Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వేసవికి ముందే సాయినగర్ లో త్రాగునీటి సమస్య

ఊట నీటిని సేకరిస్తున్న సాయి నగర్ మహిళలు.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – మండల కేంద్రంలోని సాయి నగర్ వీధిలో వేసవికి ముందే త్రాగునీటి సమస్య ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో సాయి నగర్ లో అంతంత మాత్రంగా ఉండే నీటి వనరులు అడుగంటుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోవు రోజులలో ఈ వీధిలో త్రాగునీటి సమస్య మరింత తీవ్రమై మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్లి త్రాగునీటిని సేకరించి తెచ్చుకోవలసిన దుస్థితి దాపురిస్తుందని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీధిలో అత్యధికులు పీవీటిజి సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. పివిటీజీలు నివసిస్తున్న ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నప్పటికీ మండల కేంద్రంలోని సాయి నగర్ వీధిలో ఉన్న పివిటిజి లకు మాత్రం ఆ ఫలాలు అందడం లేదని, కనీసం త్రాగునీటి కల్పనకు కూడా తాము నోచుకోలేకపోతున్నామని సాయి నగర్ వీధిలో పివిటిజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img