Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

. విడుదలకు అంగీకరించని దిల్లీ హైకోర్టు
. విచారణ 3కు వాయిదా
. నోటీసుపై స్పందనకు ఈడీకి 2 వరకు గడువు

న్యూదిల్లీ : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించలేదు. మద్యం కేసులో అరెస్టు అయిన ఆయనను విడుదల చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై వివరణ కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు నోటీసును జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ బుధవారం జారీ చేశారు. కేజ్రీవాల్‌ తన పిటిషన్‌లో కోరిన ఉపశమనాల దృష్ట్యా ఈడీ వాదన వినకుండా తీర్పు ఇవ్వలేమన్నారు. ఈడీకి అవకాశం ఇవ్వకపోతే న్యాయపరమైన సిద్ధాంతాలను అతిక్రమించడమే అవుతుందని తెలిపారు. రెండు పక్షాలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, ఆలోగా తాతాల్కిక ఉపశమనం కల్పించలేమని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఈడీ కస్టడీ నుంచి విడుదల కోరుతూ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై స్పందించేందుకు ఈడీకి ఏప్రిల్‌ 2 వరకు గడువును దిల్లీ హైకోర్టు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌3కు వాయిదా వేసింది. కాగా, రిమాండ్‌ ముగియనుండటంతో కేజ్రీవాల్‌ను గురువారం కూడా కోర్టులో హాజరు పర్చనున్నారు. ఈడీ కస్టడీలో ఆయనకు ఇంటి భోజనం, పడక వసతిని కోర్టు కల్పించింది. అంతకుముందు కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఫ్వీు, ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. తమకు ఇచ్చిన నోటీసుపై స్పందించేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలని ఈడీ తరపు ఎస్‌వీ రాజు కోరారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌ ప్రతి తమకు రాత్రి లభించిందని తెలిపారు. సింఫ్వీు స్పందిస్తూ ‘ఈనెల 23న పిటిషన్‌ దాఖలైంది. గత రాత్రి సవరిత పిటిషన్‌ ప్రతిని ఏఎస్‌జీకి అందజేస్తాం’ అని తెలిపారు. కేజ్రీవాల్‌ రిమాండ్‌ ముగుస్తోందని ఆయన విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసును సాగదీసే ప్రయాస జరుగుతోందని ఆరోపించారు. మరొక రోజు పొడిగించినా ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతుందన్నారు. సెక్షన్‌ 50 కింద స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండా అక్టోబరులో జారీచేసిన సమన్ల ఆధారంగా సీఎంను అరెస్టు చేశారని, ఈ అరెస్టు ఉద్దేశం భిన్నమైనదని వాదించారు. రాజు వాదిస్తూ తాత్కాలిక ఉపశమనం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌, ప్రధాన అంశంపై తమ సమాధానాలు ఇచ్చేందుకు కొంత సమయమివ్వాలని కోరారు. రెండు పక్షాలను విన్న న్యాయస్థానం వచ్చేనెల 2వ తేదీలోగా సమాధానం ఇచ్చేందుకు ఈడీకి సమయం ఇచ్చింది. కేసు విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది.
