Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జబర్దస్త్ సినీ కళాకారుల బృందానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు….

విశాలాంధ్ర ఏలూరు:ఏలూరు జిల్లాలో బిజెపి నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి తరుపున కమల రధం పేరుతో జబర్దస్త్ కళాకారులు, సినీ గాయని, గాయకులతో కూడిన బృందం 25 రోజులలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు నిర్వహించి ప్రచారం చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు గురువారం ఏలూరులోని సుంకరి వారి తోట లో జరిగిన 102వ ప్రదర్శనను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసినట్లు సంస్థ ప్రతినిధి సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అధికారికంగా ప్రకటించారు .ఈ సందర్భంగా కమల రధం ప్రచార బృందాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, జబర్దస్త్ కళాకారులు అదిరే అభి, ఇమ్మానియేల్, అప్పారావు, వినోద్, బాబి, సినీ గాయని, గాయకులు లాస్య ప్రియ, అరుణ్ కౌండిన్య బృందం సభ్యులకు అవార్డును, మెడల్స్ ను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి వరప్రసాద్ మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీ తరఫున సినీ, టీవీ కళాకారులు 25 రోజుల్లో ప్రచార రథం ద్వారా 100 ప్రదర్శనలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావటంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించమన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బిజెపి నేత గారపాటి చౌదరి గత 16 సంవత్సరాల చేస్తున్న సేవ కార్యక్రమాలను బిజెపి గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి ఉదేశంతో కమల రథం పేరుతో తాము ఏలూరు జిల్లాలో నిర్వహించిన ప్రదర్శనలకు మంచి స్పందన లభించడంతోపాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీరామ్ అన్నారు. బిజెపి తరఫున 26 రోజులు పర్యటించి 104 ప్రదర్శనలు పూర్తి చేయటం జరిగిందని జబర్దస్త్ కళాకారుడు అదిరే అభి అన్నారు.ఈ కార్యక్రమంలో దూకుడు సినిమా ఫేమ్ రమణ, రఘు, బిజెపి నాయకులు గాది రాంబాబు, నాగం శివ, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img