Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జర్నలిస్టునే జడిపిస్తారా?

ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో ఎన్నికల ముందు సీనియర్‌ జర్నలిస్టు, లాహోర్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు ఆజమ్‌ చౌధురి ఇంటిపై కొందరు దుండగులు దాడిచేసి, అతని చొక్కావిప్పి, చితగ్గొట్టి, తీవ్రంగా గాయపరిచి, ఇంటిని తగలబెడతామని బెదిరించారు. సగం సైనిక నియంతృత్వ పోకడలతో సాగే పాకిస్థాన్‌లో ఈ ఘటన జరగడం సర్వసాధారణం. అయినప్పటికీ, అక్కడ రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛకు పట్టంకట్టిన సందర్భాలు ఉన్నాయి. అది పాకిస్థాన్‌, కానీ ఇది భారతదేశం. ప్రజాస్వామికదేశం. రాజ్యాంగం కల్పించిన ఎన్నో హక్కులతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారని ఆశించే దేశం. అయినా పాలకులు తమ స్వార్థపూరిత లక్ష్యాల కోసం పత్రికాస్వేచ్ఛను అణగదొక్కుతున్నారు. మోదీపాలనలో చాలావరకు పత్రికాస్వేచ్ఛ హరించుకుపోయిందని చెప్పడానికి వందలాది మంది జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల అరెస్టులే సాక్ష్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి దాపురించడం ఆందోళనకరం. పాత్రికేయులపై వరుస దాడులతో ఏపీ అట్టుడికిపోతున్నది. అనంతపురం జిల్లా రాప్తాడులో మూడు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శ్రీకాంత్‌పై వైసీపీ కార్యకర్తలు జెండా కర్రలతో కొడుతూ దాడికి తెగబడ్డారు. కిందపడేసి కాలితో తొక్కుతూ, తన్నుతూ హింసించారు. వెంటాడివేటాడి చేసిన ఈ దాడి అమానుషం. ఒక దశలో అతన్ని చంపడానికైనా ‘సిద్ధం’ అని బాహాటంగానే వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రకటించాయి. ఇది జరిగి రెండురోజులైనా గడవకముందే కర్నూలులో వైసీపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్న వందలాది మంది దుండగులు ఈనాడు కార్యాలయంపై దాడి చేసి కొన్ని గంటలపాటు బీభత్సం సృష్టించి, పాత్రికేయుల్లో భయానక వాతావరణం సృష్టించారు. ఓవైపు ఈ ఘటన జరుగుతుండగానే, మరోవైపు ఇదే జిల్లాలోని మద్దికెరలో వైసీపీ మూకలు ఆంధ్రజ్యోతి విలేకరి కే.వీరశేఖర్‌పై ‘మాకే వ్యతిరేక వార్తలు రాస్తావా?’ అంటూ దాడికి పాల్పడ్డారు. అతని చొక్కాచింపి, దారుణంగా కొట్టారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వంత మండలకేంద్రంలో ఆమె సమక్షంలోనే జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అంతకుముందు, న్యూస్‌టుడే విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావుపై అమరావతి ఇసుకమాఫియా దాడిచేసి, హత్యాయత్నానికి పాల్పడిరది. అతన్ని అక్రమంగా నిర్బంధించి, విచక్షణారహితంగా కొట్టి, గాయపరిచి, పెట్రోల్‌ పోసి తగలబెడతామంటూ హెచ్చరించింది. పది రోజుల క్రితం ఏలూరు సమీపంలోని దెందులూరులో జరిగిన సిద్ధం సభలో ఐదారుగురు వీడియో జర్నలిస్టులపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కెమెరాలు ధ్వంసం చేశారు. ఒక మహిళా పాత్రికేయురాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసిన వైనం కన్నీళ్లను తెప్పించింది. పాలకపక్షానికి చెందిన పత్రికలో పనిచేస్తున్న ఓ విలేకరి వారి ఒత్తిడి తట్టుకోలేక లావేరులో ఆత్మహత్య చేసుకున్నట్లు జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి. ఇలా పాత్రికేయులపై కొనసాగుతున్న భౌతికదాడులు ఈ దేశంలో, రాష్ట్రంలో స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఉన్నాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక బెదింపులు, ప్రెస్‌మీట్లలో దూషణలు, ‘నీ అంతుతేలుస్తాం’ వంటి హెచ్చరికలు, తమకు నచ్చని విలేకరులను సమావేశాలకు రాకుండా అడ్డుకోవడాలు, నచ్చని పత్రికలను తగలబెట్టడాలు సర్వసాధారణమైపోయాయి. రాజకీయాల నడుమ సగటు జర్నలిస్టు నలిగిపోయి, అభద్రతాభావానికి లోనవుతున్నాడు.
