Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఘనంగా జరిగిన ఉమా త్రిలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు..

ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ బసవన్న కట్ట వీధి లో గల శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉమా త్రిలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ దాతలు భక్తాదుల నడుమ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమును అంతా వివిధ పూలమాలలతో, అరటి పిల్లలతో, మామిడి ఆకులతో చేసిన అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ, విజయ్ కుమార్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవ వేడుకలు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించారు. తొలుత ఉదయం గంగపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకాలు అర్చకులు నిర్వహించారు. తదుపరి పుష్పార్చన, కుంకుమార్చన,, మహా నైవేద్యం, మంత్రపుష్పం, మహా మంగళ హారతి, కార్యక్రమాలు భక్తాదులు, దాతలు నడుమ గైకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కళ్యాణోత్సవం వేడుకలు ఆలయ కమిటీ దాతల సహాయ సహకారాలతో నిర్వహించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడంతో పాటు వారి పేరున ప్రత్యేకంగా పూజలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ కళ్యాణమ వేడుకలకు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి కళ్యాణోత్సవ వేడుకలు జరపడం వల్ల సమాజానికి మంచి జరుగుతుందని తెలిపారు. అనంతరం కళ్యాణోత్సవ వేడుకలు చూడటానికి వేలాదిమంది భక్తజనం నడుమ కళ్యాణోత్సవ గడియలను నిర్వహించారు అర్చకులు. తదుపరి ఈ కళ్యాణోత్సవ వేడుకలు వచ్చిన భక్తాదుల అందరికీ దాదాపు వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి సాయంత్రం స్వామివారిని గ్రామ ఉత్సవంగా పట్టణ పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img