Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు అమ్ముకోవడం పార్టీలకు తగునా

కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, శ్రీనుబాబు సింహాద్రి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- నాయకులు, కార్యకర్తలను అనునిత్యం వాడుకుని ఆఖరి నిమిషంలో కాసులకు టిక్కెట్లు అమ్ముకోవడం పార్టీ అధిష్టానాలకు తగునా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాంగి రామకృష్ణ, శ్రీనుబాబు, గెమ్మెల సింహాద్రి లు అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి అన్నారు. ఆ సమయంలో ఆ పార్టీలో పదవులు అనుభవించిన పెద్ద పెద్ద నాయకులంతా తమ స్వప్రయోజనాల కోసం పార్టీని వీడినప్పటికీ, పాడేరు నియోజకవర్గంలో పివిటిజి వర్గానికి చెందిన వంతల సుబ్బారావు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారన్నారు. కష్టాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసిన నాయకుడు వంతల సుబ్బారావు అన్నారు. అటువంటి నాయకుని నాయకత్వంలో నేడు పార్టీకి పూర్వ వైభవం రాబోతున్న తరుణంలో నిన్న మొన్నటి వరకు వంతల సుబ్బారావే పాడేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ప్రకటించిన అధిష్టానం నేడు కాంగ్రెస్ పార్టీతో సంబంధంలేని కొత్త వ్యక్తిని (శతక బుల్లిబాబు) తెరమీదకు తెచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి విధానం గతంలో ఎన్నడూ లేదని, ముగ్గురు ప్రదేశ్ కగ్రెస్ కమిటీ (సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, వైయస్ షర్మిల) అధ్యక్షులు వంతల సుబ్బారావు అభ్యర్థిని బహిరంగంగా ప్రకటించినప్పటికీ నేడు కొత్త వ్యక్తి పేరు ప్రకటించడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేని విషయం అన్నారు. పార్టీతో ప్రమేయం లేని వ్యక్తులకు సీట్లు ఏ విధంగా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. ఇంత కాలం పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచన చేసి కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గం అభ్యర్థిత్వం వంతల సుబ్బారావుకే ఖరారు చేయాలని లేని పక్షంలో ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించి తమ సత్తా చూపిస్తామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img