Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనడం అహంకారపూరితమే

సిపిఎం పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థి అప్పల నరస

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అహంకారపూరిత ప్రకటనలు చేస్తున్న బిజెపి కూటమిని, అధికార వైకాపాను ఇంటికి సాగనంపవలసిన తరుణం ఆసన్నమైందని సిపిఎం పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పల నరస అన్నారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఆయన ఆ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఆలోచన చేసే పార్టీలకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచన చేసే పార్టీలకు 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసి అధికారం లోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మన్య ప్రాంతంలో సహజ వనరులపై కన్నేసిన బూర్జువా పార్టీలు గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులను కాలరాసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని మారుస్తానని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. బిజెపి పొత్తు తోత్తు పార్టీలను ఓడించి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికార వైకాపా, బిజెపి కూటమి ఆలోచన విధానాన్ని తక్కువగా అంచనా వేయరాదన్నారు. వారి ఆలోచన విధానాలు అత్యంత ప్రమాద భరితమన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చడమే లక్ష్యంగా పార్లమెంటులో 400కు పైగా సీట్లు సాధించాలని బిజెపి ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. ఇందులో భాగంగానే వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడమే గాక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ కేంద్ర రాష్ట్రాలలో బిజెపి, వైకాపా ప్రభుత్వాలు ఏర్పడితే మన్య ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్, బాక్సైట్ తెరమీదకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ రాష్ట్రానికి విభజన హామీలలో భాగంగా రావలసిన రాయితీలు ఇవ్వకుండా బిజెపి అడ్డుపడుతుంటే అటువంటి పార్టీలను భుజాలపై ఎక్కించుకొని తెదేపా, జనసేన పార్టీలు పల్లకిలో మోస్తున్నారని, అందుకే పొత్తు తొత్తు పార్టీలను ఓడించి, వామపక్ష అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా వారికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్, చింతపల్లి మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్, సాగిన చిరంజీవి, సిదరి సత్తిబాబు, సర్బు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img