London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

విరాళాల ముందు బాండ్లు ఎంత?

నిత్య చక్రవర్తి

ఎన్నికల బాండ్ల ద్వారానే గాక ఇతర అనేక మార్గాల ద్వారా బీజేపీకి అపారంగా నిధులు సమకూరుతున్నాయి. బాండ్ల ద్వారా అన్ని పార్టీలకంటే చాలా ఎక్కువ నిధులువచ్చాయి. బాండ్లు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్‌ తీర్పు చెప్పారు. ఎవరెవరు ఎంత మొత్తానికి బాండ్లు కొనుగోలు చేసింది, ఏ పార్టీకి ఎంత లభించింది, ఇతర పూర్తి వివరాలు వెల్లడిరచాలని బాండ్లు అమ్మిన ఎస్‌బీఐని ఆదేశించినప్పటికీ బ్యాంకు సరదాగా తీసుకొంటూ ఇంతవరకు పూర్తిసమాచారం ఎన్నికల కమిషన్‌కు గానీ, లేదా కోర్టుకు గానీ అందించలేదు. 2019 ఏప్రిల్‌ 12 నుండి 2024 ఫిబ్రవరి వరకు (ఇదేరోజు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది) బాండ్ల ద్వారా రూ.16,494 వేలకోట్లు రాగా బీజేపీకి రూ.8.250 వేల కోట్లు వచ్చాయి. అంటే అత్యధిక ఆదాయం బీజేపీకే వచ్చింది. ప్రధాని మోదీయే ఈ పథకాన్ని ఎవరితో సంప్రదించకుండా ప్రకటించారని ప్రచారం జరిగింది. కొనుగోలు చేసినవారికి, ప్రయోజనం పొందిన పార్టీకి మధ్యగల గల రహస్యాలు బంధాన్ని ఎస్‌బీఐ వెల్లడిరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 21 తర్వాత కొనుగోలు చేసినవారికి, ప్రయోజనం పొందిన పార్టీకి, ప్రధానంగా పాలకపార్టీకి ఎంత వచ్చింది వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. బాండ్ల కొనుగోలు మూలంగా ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉండవచ్చునని కూడా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల కంటే బీజేపీకి ఇతర మార్గాల ద్వారా రహస్యనిధులు ఎక్కువ వస్తున్నాయి. అనేక మార్గాల ద్వారా వచ్చే విరాళాల సంఖ్య బీజేపీకి బాండ్ల ద్వారా వచ్చే విరాళాలు ఒకటి. వీటిపై ఎన్నికల కమిషన్‌ దర్యాప్తు చేయించాలి.
18వ లోకసభ ఎన్నికలు ఏప్రిల్‌ 19నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఏడు దశల్లో పూర్తి అవుతుంది. ఎన్నికల బాండ్లు ద్వారా, ఇతర మార్గాల్లో వచ్చిన ధనరాశులు 2024 ఎన్నికల్లో బీజేపీ ఖర్చుచేయనున్నది. ఏడు దశల్లో ఎన్నికలు జరిగి జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే నిధుల కంటే విదేశాల నుండి వచ్చే విరాళాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి అమెరికాలో వజ్రాల వ్యాపారుల నుండి, ఇతరుల నుండి వచ్చే నిధుల మొత్తం అపారం. అయితే ఇది అంతా రహస్యం. మధ్య దళారుల్లో అత్యధికులు, ఇంకా ఇతరుల మధ్య బీజేపీకి అత్యంత సాన్నిహిత్యం ఉంది. సంప్రదాయ వ్యాపారులు, బడా వాణిజ్యవేత్తలకు దశాబ్దాలుగా బీజేపీ మధ్య లోతైన స్నేహ సంబంధాలున్నాయి. వాస్తవంగా బీజేపీ, సంఫ్‌ుపరివార్‌లో వీహెచ్‌పీలకు అనేకదేశాలలో పెద్ద మొత్తాల్లో విరాళాలుఇచ్చే వారున్నారు. బీజేపీతో పోలిస్తే, కాంగ్రెస్‌కు వచ్చే విరాళాలు అతి స్వల్పం. వీహెచ్‌పీ, ఇతర హిందు సంఘాల నియంత్రణలో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి. వీటినుంచి బీజేపీకి విరాళాలు సమకూరుతాయి. అమెరికా, బ్రిటన్‌ ఐరోపాలోని అనేక దేశాలు, ఇటీవలికాలంలో పశ్చిమాసియాలోని చాలా దేశాల నుంచి బీజేపీకి, సంఫ్‌ుపరివార్‌ అనుబంధ సంస్థలకు విరాళాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నయని తెలుస్తోంది. ఆలయాలకు అనుబంధంగా ఉండే ట్రస్టీలు, భారీగా నిధులను అందచేస్తాయి. ప్రపంచంలో 10కోట్లకుపైగా సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీ బీజేపీ ఒక్కటే. ఈ నేపధ్యంలో బీజేపీకి, సంఫ్‌ుపరివార్‌కు నిరంతరం విరాళాలు వస్తూనే ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే విరాళాలపైన సాధారణంగా అనేక ఆంక్షలు ఉంటాయి. బీజేపీ పాలకపార్టీ గనుక ఏ ఏజన్సీలు కూడా ఆటంక పరచవు. వచ్చేవిరాళాల ధనం ఎంతని ఎవరికీ తెలియదు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్‌ఎల్‌ఏలను తమవైపు తిప్పుకునేందుకు ఒక్కొక్కరికి 100కోట్లకుపైగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు హైదరాబాదులో ఈ విషయం మారు మోగింది. ఎప్పటిలాగానే బీజేపీ నాయకులు ఈ వ్యవహారాన్ని తిరస్కరించారు. 