మై భీ కేజ్రీవాల్‌ టీషర్టులతో అసెంబ్లీకి ఆప్‌ ఎమ్మెల్యేలు… సీఎం అరెస్టుకు నిరసన
కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఆప్‌ ఎమ్మెల్యేలు బుధవారం ‘మై భీ కేజ్రీవాల్‌’ అని రాసివున్న పసుపురంగు టీషర్టులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. సభలో నిరసన తెలిపారు. వెల్‌లోకి వెళ్లి సీఎంకు మద్దతుగా, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్‌ మాస్కులను సైతం వారు ధరించారు. దీంతో దిల్లీ అసెంబ్లీ వాయిదా పడిరది. అసెంబ్లీ బయట కూడా మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిశి ఆందోళన నిర్వహించారు. ఎన్నికల వేళ తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని, నిరసన తెలుపనివ్వకుండా పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘మై భీ కేజ్రీవాల్‌’ (నేను కూడా కేజ్రీవాల్‌), మోదీ కా సబ్‌ సే బడా డర్‌ కేజ్రీవాల్‌ (కేజ్రీవాల్‌ అంటే మోదీకి వణుకు) అన్న టీ షర్టులు ధరించి బీజేపీ దురాగతాలను నిరసిస్తున్నామని ఉద్ఘాటించారు. పోలీసులు తమతో దురుసుగా వ్యవహరిస్తున్నారని, జర్నలిస్టులను కూడా వదలడం లేదన్నారు. ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చడమే మోదీ ప్రభుత్వం ఉద్దేశమని అతిశి అన్నారు. ముందు ఉప ముఖ్యమంత్రులను… ఇప్పుడు ముఖ్యమంత్రిని అరెస్టు చేయించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. విపక్ష నేతలను జైలుకు పంపుతూ… వారి బ్యాంకు ఖాతాలను, పార్టీ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళనకు దిగి ఆప్‌ ఎమ్మెల్యేలకు పోటీగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్‌ రాజీనామాను డిమాండ్‌ చేశారు. దిల్లీని దోచుకుంటున్న అవినీతి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడు, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ డిమాండ్‌ చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తి సీఎంగా ఎలా కొనసాగుతాడని ప్రశ్నించారు. ఇది అనైతికమని, దొంగలకు ఆప్‌ మద్దతిస్తోందని ఆరోపించారు.
కేజ్రీవాల్‌ నేడు కోర్టులో వాస్తవాలు వెల్లడిస్తారు: సునీత
దిల్లీ మద్యం కేసులో వాస్తవాలను తన భర్త గురువారం (28వ తేదీన) బయటపెడతారని కేజ్రీవాల్‌ భార్య సునీత ఓ వీడియో విడుదల చేశారు. ‘మనీ లాండరింగ్‌ ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బును ఎక్కడ దాచారో కేజ్రీవాల్‌ కోర్టుకు తెలియజేస్తారు. కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన ఆలోచన మొత్తం దిల్లీ ప్రజల గురించే… ఇది కూడా మోదీ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. అక్రమ కేసు బనాయించి నా భర్తను అరెస్టు చేయించి ఈడీ కస్టడీకి పంపారు. ఆయన ఆరోగ్యం బాగోలేదు. మధుమేహం పీడిస్తోంది.దిల్లీని నాశనం చేయాలన్న కేంద్రప్రభుత్వ ప్రయాస కేజ్రీవాల్‌ను ఆందోళనకు గురిచేస్తోంది’ అని సునీత తెలిపారు. ఈడీ 250సార్లకుపైగా తనిఖీలు జరిపించినా ఒక్క పైసా అక్రమ సొత్తు లభించలేదని గుర్తుచేశారు. కోర్టులో నిజాలు వెల్లడిస్తానని కేజ్రీవాల్‌ తనతో చెప్పారని సునీత చెప్పారు. కేజ్రీవాల్‌ నిజమైన దేశభక్తుడని, ధైర్యంగల నాయకుడని, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించండని ప్రజలను కోరారు.
కేజ్రీవాల్‌కు అనారోగ్యం: ఆప్‌
కేజ్రీవాల్‌ మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆప్‌ వర్గాలు తెలిపాయి. ఆయన సుగర్‌ స్థాయి నిలకడగా లేదని, ఓ సారి 46 ఎంజీలకు పడిపోగా మరోసారి ప్రమాదకర స్థాయికి చేరినట్లు వైద్యుల ద్వారా తెలిసిందని పేర్కొన్నాయి.
సీఎంగా కేజ్రీవాల్‌ తొలగింపుపై పిల్‌` నేడు హైకోర్టు విచారణ
దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్‌ను తొలగించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. దీనిని జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్‌మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించనుంది. మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసిన తర్వాత కూడా సీఎంగా కేజ్రీవాల్‌ ఉండటం వల్ల దిల్లీ ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారిందని, ఆయనను పదవి నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది శశి రంజన్‌ కుమార్‌ సింగ్‌ ద్వారా హైకోర్టును సూర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img