Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 76 శాతం నమోదు

డి ఐ ఈ ఓ రఘునాథరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలలో శ్రీ సత్యసాయి జిల్లా 76 శాతం తో ఉత్తీర్ణులు కావడం జరిగిందని డిఐఈఓ రఘునాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తము విద్యార్థులు 7,447 మంది హాజరు కాగా అందులో 5,653 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రధమ సంవత్సరములో మొత్తం 9,878 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 5,769 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు రీవాల్యుయేషన్కు అవకాశం కల్పించడం జరిగిందని, అదేవిధంగా సప్లమెంటరీ పరీక్షలు మే చివరి వారంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 18 నుండి 24వ తేదీ వరకు పరీక్ష ఫీజులను చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకండి::: శ్రీ సత్య సాయి జిల్లాలో వివిధ గ్రూపులలో ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడరాదని, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయరాదని, ఫెయిల్ అయినవారు తొలిమెట్టుగా భావించి కష్టపడి మే నెలలో జరిగే పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని, తద్వారా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయినాము అని విద్యార్థులు బాధపడకుండా తమకున్న భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ గ్రూపు-1,2 లలో ఉద్యోగాలు సాధించిన వారు ఎంతోమంది ఉన్నారని వారు తెలిపారు. ఆయా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కూడా విద్యార్థులకు ధైర్యం నింపాలని తెలిపారు. జిల్లాలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ వారు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img