Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మోసకారి చంద్రబాబు

రుణమాఫీ అంటూ రైతుకు టోపీ
90 శాతం హామీల అమలు ఘనత వైసీపీదే
58 నెలల కాలంలో అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి
2.70 లక్షల కోట్లు, 2.31 లక్షల ఉద్యోగాలు
‘మేము సైతం సిద్ధం’ సభలో సీఎం జగన్

విశాలాంధ్ర-పిడుగురాళ్ల: రుణమాఫీ అని చెప్పి రైతన్నలను మోసం చేసిన చంద్రబాబు కావాలో… వ్యవసాయానికి అండగా ఉన్న మీ బిడ్డ కావాలో మీరే నిర్ణయించాలని సీఎం జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని అయ్యప్పస్వామి గుడి ప్రాంగణంలో బుధవారం ‘మేము సైతం

సిద్ధం’ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ 58 నెలల కాలంలో అత్యంత పారదర్శకంగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా 87 శాతం కుటుంబాలకు రూ.2.70 లక్షల కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమచేసినట్టు చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో కేవలం చంద్రబాబు హయాంలో రూ.54 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గతంలో ఎప్పుడు జరగని విధంగా 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు వివరించారు. 2014-2019 కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేవలం 32 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. జాబు కావాలి అంటే జగన్‌ రావాలి అని ఆయన నినదించారు. ఫ్యాన్‌ కావాలా తుప్పు పట్టిన సైకిల్‌ కావాలా అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. బాబు ఇస్తుంది బోగస్‌ రిపోర్టని… జగన్‌ ఇస్తుంది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అని స్పష్టం చేశారు. మీ బిడ్డ 58 నెలల కాలంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నల పెట్టుబడిగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఏటా రూ.13,500 చొప్పున ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి రైతుకు రూ.67,500 ఇచ్చినట్టు చెప్పారు. ఆర్‌బీకేలు తీసుకుని వచ్చి దళారీ వ్యవస్థ లేకుండా సున్నా వడ్డీకే పంట రుణాలు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. ఆసరా, సున్నా వడ్డీ వంటి సంక్షేమ పథకాలకు తాము అధికారంలోకి వచ్చాక 13 సార్లు బటన్‌ నొక్కాను… రూ.2.70 లక్షల కోట్లు అక్కాచెల్లెలు ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని వివరించారు. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలుపరిచిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు.
ఏ ముఖ్యమంత్రి అయిన మీ పిల్లల చదువు గురించి పట్టించుకున్న వారు ఈ దేశచరిత్రలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు. మీ ఇంటి పిల్లల చదువును పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీ మేనమామ జగన్‌ అని చెప్పటానికి గర్వపడుతున్నానని చెప్పారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు టోఫెల్‌, ఎనిమిదో తరగతిలో ట్యాబ్‌లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పేదవాడికి వైద్య సేవలు అందిన దాఖలాలు లేవన్నారు. మీ బిడ్డ అధికారంలో ఉండగా ప్రతి పేదవాడికి వైద్యసేవలు అందాయన్నారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చటానికి చంద్రబాబు వంటి మోసగాళ్ల నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు ‘నేను సిద్ధం మీరు సిద్ధమా’ అంటూ నినదించారు. అనంతరం నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను సభకు పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img