Monday, May 20, 2024
Monday, May 20, 2024

చోడవరంలో వేసవి యోగ శిక్షణ …

విశాలాంధ్ర- చోడవరం (అనకాపల్లి జిల్లా) ,: చోడవరం ఉషోదయ కాలేజీలో మే 1 నుండి విద్యార్థులకు వేసవి యోగ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు పతంజలి యోగ శిక్షణ కేంద్రం గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. పతంజలి యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మే ఒకటో తారీకు నుండి 31 వరకు నెలరోజుల పాటు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ముందుగా 9291 276 900 మొబైల్ నెంబరు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే యోగ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేస్తామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img