Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

హైతీలో అత్యవసర పరిస్థితి

రెచ్చిపోతున్న సాయుధ మూకలు…ఘర్షణల్లో 12 మంది మృతి

పోర్ట్‌ ఔ ప్రిన్స్‌: కరేబియన్‌ దేశమైన హైతీలో మూడు రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ జైలుపై ఆదివారం సాయుధ మూకలు దాడి చేయడంతో వేల సంఖ్యలో కరుడుగట్టిన నేరగాళ్లు పారిపోయారు. ఇప్పటివరకు అక్కడ జరిగిన ఘర్షణల్లో 12 మంది మృతి చెందగా… 4వేల మంది ఖైదీలు పరారయినట్లు సమాచారం. వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 2021లో దేశాధ్యక్షుడు జువెనల్‌ మోయిసె హంతకులు కూడా ఇదే జైలులో ఉన్నారు. వారు తప్పించుకున్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రధాని హెన్రీ రాజీనామా చేయాల్సిందేనని అక్కడి సాయుధ మూకల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానిక గ్రూపులను సమన్వయం చేసుకొంటూ బార్బెక్యూ అనే నేరగాడు ఈ దాడులు చేపట్టాడు. ప్రస్తుతం ఆ గ్రూపులు రాజధానిని 80శాతం తమ అధీనంలోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ దేశంలో 2020 నుంచి జరుగుతున్న గ్యాంగ్‌వార్‌లలో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని సాయుధ మూకలు దాడులు చేశాయి. దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా వారి లక్ష్యాల్లో ఉంది. 2021లో మోయిసె హత్య తర్వాత హెన్రీ బాధ్యతలు చేపట్టారు. నాటినుంచి పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలను తరచూ వాయిదాలు వేస్తున్నారు. ఈ దేశంలో దాదాపు 10 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగడం లేదు. హైతీలో 1.1 కోట్ల మంది ఉండగా… జాతీయ పోలీస్‌ దళంలో కేవలం 9,000 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సాయుధ ముఠాలను అదుపుచేయడం కష్ట సాధ్యమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img