ముంబయి : గృహోపకరణాల పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన బీఎస్హెచ్ హాస్గరేట్ జీఎంబీహెచ్ అనుబంధ సంస్థ బీఎస్హెచ్ హోమ్ అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ గృహాల విభిన్న నిల్వ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన బాష్ (బీఓఎస్సీహెచ్) సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ శీతలీకరణ విభాగంలో విప్లవాత్మక మార్పులకు రూపకల్పన చేయబడిన ఈ కొత్త రిఫ్రిజిరేటర్లు వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటంతో పాటుగా విస్తృతమైన పరిశోధనల ఆధారంగా తీర్చిదిద్దటం జరిగింది. ఈ ఆవిష్కరణతో, బీఎస్హెచ్ గృహోపకరణాలు వినియోగదారు అనుభవాలను మెరుగుపరిచేలా 187లీ. నుండి 226లీ. వరకు సామర్థ్యాలతో అందుబాటులో ఉంది, రిఫ్రిజిరేటర్లు అన్ని పరిమాణాల కుటుంబాల అవసరాలకు అనుగుణంగా నిల్వ స్థలాన్ని అందిస్తాయి.