London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 20, 2024
Sunday, October 20, 2024

బాబు నెత్తిన భస్మాసుర హస్తం

ఎంసీ వెంకటేశ్వర్లు

బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమి, ‘‘ఇండియా’’ కూటమి మధ్య త్వరలో లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్నాయి. ఆదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు జరుగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పోలీసు, అధికార యంత్రాంగాలను కీలు బొమ్మలుగా చేసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం అండతో శాసనసభ ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాలనుకున్న ప్రయత్నాలకు అడ్డుకట్టపడిరది. టీడీపీ`జనసేన కూటమిలో బీజేపీ చేరడంతో రాష్ట్ర ఎన్నికలు ఉత్కంఠభరితం కానున్నాయి. అయితే జగన్‌మోహన్‌రెడ్డిని ఓడిరచడానికి టీడీపీ, జనసేన పార్టీలకు కనీసం ఒక శాతం కూడా ఓట్లులేని బీజేపీతో పొత్తు అవసరమా అన్న సందేహాలు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడు తున్నాడని, భవిష్యత్‌లో బాబుకు బీజేపీ భస్మాసుర హస్తం కానున్నదని విమర్శలు ఎదురవు తున్నాయి. ఈ కలయిక వలన ముస్లిం మైనారిటీలు దూరమవుతారని, బాబుకు ఓట్లు, సీట్లు తగ్గుతాయి తప్ప లాభంలేదని సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను, ప్రజా ఉద్యమాలను కర్కశంగా అణచివేస్తూ, అవినీతి, అక్రమాలు, అరాచకత్వానికి పాల్పడుతున్న జగన్‌ మోహన్‌రెడ్డి నియం తృత్వ పాలనకు అంతం పలకడానికి బీజేపీతో మైత్రి అవసరమన్న అభిప్రాయం బలంగా ఉన్నమాట వాస్తవమే. కాని రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే బీజేపీని కూటమిలో చేర్చుకున్నామని చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ దశాబ్దాలపాలన: చంద్రబాబునాయుడు ఐదు సంవత్సరాలు, జగన్‌మోహన్‌రెడ్డి ఐదు సంవత్సరాల పాలన ఒకసారి పరిశీలిస్తే బాబు, పవన్‌ల అసంబద్ద వాదన, డొల్లతనం బహిర్గత మవుతుంది. ఈ నాటికి ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న ప్రత్యేక హోదాను ఉద్దేశపూర్వకంగా నిరాకరించిన చరిత్ర మోదీ, అమిత్‌షాలది కాదా? రాష్ట్ర విభజనపై పార్లమెంట్‌ ఆమోదించిన చట్టం దశాబ్దాల కాలంగా అమలు కాకపోవడానికి బాధ్యత కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంది కాదా? రాష్ట్ర విభజనపై తల్లి, బిడ్డను వేరుచేసిన కాంగ్రెస్‌ బిడ్డను మరిచిపోయిందని, తాను అధికారంలోకి వస్తే తల్లిని, బిడ్డను సంరక్షిస్తానని 2014 ఎన్నికల సందర్భంగా తిరుపతి బహిరంగ సభలో ప్రధాని మోదీ మాత్రం తాను చెప్పిన మాటలను విస్మరించి పోలవరం ప్రాజెక్టుతో సహ విభజిత రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నాడన్నది నగ్నసత్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచింది, గత ఐదుసంవత్సరాలుగా అవినీతి కేసులు విచారణకు రాకుండా కాపాడిరది మోదీ, అమిత్‌షాలు కాదా? విభజన హామీలను నెరవేర్చలేదని, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడని మోదీపై ఆరోపణలు చేసి 2019 ఎన్నికలకు ముందు ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకొని కర్నాటకలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీతో చేతులు కలపడం వాస్తవం కాదా? అదే చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్‌డీఏతో కలుస్తున్నామని చెప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? మోదీ వైఖరిలో మార్పువచ్చిందా లేక అధికారం కోసం బాబు మోదీ ముందు సాగిల బడ్డాడా? ఈ సందేహాలన్నిటిని నివృత్తి చేయవలసిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉంది.