2014 నుంచి బీజేపీకి ఇది కొత్తేమీకాదు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు ఆనాటి నుండి బీజేపీకి ఖాతాలో పడుతూనే ఉన్నాయి. ఇందుకు బదులుగా వారికి అనేక రూపాలలో ప్రభుత్వం నుంచి ప్రయోజనం లభిస్తోంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత గత 5ఏళ్లలో కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రభుత్వాలను అస్థిరీకరించడానికి, అలాగే గోవా, మణిపూర్‌లలో ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు బీజేపీ ఖర్చు చేసింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర వ్యవహారం తాజా ఉదాహరణ. శివసేన నుంచి ఏక్‌నాథ్‌షిండే గ్రూపును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు 200కోట్ల రూపాయలకుపైగా నిధులను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. షిండేబీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దర్యాప్తుసంస్థలు నిధులు సమకూర్చని కార్పొరేట్లపై దాడులు జరుగుతాయని భయపడుతూనే ఉంటారు. అయితే వారి కొత్త వారసులు బీజేపీని లెక్కచేయడంలేదు. అలాంటివారిపైన దాడులు తప్పవు. అనంతరం యువత ధోరణికూడా మరిపోయింది. గత పదేళ్ల మోదీ పాలనలో ఊహించలేనంతగా ధనరాశులు కార్పొరేట్లవద్ద చేరాయి. వీరంతా మోదీకి విరాళాలు ఇచ్చి తమకు కావలసిన పనులు చేయించుకుంటారని ప్రతీతి. 1990లో 20 సంస్థలకు వచ్చిన మొత్తం లాభాలు 14శాతంకాగా, 2010నాటికి అవి 30శాతం అయ్యాయి. 2019నాటికి ఈ లాభాలు 70శాతానికి పెరిగాయి. మోదీ పాలనలో లాభాలు ఒక్క దుముకు దుమికాయి. కార్పొరేట్లకు, బీజేపీకి విడదయలేని బంధం ఏర్పడిరది. మార్కెట్‌ల శక్తి మూలంగా అపారమైన లాభాలు వచ్చాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రణబ్‌ బర్దన్‌ అంచనావేశారు. ప్రధానమంత్రి మోదీ కొంతమంది ఎంపికచేసుకున్న కార్పొరేట్లకు, బడా వాణిజ్యవేత్తలకు అనుకూలంగా మార్కెట్‌ను మార్చివేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మోదీకి అపారంగా నిధులు సమకూర్చిఉంటాయని విస్త్రతంగా వస్తున్న సమాచారం. ఒకే దేశం, ఒకే మార్కెట్‌ పథకం పెద్దపెద్ద కంపెనీలకు ప్రయోజనం చేకూర్చించింది. దేశీయ కంపెనీలు దెబ్బతిన్నాయి. టెలికాం, ఎయిర్‌లైన్స్‌, స్టీల్‌, సిమెంటు, అల్యూమినియం రంగాలలో మోదీ విధానం కారణంగా మార్కెట్‌లోని మొత్తం కంపెనీలలో 50శాతం బడాకంపెనీల నియంత్రణలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వం మూలంగా ఆశ్రిత పెట్టుబడుదారులు భారతదేశ ఆర్థికవ్యవస్థను ఎలా స్వాధీనం చేసుకున్నదన్న అంశాన్ని ఆర్థికవేత్త డాక్టర్‌ ప్రణబ్‌ బర్దన్‌ విశ్లేషించారు. ఆత్మనిర్భర్‌ లాంటి పథకాలు మనకు ప్రయోజనం లేకుండాపోయాయి. దిగుమతి చేసుకునే పరికరాలను అసెంబుల్‌ చేసి తిరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వాటి ముందు దేశీయ కంపెనీలు నష్టపోతున్నాయి. 20162021 మధ్య కాలంలో ఆశ్రితపెట్టుబడీదారీ నల్లధనులు 29శాతం నుంచి 43శాతానికి పెరిగాయి. మోదీ నల్లధనులను, అవినీతిని పెంచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img