London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

కరువు ముంగిట గాజా ప్రజ

విజయ ప్రసాద్‌

పలస్తీనాలోని గాజా ప్రజలకు తక్షణం ఆహారధాన్యాల సహాయం అందకపోతే కరువుబారినపడి పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం అధిపతి సిండి మెకైన్‌ హెచ్చరించారు. పలస్తీనా మీద ఇజ్రాయిల్‌ దాడి జరిపిన నాటి నుంచి జరిగిన మారణకాండలో 30వేల మందికిపైగా పలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గాజా ప్రాంతంలో ఏ మాత్రం ఆహార సదుపాయం అందకపోతే ప్రజలు కరువు బారిన పడటం తప్పదని ఐక్యరాజ్యసమితి పలస్తీనా ప్రాంతంలో పరిశీలకులు అన్నారు. దాదాపు 50వేల మంది పలస్తీనాలో కరువుకు ఒక అడుగు దూరంలో ఉన్నారు అని తెలిపారు. చిన్నపిల్లలు రాత్రింబవళ్లు ఆహారం లేక ఆకలితో నకనకలాడుతుండగా తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితిలో దు:ఖంలో ఉంటున్నారు. కనీసం పాలు, బ్రెడ్‌ లాంటి పదార్ధాలు కూడా లభించడంలేదు. ఇప్పటికే గాజాప్రాంతంలో కరువులాంటి పరిస్థితులు ఏర్పడి పిల్లలు చనిపోతున్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా కూడా ఇఫ్తార్‌ భోజనం లేకుండానే ఏం చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. శారీరకంగానేకాక, మానసికంగా కూడా పండుగ సందర్భంగా హింసకు గురవుతున్నారు.
2000 మందికిపైగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఈ ప్రాంతంలో మౌలిక ఆరోగ్యసహాయం అందిస్తున్నారు. కనీస ఆస్పత్రి సౌకర్యాలు లేకుండానే వీరు వైద్యసేవలు అందిస్తున్నారు. తరచుగా విద్యుత్తు, తాగునీరు, అందడంలేదు. మందులు కూడా చాలా స్వల్పంగా సరఫరా అవుతున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు సైతం అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో వైద్యసేవలు అందిస్తున్నారని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రశ్నించింది. డాక్టర్లు కూడా మరణిస్తున్నారు. వారితోపాటు చాలామంది నర్సులు చనిపోతు న్నారు. రానున్న రోజుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు ఆకలితో మరణించే అవకాశం కనిపిస్తున్నదని ఐరాస పరిశీలకులు రియాద్‌ మన్సూర్‌ తెలిపారు. 1977 జూన్‌లో సాయుధ సంఘర్షణపై మానవీయచట్టం అమలు సదస్సులో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు జెనీవా కన్వెన్షన్స్‌ (1949) తీర్మానాలను అమలు చేశాయి. ప్రొటోకాల్‌ 2 అమలుకు కన్వెన్షన్స్‌ తీర్మానాలకు ఇవి కూడా జతఅయ్యాయి. 14వ ఆర్టికల్‌ ప్రొటోకాల్‌ ఇలా చెబుతోంది ‘‘పౌరులు కరువుకు గురికావడం ఒక విధమైన హింసకు గురిచేయడమే’’. పస్తులు ఉండటం, హింసకు గురిచేయడం, ధ్వంసం చేయడం, ఎందుకూ పనికిరానివారిగా తయారుచేయడం, ఆహారం లేకుండా ఉంచినట్లయితే పౌరులు జీవించడం కష్టం. వ్యవసాయ ప్రాంతాల్లో పంటలు పండకపోవడం, పశువులు జీవన్మరణ సమస్యను ఎదుర్కోవడం, అక్కడక్కడా తాగునీరు కేంద్రాలను ఏర్పాటుచేయకపోవడం, వ్యవసాయ కూలీలు లభించకపోవడం లాంటివన్నీ కావాలని శత్రువులు చేస్తున్నపనులు.
