Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎం.గౌతమి


విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సాధారణ ఎన్నికలు – 2024 దృష్ట్యా రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరియు ఈఎస్ఎంఎస్ (ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం) అమలుపై సంబంధిత నోడల్ అధికారులు, ఎల్డిఎం, బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలోని 33 బ్యాంకుల్లో ఇప్పటి వరకు కేవలం 4 బ్యాంకులు (కెనరా బ్యాంక్, ఏపీజీబీ, పీఎన్‌బీ, ఎస్‌బీఐ- ధర్మవరం) మాత్రమే డేటాను సమర్పించాయని, మిగిలిన బ్యాంకులు వెంటనే రోజువారిగా డేటాను సమర్పించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు బ్యాంకుల ద్వారా డబ్బు బదిలీపై డేటా నిత్యం సమర్పించాలని, అనుమానాస్పద లావాదేవీలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.

  1. నగదు లావాదేవీల వివరాలు ప్రతిరోజూ రూ.10 లక్షలు & అంతకంటే ఎక్కువ ఉన్నా వివరాలు అందజేయాలి.
  2. నగదు లావాదేవీల వివరాలు నెలవారీగా రూ. 50 లక్షలు & అంతకంటే ఎక్కువ ఉన్నా డేటా ఇవ్వాలి.
  3. ఏప్రిల్ 2023 నుండి నెలవారీ కరెన్సీ చెస్ట్‌లో నగదు చెల్లింపు వివరాలు అందించాలి.
  4. యూ పి ఐ లావాదేవీలు రూ. 2000/- లేదా ఒకటి నుండి చాలా వరకు అకౌంట్లకు నగదు పంపించినప్పుడు అలాంటి వాటికి సంబంధించిన డేటా అందించాలి. బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నగదు తీసుకెళుతున్న సమయంలో సీ-విజిల్ పోర్టల్ లో లాగిన్ అయి వివరాలు నమోదు చేసి వివరాలను, క్యూఆర్ కోడ్ రిసిప్ట్ ను తీసుకుని వెళ్లాలన్నారు.
    ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా వారు మార్చి నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికలు – 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి రోజు రిపోర్టులను అందజేయాలన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు బ్యాంకు అకౌంట్ నంబర్లపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజు బ్యాంక్ అకౌంట్ లను పరిశీలన చేసుకుని అభ్యంతరకరంగా ఏవైనా లావాదేవీలు ఉంటే వివరాలు అందించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. రోజు లావాదేవీల ఎక్స్పెండిచర్ రిపోర్టు ల ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ అధికారికి అందించాలన్నారు. బ్యాంకు అకౌంట్ లను బ్యాంకర్ల పరిశీలించాలని, అనంతరం ఎల్డీఎం తర్వాత నోడల్ అధికారి, కంట్రోల్ రూమ్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ప్రత్యేక టీంతో పరిశీలించడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల చేత నామినేషన్ వేసే ముందు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ లను ప్రారంభించాలని, ఈ విషయమై బ్యాంకర్లు అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ల లావాదేవీలని పరిశీలించాలని, ఎంత రుణం పడుతుంది ఎంత విత్ డ్రా అవుతోంది అనేది చెక్ చేయాలన్నారు. పెట్రోల్ బంక్ అకౌంట్ లను కూడా ఎన్నికల వరకు చెక్ చేయాలన్నారు. బ్యాంకర్లు వారి సిబ్బందికి శిక్షణ కల్పించాలన్నారు. బ్యాంక్ అకౌంట్ లావాదేవీల పరిశీలన కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని, ఎలాంటి నగదు మార్పిడిలకు అవకాశం ఇవ్వరాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఎల్డిఎం సత్యరాజ్, బ్యాంకర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img