విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో గత కొన్ని రోజులుగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే పోతుకుంట దగ్గర మహేంద్ర మ్యాక్సీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 26 సంచుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై నరేంద్ర తెలిపారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని డిప్యూటీ తాసిల్దార్, సిఎస్డిటి లక్ష్మీదేవికి అప్పగించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనంతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు వారు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు.