Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గ్రామీణ పర్యాటకాభివృద్ధికి మరిన్ని మెరుగులు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్యం ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉన్న గ్రామీణ ప్రాంత అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ పర్యాటక ప్రాంతాలలో వ్యూ పాయింట్లతో పాటు రహదారి నిర్మాణానికి కృషి చేస్తున్నామని ఇందులో భాగంగానే లలోనే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి ప్రాంతంలోని చెరువులవేణం, బోడ కొండమ్మ తదితర ప్రాంతాలలో వ్యూ పాయింట్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి అన్నారు. వైకాపా అరకు పార్లమెంటు సమన్వయకర్త, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వీ అభిషేక్ లతో కలిసి సోమవారం ఆమె చింతపల్లి మండలం లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేణం, చింతపల్లి – నర్సీపట్నం ప్రధాన రహదారిలో ఉన్న బోడకొండమ్మ ఆలయం వద్ద వ్యూ పాయింట్లను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంత అందాలను చూడడానికి వచ్చే పర్యాటక ప్రేమికులను మరింత ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దాలని సంకల్పించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర కశ్మీర్ లో ఎత్తయిన ప్రదేశంగా పేరొందిన చెరువుల వేణం, మైదాన ప్రాంతాల నుండి మన్య ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు భక్తితో పాటు, సుందర ప్రదేశాలలో అందాలను వీక్షించేందుకు వ్యూ పాయింట్ లను అభివృద్ధి పరచేందుకు ఎంపీ లాడ్స్ నిధులు సుమారు 76 లక్షలతో రెండు వ్యూ పాయింట్లు నిర్మాణం పూర్తి చేసి నేడు ప్రారంభించుకోవడం ఈ ప్రాంత వాసిగా తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలలో వ్యూ పాయింట్లతో పాటు రకరకాల పూలతోటలు పెంచి ఈ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధితో పాటు, మరింత ఆదాయం సమకూరే అవకాశాలు ఉంటాయన్నారు. అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులతో పాటు, పిల్లలు ఆడుకునేలా అన్ని సౌకర్యాలను కల్పించాలని, మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి అవసరాలు తీర్చేలా సౌకర్యాలను కల్పించాలని పిఓ ను ఆమె కోరారు.
అల్లూరి జిల్లాలో సహజ సిద్ధంగా ఉన్న అందాలను తిలకించేందుకు లక్షలాది మంది వస్తూ ఉంటారని వారిని మరింత ఆకట్టుకునేలా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెరువులవేణం అతి కొద్ది కాలంలోనే బాగా అభివృద్ధికి నోచుకున్న ప్రాంతంగా పేరు తెచ్చుకుందన్నారు. ప్రకృతి అందాలను, మంచు సోయగాలను తిలకించేందుకు వేలాది మంది వస్తున్న తరుణంలో ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వ్యూ పాయింట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషదాయకమన్నారు. ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ మాట్లాడుతూ పర్యాటకంగానే గాక, లక్షలాది రూపాయల నిధులతో నిర్మించిన వ్యూ పాయింట్లు ద్వారా పర్యాటకులు విశేషంగా విచ్చేసే అవకాశం ఉందన్నారు. పర్యాటక అభివృద్ధిని స్థానిక యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు పూర్తి అయ్యేందుకు కృషిచేసిన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారి యాద కిషోర్ ను వారు దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, స్ధానిక సర్పంచ్ కొర్ర శాంతి కుమారి, ఎంపీటీసీ రావుల నాగమణి, మాజీ సర్పంచ్ కొర్ర రఘునాథ్, వైకాపా సీనియర్ నాయకుడు నూకరాజు, టైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొడ్డేటి మహేష్, వైస్ ఎంపీపీ వెంగళరావు, వివిధ పంచాయతీల సర్పంచ్ లు, ఎంపీటీసీలు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img