Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఈనెల 7వ తేదీన గుంటూరులో భారీ బహిరంగ సభ

. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఇండియా కూటమి పార్టీల లక్ష్యం
. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర : ఈనెల 7వ తేదీన అమరావతి రాజధాని పై ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక హెచ్ ఎల్ సి కాలనీ వద్ద ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో సత్యసాయి, అనంతపూర్ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ … నరేంద్ర మోదీ పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగాలన్నారు. 2047 సంవత్సరం వరకు వికాస్ భారత్ పేరుతో అభివృద్ధి చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ పది సంవత్సరాలలో పేదవాడికి ఏం చేశాడు, రైతుల సమస్యలు ఏమన్నా పరిష్కారం అయ్యాయా, యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించలేని అసమర్ధ ప్రధాని అని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ వెనక్కి తెస్తానని ప్రజలకు మోసం చేశాడన్నారు. అంబానీ ఆదానిలా కార్పొరేట్ సెక్టార్లకు ఊడిగం చేస్తున్నాడన్నారు. వాళ్ల దగ్గర వేలకోట్ల రూపాయలు తీసుకొని ఎన్నికల్లో గెలవడానికి ముందుకొస్తున్నాడన్నారు. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా రేషన్ సప్లై చేస్తామన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి గత పది సంవత్సరాలుగా 20 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు తెలియజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ ప్రభుత్వంగా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా కూటమి ఏర్పడి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 7న అమరావతి రాజధానిపై గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుటం కోసం ఈనెల 11న విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సమస్యల పైన ఇండియా కూటమి ద్వారా ముందుకు సాగుతామన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని బలోపేతం చేసుకొని ఇండియన్ గద్ద దింపడంమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నగరంలో ఐదు లక్షల మందితో భారీ ర్యాలీ జరిగిందన్నారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గే, అఖిల్ యాదవ్, సీతారాం ఏచూరి, రాజా పాల్గొన్నారు. నరేంద్ర మోడీ దీన్ని ఇంటికి సాగనంపడానికి ఎన్డీఏ పార్టీలందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశం లో జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేముల యాదవ్, అనంత జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి, శ్రీరాములు, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img