Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా

ఇచ్చాపురం నియోజకవర్గ వైయస్సార్సిపి ఇన్చార్జ్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ

విశాలాంధ్ర-కవిటి:అక్కచెల్లమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగ మ్మోహన్రెడ్డి ఆర్థిక భరోసాను ఇచ్చారని జెడ్పీ చైర్పర్సన్, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పిరియా విజయ అన్నారు.ఈ మేరకు గురువారం మండల కేంద్రం కవిటి మహిళా సమైక్య భవనం ఆవరణంలో వైఎస్సార్ చేయూత సంబరాలను ఎంపీపీ కడియాల పద్మ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్,ఇచ్చాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పిరియా విజయమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టి ఒక్కో సభ్యురాలుకి ఏటా 18 వేల 500 రూపాయలు చొప్పున అందజేసినట్టు పేర్కొన్నా రు. నాలుగు విడతల్లో ఒకొక్కరికీ 75 వేలు రూపాయలు చొప్పున లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద గత ప్రభుత్వ హయాంలో వారి సంఘాల ద్వారా చేసిన అప్పు మొత్తాలను రుణమాఫీ చేపట్టడం జరిగిందన్నారు.ఈ విధంగా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం శ్రమించిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు.ఇక 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హులైన ప్రతి ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగో విడతగా మండలంలోని 6837మంది లబ్ధిదారులకు 12 కోట్ల 81 లక్షల 94 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. నాలుగు విడతల్లో కలిపి మండలంలో 25,520 వేల మంది లబ్ధిదారులకు గాను 47, 85 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని
వివరించారు.ఈ సందర్భంగా మహిళా సమైక్య సభ్యులతో కలిసి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపి పూడి నేతాజీ, పిఎసిఎస్ అధ్యక్షులు దేవరాజ్ సాహూ,
వైఎస్ఆర్సిపి యువ నాయకులు నర్తు శివాజీ, మండల కోఆప్షన్ సభ్యులు పాండవ చంద్రశేఖర్, ఆర్ బి కే చైర్మన్ దువ్వు కృష్ణారెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ యలమంచి నీలయ్య,నీలాచలం, సర్పంచులు ఎస్పి నారాయణస్వామి దూ భద్రాచలం,పిరియా కృష్ణా రావు,దుద్ది ధర్మారావు, పిరియా ఆనంద్,పి ఎం తిలక్, ఏపీఎం గోవింద్,అకౌంటెంట్ పూడి సువాసిని,ఆపరేటర్ కుసుమ, మండల సమైక్య అధ్యక్షులు,సభ్యులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img