Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఆముదాలవలస లో పంచ ముఖ పోటీ !

  విశాలాంధ్ర- ఆముదాలవలస (శ్రీకాకుళం) : జిల్లా రాజకీయాల్లో ఆముదాలవలస కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  ఇక్కడ రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. పార్టీ టిక్కెట్ పై పోటీ చెసే ప్రదాన అభ్యర్థుల మద్య పోరు త్రిము ఖంగా ఉన్నప్పటికీ మరో ఇరువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రచారం జరు గుతుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులుగా వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం, టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూన రవికుమార్ పార్టీ టిక్కెట్లు పొంది ముమ్మర ప్రచారంలో ఉన్నారు. కాంగ్రేసు పార్టీ తరపున మాజీ ఎమ్మె ల్యే బొడ్డేపల్లి సత్యవతి ఆద్వర్యంలో అభ్యర్థి ని ప్రకటించనున్నారు. వైసీపీ నుంచి టికెట్ ఆశించిన సువ్వారి గాంధీ స్వ తంత్ర అభ్యర్థిగా పోటీ చేయను న్నారు. అలా గే టిడిపి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండి ప్రత్యేక కారణాల వలన ఆ పార్టీకి దూరంగా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేం దుకు సనపల సురేష్ కుమార్ సిద్ధ మయ్యా రు. వీరి ఇరువురు కూడా బుధ వారం నుంచి ప్రచారం మొదలు  పెట్టను న్నారు. నియోజక వర్గంలో కాళింగ సామాజిక వర్గం తరువాత రెండవ అతి పెద్ద స్థానంలో ఉన్న కాపుసామా జిక వర్గానికి చెందిన లోలుగు వెంకట రాజ శేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఇప్పటికీ నియో జక వర్గం లోని కొన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. దీంతో నియోజకవర్గంలో ఇరువురు పార్టీ అభ్యర్థులు ముగ్గురు స్వతంత్ర అభ్య ర్థులతో పంచముఖ పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొద ట లో రెండు కుటుంబాల మధ్య ఉన్న రాజ కీయ వర్గ పోరు రాను రాను ఒకే కుటుంబ పోరుగా మారింది. స్వర్గీయ బొడ్డేపల్లి రాజ గోపాల రావు పాలనలో ఏకపక్షంగా ఎన్నికల జరిగేవి. వారి మాటే వేదంగా అప్పుడు ప్రజ లు భావించేవారు. రాజకీయాల్లో మార్పు లు అనివార్యం కావడంతో తెలుగుదేశం పేరుతో ఎన్టీ రామారావు రాష్ట్రంలో పర్యటించి రాజ కీయాల్లో పెను మార్పులు తెచ్చారు.1983లో తెలుగుదేశం పార్టీ తరఫున తమ్మినేని సీతా రాం పోటీ చేసి బొడ్డేపల్లి కుటుంబ రాజకీయా నికి కామ పెట్టారు. అలాగ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మధ్య లో పైడి శ్రీరామ్మూర్తి చేతిలో ఓటమి పాలైన తమ్మినేని ప్రజలు మద్య వుంటూ సమస్యల పై పొరా టం చెసేవారు. శ్రీరామ్మూర్తి మర ణానంతరం  జరిగిన ఉప ఎన్నికలలో విజ యం సాధించా రు. ఉప ఎన్నికల్లో కూడా రాజకీయ ఉద్దండు డు అయిన రాజగోపాల్ రావు పై విజయం సాధించి తమ్మినేని కి తిరుగు లేదని మరొ క సారి జెండా ఎగుర వే శారు. మొదటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోటీ ఉండేది. ప్రజారాజ్యం  కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తమ్మినేని సీతారాం ఆ పార్టీ తరఫున పోటీలో నిలువగ, తెలుగుదేశం అభ్యర్థి గా కూన రవికుమార్ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రవేశించారు. అప్పటినుంచి బావా బావమరిది అయిన రవికుమార్, సీతారాములు ఒకే కుటుంబ సభ్యులు అయి న ప్పటికీ రాజకీయ పోటీలో వర్గాలుగా విడి పోయారు. కుటుంబం కంటే రాజకీయం పైనే ఇరువురు పోటీ ఉండేది. రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రె స్ పార్టీ ఉనికి కోల్పోవడంతో బావ బామ్మర్దు ల మధ్య పోటీ నే ఉండేది. 2014లో రవికు మార్ విజయం సాధించారు.2019లో జగన్ ఫోబియా తో తమ్మినేని సీతారాం విజయాన్ని కైవసం చేసు కున్నారు. ఇప్పుడు పార్టీల మద్ద తుతో వీరి మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ ఇండిపెం డెంట్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ చెసెందు కు ఉరుకులు వేయడం తో పోటీ రస వత్త రంగా మారనుంది. ప్రధాన పార్టీల కు చెందిన ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, కాపు సామా జికవర్గా నికి చెంది న వ్యక్తి స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేస్తున్నా రు. ఈ సామాజిక వర్గం వారు కూడా ఇటీవల పలు సమావేశాలు నిర్వహించు కుని రాజ శేఖర్ అభ్యర్థత్వాన్ని వారి సమా వేశాల్లో ప్రకటించినట్లు తెలిసింది. దీంతో ఆయన ప్రచారాన్ని ఇప్పటికే కొన సాగిస్తు న్నారు. వీరి మధ్య పోటీ ఏ విధంగా ఉన్న ప్పటికీ రాజ కీయ విశ్లేషణలో మాత్రం పంచ ముఖ పోటీ ఉంటుందని వాదన విని పిస్తుంది. నామి నేషన్ ల పర్వం ముగిసేసరికి బరిలో ఎంత మంది ఉంటారు అనేది స్పష్టం అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img