864 టెట్రా పాకెట్లు స్వాధీనం…
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు కర్నాటక లిక్కర్ విక్రయిస్తున్న నిందితుడు రమేష్ ను అరెస్టు చేశారు. పక్కాగా రాబడిన సమాచారం మేరకు సి.ఐ ప్రతాపరెడ్డి, ఎస్సై నాగమధుల ఆధ్వర్యంలో స్థానిక వికలాంగుల కొట్టాలకు చెందిన ఇతనిని అరెస్టు చేసి 864 టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక రాష్ట్రం బళ్లారి నుండీ కొనుగోలు చేసి టెట్రా పాకెట్లను అక్రమంగా తరలించి అనంతపురంలో అధిక సొమ్ముకు విక్రయిస్తున్నాడు. ఇతనిపై ఇదివరకే కుందిర్పి పోలీసు స్టేషన్ మరియు అనంతపురం సెబ్ పోలీసు స్టేషన్లలో 3 కేసులు ఉన్నాయి.