Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విభజన రాజకీయాలకు మేలి ముసుగు

మక్కెన సుబ్బారావు

దూకుడే ఆత్మరక్షణకు ఉత్తమమార్గం అనేది క్రీడల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఉత్తమైన ఆయుధం. ఏప్రిల్‌మే మాసాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇదే ఎత్తుగడ అనుసరిస్తోంది. ముందుగానే ఏర్పడిన 28పార్టీల ప్రతిపక్షపార్టీల కూటమి (ఇండియా) లో స్తబ్దత ఏర్పడిన దశలో బీజేపీ దూకుడు మొదలుపెట్టింది. ‘మూడోసారి మోదీ ప్రభుత్వం బీజేపీకి 370 సీట్లు (ఆర్టికల్‌ 370ని రద్దు చేయటాన్ని గుర్తుకుతెచ్చేలా) ఏన్‌డీఏకు 400లకు పైగా) అనే నినాదాన్ని ముందుగా ప్రచారంలోకి తెచ్చారు. తదుపరి జనవరి 22న అయోధ్య రామాలయంలో బాలరామునికి ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించి, 500 ఏళ్ల నిరీక్షణ తదుపరి ‘రామ జన్మ భూమి’లో రామాలయాన్ని వాస్తవం చేసిన హిందూ మతోధ్ధారకునిగా ఆకాశానికెత్తారు. సమన్యాయం, సమధర్మం, సకల జనసంరక్షణకు ప్రతీకగా భావించబడే ఊహాజనితమేకావచ్చు, ఆదర్శనీయమైన సమాజనిర్మాణానికి సంకేత పదప్రయోగమైన ‘రామరాజ్య’ నిర్మాణాన్ని మోదీ ప్రారంభించినట్లుగా ప్రచారం ఉధృతం చేశారు. రెండవ పదవీ కాలంలో ఎన్నో సవాళ్లను అధిగమించి అభివృద్ధి సాధించాం. ఆర్థిక వ్యవస్థను 4వ స్థానానికి తెచ్చాం. ఆర్టికల్‌ 370 రద్దుచేసి దేశమంతటికీ ఒకేరాజ్యాంగం అమలులోకి తెచ్చాము. భారతజాతి సంస్కృతి ఆత్మ అయిన ఆ మహాపురుషుని జన్మస్థానంలో బాలరాముని ఆలయం నిర్మించాం. ప్రాణప్రతిష్ఠ చేశాం. మూడవసారి అధికారం మరీ ముఖ్యం. సాధించాల్సిన ముఖ్యమైన పనులెన్నో ఉన్నాయి. ఆర్థికవ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చి ప్రపంచంలో 2వ స్థానానికి చేర్చాలి. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటిత అజండా ప్రకారం కాశీలోని విశ్వనాధ ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదును, మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం పక్కనేఉన్న షాహి ఈద్గా మసీదును ఊరు బైటకుపంపి హిందువులకు ప్రధానమైన మూడు పుణ్యస్థలాలను సంపూర్ణంగా విముక్తిచేసి హిందూ మెజారిటీ ఆధిక్యతను స్థిరపరచాలి. కోర్టులద్వారా ఈ లక్ష్యసాధన కృషి ప్రస్తుతం జరుగుతోంది. పౌరులందరికీ ఏకరూప పౌరస్మృతి అమలులోకి తేవడం వారి ఎజండాలో మరో ముఖ్యాంశం. దీనికి సంకేతంగా ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి ఉమ్మడి పౌరస్మృతికి ఇటీవల శాసనసభ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపింది. లేబర్‌ కోడ్‌లను కూడా రాజస్థాన్‌ అసెంబ్లీలో ఆమోదంపొంది ఆ తర్వాత వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టాలుగా మార్చటం గుర్తుచేసుకోదగినది. మన దేశాన్ని ప్రపంచ మిత్రదేశంగా మార్చాం. ఇక వివిధరంగాల్లో సంక్షేమ రంగంలో గత పదేళ్లలో సాధించిన అభివృద్ధి అంటూ మీడియాలో రాత్రింబవళ్లు ఆవిరామ ప్రచారం సాగిస్తూ, వికసిత (అభివృధ్ధిచెందిన) భారత్‌ లక్ష్యసాధనకై మళ్లీ మోదీకే ఓటు వేయండి అని ఊదరగొడుతున్నారు. ఈ ప్రచారం వింటుంటే, 2004 ఎన్నికలకు ముందు ‘భారత్‌ వెలిగిపోతోంది’ అని వాజ్‌పేయి అద్వానీ ప్రభుత్వం సాగించిన పబ్లిసిటీ దుమారం గుర్తుకు రాకమానదు. అయితే ఆ ఎన్నికల్లో ‘కమలం’ రెక్కలు విరిగిపోయాయి. అయితే మోదీషా ఆ పరిస్థితిరాకుండా, ప్రతిపక్షాలను దెబ్బతీసే వ్యూహాలు రచిస్తున్నారు. అమలుచేస్తున్నారు. ఎన్ని ఆకర్షణీయమైన, ఆవేశపూరితమైన ప్రసంగాలుచేసినా పూసలో దారంలో కనిపించేది ముస్లిం మైనారిటీల వ్యతిరేకత, హిందువులను ఐక్యపరచటం. అందుకే వెనుకబడిన తరగతుల ఉద్ధారకులుగా ప్రచారం చేసుకుంటున్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని(అసంపూర్ణ దశలోనే) కీర్తిస్తూ, ఆ ఘనతను ప్రధాని మోదీకి ఆపాదించే రామరాజ్య నిర్మాతగా ప్రశంసిస్తూ పార్లమెంటుచే తీర్మానం ఆమోదింపచేయటం లౌకిక రాజ్యాంగం అమలులోఉన్న దేశంలో పాలకపార్టీకి తగునా? గత ఎన్నికల్లో పుల్వామాలో టెర్రరిస్టు ఘాతుకంగా ప్రచారం చేసి ప్రయోజనం పొందినట్టుగా, వచ్చే ఎన్నికల్లో రామాలయం బీజేపీకి ఓట్ల వర్షాన్ని మోదీషాలు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లభించే ఓట్లు 37 నుండి 51కి పెరగాలని ఇందుకుగాను ప్రతిబూత్‌లో 370 ఓట్లు అదనంగా వేయించేందుకు కార్యకర్తలు ఇప్పటినుండి నిద్రాహారాలు మాని పాటుపడాలని పార్టీ జాతీయసమితి సమావేశంలో నిర్దేశించారు. దీనితోపాటు ఒబీసీలను ఆకట్టుకునే వ్యూహాలతోపాటు, ఎన్‌డీఏ కూటమిలో ఎప్పుడో ఒకప్పుడు భాగస్వాములుగాఉండి ఏదో ఒక కారణంగా బైటకువెళ్లిన పార్టీలను తిరిగి రాబట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గోడమీద పిల్లిలాంటి నితీశ్‌కుమార్‌ జెడీయు (బీహార్‌)ను వెనక్కిలాగారు. శివసేనను చీల్చారు. పదవుల ఎరవేసి ఎన్‌సీపీని కూడా చీల్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుపేరుతో డీడీపీని తిరగి ఎన్‌డీఏలోకి లాగారు. సీట్ల పంపిణీయే తరువాయి. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ పోరాటం కాబట్టి (మరోవైపు కేసుకు వేధింపులు కూడా) జనసేనతోపాటు బీజేపీ స్నేహంకూడా రాజకీయ అవసరమైంది. ఎన్‌డీఏలోకి పోవటం, బైటకురావటం ఆయనకు అలవాటే. మరోవైపున ఆకాలీదళ్‌తో కూడా పునరాగమన చర్చలు జరుగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత సమస్యపై మళ్లీ దిల్లీని చుట్టుముడుతున్న రైతుల సమస్య పరిష్కారమైతే ఈ పొత్తు కుదురుతుంది. అంటే సంస్థాగతంగా, పొత్తులపరంగా, ప్రచారపరంగా బీజేపీఎన్నికలకు సర్వసన్నద్ధమవుతోంది. గత నెలరోజుల్లో బీజేపీ వ్యూహరచనలు, సన్నద్ధతలన్నీ ఉదృతం కాగా, ప్రత్యర్థి ‘ఇండి’ కూటమిలో క్రియాశీలత కొరవడి స్తబ్దత కనిపిస్తోంది. నాయకత్వ లోపం స్పష్టమవుతోంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ ఎన్నికల తర్వాత చూసుకుందాం కూటమి సంగతి అంటున్నారు. కాబట్టి ఇండికూటమి వేగవంతంగా క్రియాశీలతకు నోచుకోకపోతే కూటమి ఏర్పాటు ఆరంభ శూరత్వమే కాగలదు.