వాస్తవానికి బీజేపీలో మార్పు వచ్చిందని కాని, రాష్ట్రాభివృద్ధి ఎడల మోదీకి ప్రేమ పెరిగిందని భావిస్తే అది భ్రమ మాత్రమే. రాష్ట్రాన్ని అప్పులు ఆంద్రప్రదేశ్‌గా మార్చడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతపాత్ర ఉన్నదో, ప్రధాని నరేంద్రమోదీకి అంతేపాత్ర ఉన్నదనుట యదార్థం. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు, పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లు దుర్వినియోగమవుతున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించు కోలేదన్నది జగమెరిగిన సత్యం. విభజిత రాష్ట్ర ప్రయోజనాలకు సహక రించడంలో గత చంద్రబాబునాయుడు, నేటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలకు మోదీ ప్రభుత్వం మనస్ఫూర్తిగా సహకారం అందించిన దాఖలాలులేవు. నాడు చంద్రబాబునాయుడు ఎన్‌డీఏలో ఉన్న విషయం గమనార్హం. అటువంటప్పుడు నేడు రాష్ట్ర ప్రయోజనాలకు తిరిగి ఎన్‌డీఏలో చేరుతున్నామని చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ ప్రకటిస్తే రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగాలేరు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలు అయినా జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో కీలకపాత్ర వహించవలసిన బాధ్యత ఉంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమైక్యతకు, ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ముస్లింలను, క్రిష్టియన్‌లను శత్రువులుగా చూడటం ఎంత ప్రమాదకరమో ఆలోచించవలసిన అవసరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఉంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలను అనుసరించిందని ఆరోపిస్తూ 2019లో రాజ్యాంగ విరుద్ధంగా ఆమో దించిన పౌరసత్వం సవరణ చట్టాన్ని ఎన్నికల ముందు అమలుకు తీసుకురావడం ఎంత దుర్మార్గమో ఆలోచించాలి. పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌, తదితర దేశాలలో మైనారిటీలుగా ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్‌ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి చట్టంచేసిన మోదీ, ముస్లిం ఛాందస భావాలను వ్యతిరేకించే, ప్రజా స్వామ్యాన్ని కోరుకునే ముస్లింలు నిర్బంధాలకు గురై భారతదేశం వస్తే వారికి మాత్రం పౌరసత్వం ఇవ్వరట. ముస్లింల పట్ల ఎంత విద్వేషాన్ని వెళ్ల గక్కుతున్నారో ఇది స్పష్టం చేస్తోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు నిత్యం ముస్లింలపై దాడులు చేస్తున్నా, వ్యతిరేక హెచ్చరికలు చేస్తున్నా నోరు మెదపని మోదీని దేశ సమైక్యతకు పాటుపడతాడని నమ్మగలమా? చరిత్రలో హిందువులైన శైవులు, వైష్ణవులు దేవాలయాల విధ్యంసం, హత్యలు చేసుకున్న చరిత్ర ఉంది. హిందువులు బౌద్ధులను హత్యలుచేసి, వారి ఆరామాలను ధ్వంసంచేసి దేవాలయాలను కట్టిన చరిత్ర ఉంది. హిందూ దేవాలయాలను ముస్లింలు నేలమట్టం చేసిన చరిత్ర ఉంది. వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ చరిత్రను తిరగదోడి ముస్లింలను దోషులుగా, శత్రువులుగా చూడటం రాజ్యాంగ విరుద్ధం కాదా? అదే విధంగా రాజ్యాంగ బద్ధమైన ఫెడరలిజాన్ని విధ్వంసం చేయడానికి మోదీ పాలన దశాబ్దకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ బిల్లు, నిధుల పంపిణీ, ప్రణాళికా సంఘం రద్దు తదితర అంశాలన్నింటిపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా చట్టాలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే.
అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నించగా, దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలని ప్రయత్నించడం, కాంగ్రెస్‌ ముక్త భారత్‌తో ప్రారంభించి నేడు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలనే రూపుమాపాలని కేంద్రప్రభుత్వం నిర్విరామంగా ప్రయత్నిస్తున్నది. ఆయా పార్టీలలో పదవీ వ్యామోహులను, అవినీతి పరులను ప్రలోభపెట్టి, డబ్బుపెట్టి కొనుగోలు చేయడం, లేదా సీబీఐ, ఇన్‌కంటాక్స్‌, ఈడీ సంస్థల చేత దాడి చేయించడం నిత్యం జరుగు తున్నది. మహారాష్ట్ర, బీహార్‌ నేడు జరుగుతున్న హిమాచలప్రదేశ్‌ తాజా ఉదాహరణలు. ఈ వాస్తవాలను కళ్లున్నా చూడ నిరాకరించి అధికారమే పరమావధిగా భావించి మోదీ దృతరాష్ట్ర కౌగిలిని ఆలింగనం చేసుకుంటే టీడీపీలోనే ‘ఏక్‌నాథ్‌షిండే’ ‘అజిత్‌పవార్‌’ ‘నితీశ్‌కుమార్‌’లను సృష్టించి వెన్నుపోటు పొడుస్తారన్న వాస్తవాన్ని చంద్రబాబు గ్రహిస్తే రాష్ట్రానికి, దేశానికి, టీడీపీకి మేలు జరుగుతుంది.

సెల్‌: 8121223457

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img