కావాలని పౌరులను పస్తులకు గురిచేయడం ఒక విధమైన యుద్దమే అవుతుంది. వీరి మనుగడకోసమైనా సహాయం లభించడంలేదు. ఇవన్నీ ప్రజలను శత్రువులుగా చూసి కావాలని చేస్తున్న దుర్మార్గాలే. అంతర్జాతీయ నేర న్యాయస్థానం రూపొందించిన రోమ్‌ ఒప్పందంలోని అంశాలే. ఒప్పందపత్రంలో తప్పనిసరిగా చేయవలసిన పనులపై కూడా మౌనంగా ఉంటున్నారు. ఫిబ్రవరి 29న ట్రక్కుల ద్వారా మానవీయ సహాయాన్ని గాజా ఉత్తరప్రాంతానికి చేర్చారు. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు ఆహారం కోసం ట్రక్కులవైపు పరుగులెత్తారు. ఏమాత్రం మానవత్వంలేని ఇజ్రాయిల్‌ సైనికులు వారిపై కాల్పులు జరిపి కనీసం 118 మంది పౌరులను దారుణంగా చంపారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత 10మంది ఐరాస నిపుణులు తీవ్రమైన ప్రకటన జారీ చేశారు. గత అక్టోబరు 8నుంచి గాజాలోనే పలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్‌ కావాలనే ఆకలి దప్పులకు గురిచేస్తున్నారు. ఆహార సరఫరాకు సంబంధించిన ఐరాస ప్రత్యేక ప్రతినిధి మైఖేల్‌ సక్రి ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. ఆ ప్రకటన ద్వారా ఇజ్రాయిల్‌పైన మరింత తీవ్రంగా విమర్శించారు. పలస్తీనా ప్రజలను మరింతగా ఆకలికి గురిచేస్తున్నారని ఐరాస మానవహక్కుల మండలి ఘాటుగా విమర్శించింది. గాజా ప్రాంతంలో నివసిస్తున్న 23లక్షల మంది ప్రజలకు ముఖ్యమైన ఆహారభద్రత మత్స్యపరిశ్రమే. దీనిపైన సక్రి ఎక్కువగా శ్రద్ధపెట్టారు. అయితే ఆహారం అందకుండా ఇజ్రాయిల్‌ సైనికులు చూస్తూ చేపలు పట్టే ప్రతి బోటును నాశనం చేసున్నారు. రఫప్‌ా రేవులో 40బోట్లకుగాను రెండు బోట్లు మాత్రమే మిగిలాయి. తక్కినవాటిని ధ్వంసం చేశారు. అలాగే ఖాన్‌ యుమిస్‌ ప్రాంతంలో 75 చిన్నచిన్న చేపలుపెట్టే బోట్లను కూడా పనికి రాకుండా చేశారు. వీటన్నిటి ప్రతిఫలంగా గాజా ప్రజలు ఆకలి, దప్పులకు గురవుతున్నారు.
17 సంవత్స రాలకుపైగా ఇజ్రాయిల్‌ గాజా ప్రాంత ప్రజలు నిర్బంధానికి గురవుతున్నారు. వీరికి మత్స్యకార ప్రాంతాన్ని అందుబాటులో లేకుండా చేశారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో పలస్తీనాకు చెందిన రియాద్‌ మన్సూర్‌ మాట్లాడుతూ, ప్రతి బేకరీ, వ్యవసాయ భూమిని ధ్వంసం చేశారు. పశుగ్రాసాన్ని నాశనం చేశారు. అన్ని రకాల ఆహార వస్తువులను అందకుండా దిగ్బంధం చేశారు. అక్టోబరులో గాజా నగరంలోని ప్రధాన బేకరీలన్నింటిపై ఇజ్రాయిల్‌ సైన్యం బాంబు దాడులు చేసింది. గోధుమపిండి, ఇంధనం లేకపోవడం వల్ల బ్రెడ్‌ తయారుచేసే బేకరీలు మూత పడ్డాయి. బ్రెడ్‌ కూడా లభించకపోవడంతో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పెద్దగా ఉపయోగంలేని హుబయ్‌ రaా గా పిలిచే మొక్కలను సేకరించడానికి కూడా అవి లభించడంలేదు. రొట్టెముక్క కోసం కూడా అల్లాడిపోతున్నామని ఇద్దరు బిడ్డల తల్లి ఫాతిమా షహీన్‌ ఎంతగానో ఆవేదన చెందారు. 2001లో యాసర్‌ అరఫాత్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. ఫలితంగా గాజాకు ఆహారసహాయం తేలికగా అందడానికి వీలులేకుండా చేశారు. దీనివల్ల ఆహార వస్తువులు విమానాల ద్వారా అందకుండా చేశారు. సముద్రతీర కారిడార్‌లను నిర్మించేందుకు ప్రయత్నిస్తు న్నారు. అయితే గాజా ఓడరేవుపైన ఇజ్రాయిల్‌ బాంబులు వేస్తున్నందున కారిడార్ల నిర్మాణంకూడా కష్టమే. గాజాలోకి కనీసం 500ట్రక్కులనైనా రఫప్‌ా క్రాసింగ్‌నుంచి ప్రవేశించేందుకు ఇజ్రాయిల్‌ అడ్డుపడుతోంది. పౌరులను ఆకలికి గురిచేయడం యుద్ధనేరమేనని, అంతర్జాతీయ చట్టం తెలియజేస్తోంది. గతంలో నాటికంటే కూడా ఎక్కువగా రంజాన్‌ పండుగను జరుపుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా తదితర దేశాలు నామక: ఇజ్రాయిల్‌ను మందలించినట్లుగా మాట్లాడుతున్నారు.

రచయిత : చరిత్రకారుడు, పత్రికా ఎడిటర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img