడు పల్లవి పటేల్‌, సమాజ్‌వాది పార్టీ ఎంఎల్‌ఏ తదితరులు పాల్గొన్నారు. అఖిలేష్‌యాదవ్‌ వారణాసి యాత్రలో పాల్గొంటారని భావించారు. అయితే ఆయన పాల్గొనలేదు. కాంగ్రెస్‌ 17సీట్లకు అంగీకరించనట్లయితే తాను రాహుల్‌యాత్రలో పాల్గొంటానని అన్నారు. ఆయనఅలా షరతుపెట్టడం బహుశా రాహుల్‌కు నచ్చలేదు. దళితులు అత్యధికంగా ఇప్పటికే సమాజ్‌వాది పార్టీకి దూరమయ్యారు. ముస్లింలు కూడా ఆ పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు. అనేకమంది ముస్లిం నాయకులు సమాజ్‌వాదిని వీడి కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారు.
మోదీ వ్యతిరేక శక్తులు, పార్టీలు అఖిలేష్‌ వైఖరిపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ముస్లిం నాయకుడు అజాంఖాన్‌ను అవమానించారనే అంశాన్ని ముస్లింలు మరువలేరు. అలాగే గ్యాంగ్‌స్టర్‌`రాజకీయ నాయకుడు ముక్తార్‌ అన్సారీ తమ్ముడు అఫ్జల్‌ అన్సారీ కూడా ఎస్‌పీకి దూరమయ్యారు. ఆయన ప్రస్తుతం ఘాజీపూర్‌ నుంచి బిఎస్‌పి ఎంపీగా ఉన్నారు. ఆయనను 2023 ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్‌ నిరోధక కేసులో నేరస్తుడుగా నిర్ధారించి నాలుగేళ్లు జైలుకు పంపారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌మీద బైటఉన్నారు. సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఆయన ఎంపీ స్థానానికి అనర్హుడుగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో ముస్లింలు ఎక్కువగా కాంగ్రెస్‌వైపు చేరుతున్నారు. రాష్ట్రంలో కనీసం 10జిల్లాల్లో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. ఘాజీపూర్‌, అమ్రోహ, బల్లియా, మావ్‌, అంజాఘర్‌, భదోపి, జాన్‌పూర్‌, మీర్జాపూర్‌, చందౌలీలో మైనారిటీలు ఎక్కువ. చాలాకాలం తర్వాత రాహుల్‌ ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఈసారి మైనారిటీలు కాంగ్రెస్‌కి ఎక్కువగా దగ్గరవుతారని భావిస్తున్నారు. గతంలో ములాయంసింగ్‌ ఉన్నప్పుడు ఎస్‌పీకి ముస్లింలంతా ఎక్కువగా అనుకూలంగా ఉండేవారు. యూపీ పశ్చిమప్రాంతంలో బీజేపీకి ముస్లింలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ జాట్లు కూడా బీజేపీని దూరంగా ఉంచారు. ఈ నెల 13వ తేదీన రైతుపోరాటం ప్రారంభించిన తర్వాత బీజేపీపట్ల వ్యతిరేకత పెరిగింది. యూపీ పశ్చిమ ప్రాంతంలో 18జిల్లాల్లో బీజేపీని అటు ముస్లింలు, ఇటు జాట్లు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. మాట్లాడటంలో మరింత దూకుడు పెరిగింది. జాట్లను యూపీలో ఓబీసీలుగా పరిగణిస్తారు. అఖిలేష్‌ తమ పార్టీనుండి పోటీచేసే 11మంది అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో మూడు సీట్లలో కాంగ్రెస్‌ గెలుపొందే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img