హిందీ భాషా ప్రాంతాల్లో ప్రభావశాలిగా ఉన్నా బీజేపీకి గత ఎన్నికల్లోనే గరిష్టంగా లోక్‌సభ స్థానాలు లభించినందున ఈ పర్యాయం అదనపు ఫలం ఉండబోదు. అందుకని కర్నాటక మినహా తమ ఉనికి నామమాత్రంగాఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఓట్లు సంపాదించటంపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుపై కేంద్రీకరించారు. బీజేపీ ప్రచార దూకుడువెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే. తమ పాలనా వైఫల్యాలు, ఆశ్రిత పెట్టుబడీదారీ విధానాలు, నిరుద్యోగం, ధరలభారం తదితర రోజువారీ బాధలగూర్చి ప్రజలు ఆలోచించే అవకాశమివ్వకుండా భావోద్వేగాల్లో ముంచటం. బీజేపీ ప్రధానంగా మహిళలు, యువత, పేదల అనుకూల విధానాలు, అభివృద్ధి సమస్యలపై తమ ప్రచారాన్ని కేంద్రీకరించాలని నిర్ణయించింది. ప్రచార సాధనాలన్నీ దానిచేతిలోనే ఉన్నాయి. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసినా వారికేమీ డబ్బుకు కొదవలేదు. వందల కోట్లు మూలుగుతున్నాయి. ప్రతిపక్షకూటమి ఇన్ని అననుకూలతలను అధిగమించి బీజేపీని ఢీ కొనాలి. అందుకు తగిన సన్నద్ధత ఏదీ?
కొసమెరుపు: మోదీ ఒబిసి కాదా? ‘ఇంత పెద్ద ఒబిసి ఎదురుగాఉన్నా మీరు (ప్రతిపక్షాన్ని ఉద్దేశించి) గుర్తించటంలేదు’ అని ప్రధాని మోదీ స్వంతంగా పార్లమెంటులో అన్నారు. వాస్తవం ఏమిటి? మోదీ వెనుకబడిన తరగతుల కులంలో జన్మించలేదని రాహుల్‌ గాంధీ బైటపెట్టారు. రాహుల్‌ తమ నాయకుణ్ణి అవమానించారంటూ బీజేపీ వారేఅసలు విషయం బైటపెట్టారు. మోదీ కులం మోదీ`గాంచి. ‘తెలిక కమ్యూనిటీ 1994లో రాష్ట్ర ఓబీసీ జాబితాలో చేర్చడమైంది. అప్పుడున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే 2000 సంవత్సరంలో కేంద్ర ఓబీసీ జాబితాల్లో చేర్చబడిరది. 2001లో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా దిల్లీ నుండి పంపబడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంఫ్‌ు బాధ్యతల నుండి ప్రజాప్రాతినిధ్య బాధ్యతల్లోకి వచ్చారు. 2014లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు.
సీనియర్‌ జర్నలిస్టు
ఫోన్‌:9390683756

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img