Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సమాజ శ్రేయస్సు కొరకే ఈ పౌర్ణమి గరుడ సేవ..

ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర ధర్మవరం:: సమాజ శ్రేయస్సు కొరకే ఈ పౌర్ణమి గరుడ సేవను ధర్మవరం పట్టణంలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యం ఆలయ ఈవో వెంకటేశులు, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో సాయంత్రం పౌర్ణమి గరుడ సేవను భక్తాదులు, దాతలు, ఆలయ కమిటీ పాలకవర్గం, డైరెక్టర్లు, ప్రజల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు కోనేరు ఆచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్ లు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గరుడ వాహనములో స్వామివారిని ఆశీనులు చేసి, వివిధ పూల మాలలతో అలంకరించిన వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గత కొన్ని నెలలుగా ఈ పౌర్ణమి గరుడ సేవలు నిర్వహించడంలో ప్రజలు కూడా తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. అనంతరం ఆలయ ఈవో దాసెట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ పౌర్ణమి గరుడసేవ అనే కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించిన పద్ధతి ప్రకారము ఈ ధర్మారంలో కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. గరుడ సేవకు దాతలుగా మహాలక్ష్మి, భూ శెట్టి రామకృష్ణ, రవితేజ, హారిక అండ్ గౌతమ్, సౌమ్య ,నాగమనమ్మ, పిన్ను నాగేంద్ర అండ్ సన్స్ వారు నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి పేరిటన అర్చకులు ద్వారా ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ వారిని ఘనంగా కమిటీ తరఫున సత్కరించారు. అన్నమయ్య సేవా మండలి వారు ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు, మహిళలు ప్రదర్శించిన కోలాటం అందరిని ఆకట్టుకుంది.తదుపరి స్వామి వారు గరుడ వాహనంలో పట్టణ పురవీధులలో భక్తాదులకు దర్శన మిస్తూ, ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, అధిక సంఖ్యలో భక్తాదులు, అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య,వారి శిష్య బృందం, మహిళా సంఘం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img