Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో అవసరం…

యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం:: నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మంచి మార్కులు సాధించడం పట్ల వారు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 594 మార్కులతో పట్టణములోనే ప్రథమ స్థానం సాధించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. నక్క వెంకటేశ్వర్లు పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లా ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు సెట్టిపి జయచంద్రారెడ్డి, సుధాకర్, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషుగూడా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పట్టణంలోని 594 మార్కులతో ప్రథమ స్థానం 592 మార్కులతో తృతీయ స్థానం నిలవడంతో పాటు 500 మార్కులకు పైగా 36 మంది విద్యార్థులు రాణించడం హర్షనీయమని తెలిపారు. ప్రథమ స్థానం వచ్చిన నిత్యశ్రీ కి పదివేల రూపాయలు, అదేవిధంగా 592 మార్కులతో నిలిచిన అనూషకు 8,000 నగదు తో పాటు మెమొంటోను అందజేశారు. అలాగే మొత్తం విద్యార్థులు అందరికీ మెమెంటోళ్ళతో పాటు బహుమతులను కూడా అందజేశారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ బృందానికి ఇతర సిబ్బందికి డ్రైవర్లకు క్లీనర్లకు ఆయాలకు క్యాష్ అవార్డులతో పాటు నూతన వస్త్రములను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు రామిరెడ్డి, కృష్ణమ్మ, కరెస్పాండెంట్ శెట్టిపి నిర్మల జయ చంద్రారెడ్డి, డైరెక్టర్లు శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img