Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు


విశాలాంధ్ర, సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ అదేశాలు, సూచనలు మేరకు మండలంలోని అన్ని గ్రామ సచివాలయంలో రక్తహీనత నివారణ కమిటీలు ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించి మండలస్థాయిలో ఎంపిడిఓ, ఐసీడీఎస్ పిఓ, ప్రాదమిక వైద్యులు పర్యవేక్షణ కమిటీగా ఉండి తగు చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఎంపిడిఓ ఎం ఈశ్వరరావు తెలిపారు. గత రెండు రోజులుగా సచివాలయపరిధిలోని సమావేశాలు కూడా నిర్వహించామని చెప్పారు. ఇప్పటికే సీతానగరం, పెద అంకలం ప్రాదమిక ఆరోగ్య కేంద్రాల పరిదిలోగల 21గ్రామ సచివాలయంలలో ఎనిమిక్ తో ఉన్నవారిగా దాదాపు 200మందిని వైద్యసిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది గుర్తించారని వైద్యులు రాధాకాంత్, పావనిలు నివేదిక అందజేసినట్లు తెలిపారు.సచివాలయం సిబ్బంది ఒక్కొక్క ఉద్యోగి సగటున ఒకరు లేదా ఇద్దరు రక్తహీనత కలిగిన వారిని దత్తత తీసుకొని వారికి ఎప్పటికప్పుడు కలిసి రక్తహీనత తగ్గించే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. రక్త హీనత కలిగిన చిన్నారులకు,గర్భిణీలకు, తల్లులకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషకాహారం తీసుకుంటున్నారా లేదా పరిశీలించి వారికి రక్తంపెరిగేలా అవగాహణ కల్పించాలన్నారు. వారానికి మూడుసార్లు దత్తత తీసుకున్న అధికారులు కలిసి వారి హెచ్ బీ పరిశీలన చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలు, సలహాలు పాటిస్తూ జిల్లాను రక్తహీనతలేని పిల్లలు,తల్లులు, గర్భిణీల జిల్లాగా ఏర్పాటుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీన్ని అంతా ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి అన్నిసచివాలయంలో రక్తహీనత ఉన్న వారిపేర్లును ఏర్పాటుచేసి నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఆయనతోపాటు ఈఓపిఆర్డీ కుమార్ వర్మ, పరిపాలన అధికారి ప్రసాద్, వైద్యులు రాధాకాంత్, పావని,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img