London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

అడుగడుగునా షరతులు…ఆంక్షలు

. నేడు దిల్లీలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌
. మధ్యాహ్నం 2.30గంటల వరకే రామ్‌లీలాలో ఉండాలి
. ఐదు వేల మందికి మించకూడదు… ట్రాక్టర్లు తేరాదని ఆంక్షలు
. మార్చ్‌ నిర్వహించబోమని హామీ పత్రం ఇవ్వాలని షరతు
. జయప్రదానికి ఎస్‌కేఎం పిలుపు

న్యూదిల్లీ : మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు సంకల్పించాయి. ఇదే క్రమంలో గురువారం (14వతేదీ) దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ నిర్వహించునున్నాయి. ఈ కార్యక్రమానికి దిల్లీ పోలీసులు అడుగడుగునా ఆంక్షలు, షరతులు విధించారు. రామ్‌ లీలా మైదానంలో మధ్యాహ్నం 2.30గంటల తర్వాత ఉండకూడదని, ఐదు వేల మందికి మించి హాజరు కారాదని, ట్రాక్టర్లను అనుమతించబోమని, దిల్లీలో మార్చ్‌ నిర్వహించమని హామీ పత్రం ఇవ్వాలని షరతలు విధించారు. ఆదేశాలకు కట్టుబడాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరించారు. అన్నింటికీ రైతులు అంగీకరించడంతో మహా పంచాయత్‌కు ఎన్‌ఓసీని దిల్లీ పోలీసులు జారీచేశారు. ఇదే విషయమై డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సెంట్రల్‌) ఎం.హర్ష వర్ధన్‌ బుధవారం ‘పీటీఐ’తో మాటాడుతూ మహాపంచాయత్‌కు అనుమతులు జారీ అయ్యాయని చెప్పారు. ఐదు వేల మందికి మించి రాకూడదని, ట్రాక్టర్లు, ఆయుధాలు తేకూడదని ఆదేశించగా రైతులు అంగీకరించారని తెలిపారు. దిల్లీలో మార్చ్‌ నిర్వహించబోమని రైతుల నుంచి హామీ పత్రాన్ని తీసుకున్నట్లు వెల్లడిరచారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకే మహాపంచాయత్‌కు అనుమతి ఇచ్చామని, ఆ తర్వాత రామ్‌ లీలా మైదానాన్ని ఖాళీ చేయాలని రైతులకు స్పష్టం చేసినట్లు మరొక పోలీసు అధికారి వెల్లడిరచారు. ఆదేశాలను ఉల్లంఘించినా, దిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమకు ఇచ్చిన హామీలకు రైతులు కట్టుబడతారని డీసీపీ ఆకాంక్షించారు.
ఇదిలావుంటే మహాపంచాయత్‌ను జయప్రదం చేయాలంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ‘ఈనెల14న రామ్‌ లీలా మైదానంలో మహాపంచాయత్‌ నిర్వహణకు దిల్లీ పోలీసుల నుంచి ఎన్‌ఓసీ లభించింది. పార్కింగ్‌తో పాటు మంచినీళ్లు, మరుగుదొడ్లు, అంబులెన్స్‌ తదితర ఏర్పాట్లు దిల్లీ మున్సిపల్‌ యంత్రాంగం సహకారంతో జరిగాయి’ అని ఎస్‌కేఎం పేర్కొంది. కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ను జయప్రదం చేయాలని రైతులకు, కార్మికులు, విద్యార్థిమహిళాపౌరసంఘాలకు పిలుపునిచ్చింది. ఈ మహాపంచాయత్‌లో ‘సంకల్ప పత్రాన్ని’ ఆమోదించనున్నట్లు వెల్లడిరచింది. కార్పొరేట్‌ అనుకూల, మతనిరంకుశ విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయడమే కాకుండా వ్యవసాయాన్ని, ఆహార భద్రత, జీవనోపాధి పరిరక్షణకు, కార్పొరేట్‌ లూటీ నుంచి ప్రజలను కాపాడేందుకు తమ ఆందోళనను తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణను మహాపంచాయత్‌ నిర్ణయిస్తుందని ఎస్‌కేఎం వెల్లడిరచింది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రైతులు రైళ్లు, బస్సులు, నాలుగు చక్రాల వాహనాల్లో మహాపంచాయత్‌కు వస్తారని పేర్కొంది. తమ సంఘాల జెండాలు, స్టికర్లను వాహనాలకు పెట్టడం ద్వారా ప్రయాణంలో ఇబ్బందులు రాబోవని, రైతులను దించేసిన తర్వాత ఆయా వాహనాలను వాటి నిర్దేశిత స్థలాల్లో నిలపాలని ఎస్‌కేఎం సూచించిది. మహాపంచాయత్‌ ప్రశాంతంగా, అత్యున్నత క్రమశిక్షణతో జరుగుతుందని తెలిపింది. మహాపంచాయత్‌లో పాల్గొనాలని కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చింది. కేంద్ర కార్మిక సంఘాలు, ఇతర సమాఖ్యలు పాల్గోనున్నట్లు తెలిపింది. బీకేయూ చౌధుని సంఘాన్ని కూడా ఆహ్వానించింది. 202021లో దిల్లీ సరిహద్దుల్లో రైతుల చరిత్రాత్మక పోరులో విజయం సాధించడాన్ని గుర్తుచేసింది. 13 నెలల పోరాటంలో 736 మంది రైతులు అమరులయ్యారని ఎస్‌కేఎం ప్రకటన తెలిపింది. ఇదిలావుంటే నెలరోజులుగా పంజాబ్‌`హర్యానా సరిహద్దుల్లో వందలాది మంది రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. దిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ వద్ద భారీగా పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించి రైతులు రాజధాని నగరంలోకి రాకుండా పహారా కాస్తున్న విషయం తెలిసిందే.
ట్రాఫిక్‌ ఆంక్షలు
రామ్‌లీలా మైదానం వైపుకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను మల్లించినట్లు దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ఒక ప్రకటన చేశారు. రైతుల మహాపంచాయత్‌ ప్రభావం ఉండే మార్గాలను పేర్కొన్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ మార్గ్‌, బారాఖంబా రోడ్డు, బహదూర్‌షా జాఫర్‌ మార్గ్‌, టోల్‌స్టాయ్‌ మార్గ్‌, అసఫ్‌ అలీ రోడ్డు, జైసింగ్‌ రోడ్డు, స్వామి వివేకానంద మార్గ్‌, సంసద్‌ మార్గ్‌, నేతాజీ సుభాశ్‌ మార్గ్‌, బాబా ఖరగ్‌ సింగ్‌ మార్గ్‌, మింటో రోడ్డు, అశోకా రోడ్డు, మహారాజ్‌ రంజిత్‌ సింగ్‌ ఫ్లైఓవర్‌, కనౌట్‌ సర్కస్‌, భశ్‌భూతి మార్గ్‌, డీడీయూ మార్గ్‌, చమన్‌ లాల్‌ మార్గ్‌లో రాకపోకలకు అంతరాయం కలగవచ్చని ప్రకటన తెలిపింది. అలాగే దిల్లీ గేట్‌, మీర్‌ దర్డ్‌ చౌక్‌, అజ్మీరీ గేట్‌ చౌక్‌, గురు నానక్‌ చౌక్‌, కమలా మార్కెట్‌, పహార్‌గంజ్‌ చౌక్‌, రaండేవలన్‌ సర్కిల్‌, మహారాజా రంజిత్‌ సింగ్‌ ఫైఓవర్‌…బారాఖంబా రోడ్డు నుంచి గురు నానక్‌ చౌక్‌, జన్‌పత్‌ రోడ్డు, కేజీ మార్గ్‌ క్రాసింగ్‌ వైపునకు ట్రాఫిక్‌ను ఉదయం 6 గంటల నుంచి మళ్లించనున్నట్లు వెల్లడిరచింది. ఐఎస్‌బీటీ, రైల్వేస్టేషన్‌ లేదా ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన వారు ముందుగానే బయల్దేరితే తప్ప సమయానికి గమ్యస్థానాలను చేరుకోలేరని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img