పత్రికలపై, పాత్రికేయులపై దాడులు జరగడం కొత్తకాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తున్న ఈ దుష్పరిణామం భయోత్పాతాన్ని కలిగిస్తున్నది. ప్రింట్‌మీడియా, ఆ తర్వాత ఎలక్ట్రానిక్‌ మీడియా విస్తరించడం, ఇప్పుడు సోషల్‌మీడియా కూడా వాక్‌స్వాతంత్య్రానికి ప్రధాన వేదికగా మారడంతో అక్రమార్కులు, అరాచకీయ శక్తుల ఆగడాలు బట్టబయలైపోతున్నాయి. భరించలేని ఈ శక్తులన్నీ కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఏకమై భావస్వేచ్ఛ పీకనొక్కే ప్రయత్నానికి ఒడిగడుతున్నారు. ప్రపంచీకరణ ఆవిర్భావం తర్వాతనే అంటే అటుఇటుగా 1993 నుంచి జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెపుతున్నాయి. ఆనాటి నుంచి ఏకంగా 1600 మంది జర్నలిస్టులు దారుణహత్యకు గురయ్యారంటే ‘స్వేచ్ఛావాయువుకే ఊపిరిసలపడం లేద’ని అర్థమవుతోంది. 201216 మధ్య 530 మంది, 201620 మధ్య 400 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని యునెస్కో నాలుగేళ్ల క్రితం ఆందోళన వ్యక్తంచేసిన అంశం ఈ సందర్భంలో ప్రస్తావనార్హం. 2022లో ఒకే ఏడాదిలో 86 మంది ప్రింట్‌ మీడియా, 79 మంది ఎలక్ట్రానిక్‌ మీడియా, 55 మంది వెబ్‌ మీడియా జర్నలిస్టులు రాజకీయ, మాఫియా గూండాల చేతిలో బలయ్యారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరుతూ 2023 నవంబరు 2వ తేదీని ‘‘అంతర్జాతీయపాత్రికేయ దినోత్సవం’’ జరపాలని ఐరాస ప్రకటించింది. అదేరోజు అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ గడిచిన పదిహేను మాసాల్లోనే వివిధ దేశాల్లో వందలాది మంది పాత్రికేయులు అసువులుబాసారు. మన దేశంలో 1992 నుంచి 2022 మధ్యకాలంలో అధికారిక లెక్కల ప్రకారం, 61 మంది జర్నలిస్టులు హత్యకు గురికాగా, 25 మందిని తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేశారు. ఇక అనధికారిక లెక్కల ప్రకారం, గత పదేళ్లలో 154 మంది జర్నలిస్టులు కత్తిపోట్లకు, బుల్లెట్లకు, ఇసుకలారీల టైర్లకు బలయ్యారు. ఇంకా ఎందరో హక్కుల కార్యకర్తలు మరణించారు. వందలాది మంది జైలు పాలయ్యారు. వారికి బెయిల్‌ రాకుండా ప్రభుత్వాలు తమ జేబు సంస్థలుగా మారిన దర్యాప్తు సంస్థల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉండటం దారుణం. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన తర్వాత జర్నలిస్టులపై వందలకొద్దీ దాడులు జరిగాయి. టీడీపీ పాలనలో నర్సరావుపేట, నంద్యాల కేసులే ఇందుకు ఉదాహరణ. ఒక విలేకరిని దారుణంగా చంపేసిన ఉదంతం మర్చిపోలేం. ఇక జగనమోహన్‌్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చ పత్రికలు, నీలి పత్రికలంటూ పత్రికల మధ్య యుద్ధమే జరుగుతోంది. ఈ పోరులో పాత్రికేయులు సమిధలు కావడం విషాదకరం. తాజా ఘటనల నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలతోపాటు వేలాది మంది పౌర హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్య హితైషులు రోడ్డెక్కి దాడులను ఖండిస్తున్నారు. అమెరికాలో పాత్రికేయులపై దాడుల పెరిగిన విషయాన్ని అమెరికన్‌ కాంగ్రెస్సే గుర్తించింది. దాడుల నివారణకు చర్యలకు ఉపక్రమించింది. కానీ మన పార్లమెంటులో ఆ ఊసేలేదు. ప్రతిపక్ష ఎంపీలందర్నీ సస్పెండ్‌ చేసి, రాక్షస బిల్లులకు ఆమోదముద్ర వేసే అతిచేష్ఠలు అధికమయ్యాయి. ఇక పత్రికాస్వేచ్ఛ గురించి పాలకవర్గాల మెదళ్లకు ఎక్కుతుందా? దాడులకు వ్యతిరేకంగా, అలాగే, జర్నలిస్టుల భద్రత కోసం ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) ఎప్పటికప్పుడు తన గళాన్ని విప్పుతూనే ఉంది, ఉద్యమిస్తూనే ఉంది. తాజాగా ఏపీయూడబ్ల్యుజే 22వ తేదీన ‘చలో అనంతపురం’నకు పిలుపునిచ్చింది. ఏపీలో దాడుల విషయంలో అరాచకశక్తుల ఆగడాలను ఖండిస్తూ అమరావతి ముట్టడికి సన్నద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. జర్నలిస్టును జడిపిస్తే పరిణామం ఎలా ఉంటుందో సర్కార్లకు సూటిగా చెప్పాల్సిన సమయమిది!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img