Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రెండో విడతా బీజేపీకి ఎదురీతే

ఏడు విడతలుగా జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో శుక్రవారం రెండవ విడత పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల విశ్లేషకుల అంచనాల ప్రకారం గత 19వ తేదీన జరిగిన 102 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌ సరళి ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు అనుకూలంగా ఉంది. రెండవ విడతలో మొత్తం 89 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగవలసి ఉంది. కానీ ఒక నియోజకవర్గంలో అభ్యర్థి మృతివల్ల 88 చోట్లే పోలింగ్‌ జరుగుతుంది. ఈ 89 నియోజకవర్గాలు 13 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 9 సీట్లు ఎస్‌.సి.లకు, 6 స్థానాలు ఎస్‌.టి.లకు ప్రత్యేకించారు. రెండవ విడత పోలింగ్‌ లో విశేషం ఏమిటంటే కేరళలో ఉన్న మొత్తం 20 సీట్లకు శుక్రవారమే పోలింగ్‌ పూర్తి అవుతుంది. కేరళలో వామపక్ష ఫ్రంట్‌ అధికారంలో ఉంది. అక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, వామపక్ష ఫ్రంట్‌ పరస్పరం పోటీ పడుతున్నాయి. 2019 బలాబలాలనుబట్టి చూస్తే రెండవ విడతలో పోలింగ్‌ జరుగుతున్న చోట బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్క కేరళలో మాత్రమే మినహాయింపు. కేరళలో బీజేపీకి 2019లోనూ ఒక్క సీటు కూడా రాలేదు. కేరళలో కాలు మోపడానికి దశాబ్దాలుగా బీజేపీ పడుతున్న పాట్లవల్ల పెద్దగా ఫలితం ఉండడం లేదు. ఆ పరిస్థితిలో ఈ సారీ మార్పు ఉండకపోవచ్చు. 2019 ఎన్నికలలో శుక్రవారం పోలింగ్‌ జరగనున్న 89స్థానాలలో 60 చోట్ల ఎన్‌.డి.ఎ. విజయం సాధించింది. అందులో బీజేపీకి 52 సీట్లు దక్కాయి. జె.డి.యు. కు నాలుగు సీట్లు, అప్పుడు ఉమ్మడిగా ఉన్న శివసేనకు 4 స్థానాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పి.ఎ.కు 23 సీట్లు వచ్చాయి. 2019లో కర్నాటక లోని 28 స్థానాలలో బీజేపీ 25 సీట్లు సంపాదించింది. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను క్రమంగా జనం గ్రహిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాక ప్రజలు లేమికి, వివక్షకు, అన్యాయానికి బలై పోతున్నారు. ఎవరూ పట్టించుకోని వారిగా మిగిలిపోతున్నారు. 1991 నుంచి అనుసరిస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రజలను అనేక కష్టాలకు గురిచేస్తే మోదీ పదేళ్ల పాలన జనాన్ని జీవచ్ఛవాల్లా మార్చేసింది. మోదీ ఎక్కించిన మతం మత్తువల్ల తమకు తిండిపెట్టదని, కనీస ప్రజాస్వామ్య హక్కులులేని జీవితం వ్యర్థం అని ప్రజలు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. పేదరిక సూచికల్లో మన దేశం నానాటికి దిగజారిపోతోంది. పార్లమెంటరీ రాజకీయాలలో వామపక్షాలు బలహీనపడడంవల్ల పీడితులు, దోపిడీకి గురవుతున్నవారు, అణగారిన వర్గాల వారి గురించి మాట్లాడే గొంతులు పీలగా మారిపోయాయి. ఈ లోటును కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా గుర్తిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీలు గతంలో ఎంతో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. అనేక ప్రగతిశీల పథకాలను వివిధ ప్రభుత్వాలు అమలు చేయక తప్పని పరిస్థితిని కల్పించింది వామపక్షాలవారే. చట్టసభల్లో వామపక్షాల గొంతు బలహీనం కావడంవల్ల సామాన్యజనం గోడు వినిపించే అవకాశమూ తగ్గింది. ఈ వెలితి పూడ్చవలసిన అవసరం చాలా ఉంది.
బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నికల వేళ ప్రస్తావనకు రాకుండా ఉండడం కోసం ప్రధానమంత్రి మోదీ అనేక ఎత్తులు ఎత్తుతున్నారు. దశాబ్దాలుగా బీజేపీ పెంచి పోషించిన మతతత్వం ఈ ఎన్నికల్లో ఉపకరించదని మోదీకి తెలుసు. అందుకే ప్రతిపక్షాలను దూషించడం మొదలు పెట్టారు. పదేళ్లలో తాను సాధించిందేమిటో చెప్పుకోవడానికి ఆయనకు ఏమీ లేదు కనక చరిత్ర పుటలు తిరగేసి ఇదివరకు అధికారంలో ఉన్న వారు చేసిన తప్పులు ఎన్నడం మీద దృష్టి కేంద్రీకరించారు. 2014 లో తాను అధికారం చేపట్టేదాకా అసలు ఈ దేశమే అస్తిత్వంలో లేనట్టు మాట్లాడే మోదీ సాధించిందేమిటో చెప్పుకోగల స్థితిలో లేకపోవడంతో అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారు. తాను చెప్పే అబద్ధాలను జనం నమ్మే పరిస్థితి లేదని తెలిసినా చెప్పిన అబద్ధమే అదే పనిగా చెప్తుంటారు. చాలాసార్లు కొత్త అసత్యాలను సృష్టించి ప్రచారంలో పెడ్తారు. తన వాక్చాతుర్యాన్ని, వక్తృత్వ పటిమను అబద్ధాల ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ఒక దశలో ఇవన్నీ బీజేపీ విజయ పరంపరకు ఉపకరించి ఉండవచ్చు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆసరాగా ఓట్లు దండుకోవాలన్న మోదీ ప్రయత్నం బెడిసికొట్టింది. రామ మందిరాన్ని చూసి ఓట్లు వేసేవారు కనిపించడం లేదు. శ్రీరాముడిని మోదీకి గుత్తకు తీసుకోవడం ప్రజలకు, ముఖ్యంగా రామ భక్తులకు ఏమాత్రం నచ్చడం లేదు. రెండవ విడత పోలింగ్‌ జరుగుతున్న చోట 2019లో బీజేపీ ఎక్కువ స్థానాలు సంపాదించి ఉండవచ్చు కానీ ఈ సారి పరిస్థితి తిరగబడడం ఖాయంగా కనిపిస్తోంది. జనం ఎదుర్కుంటున్న నిత్య సమస్యలను జనమే చర్చకు పెడ్తున్నారు. ఈ ఎన్నికలు బీజేపీకి, ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు మధ్య ప్రధాన పోటీగా కనిపిస్తున్నా మోదీని ఈ సారి ఓడిరచాలన్న సంకల్పం సాధారణ ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జన నిర్ణయాన్ని మార్చే శక్తి మోదీ అసత్య ప్రచారానికి ఉండదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వామపక్షాలు నిర్వర్తించవలసిన బృహత్తర బాధ్యతను విస్మరించలేం. వామపక్షాల ఈ కర్తవ్య నిర్వహణలో వామపక్షాల గెలుపోటములు, సీట్ల సంఖ్య అంత ప్రధానం కాదు. జనం సమస్యలను, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పడంలో వామపక్ష పార్టీలు ఎన్నదగిన పాత్ర పోషిస్తున్నాయి. వామపక్షాల పోరాటం చట్ట సభల్లో సీట్లకు పరిమితమైంది కాదు. వామపక్షాలది ప్రజోద్యమం. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రజల సహకారం, భాగస్వామ్యం అత్యవసరం. దీన్ని జనం గుర్తించేలా చేయడమే వామపక్షాల విజయ పథం. మోదీ హయాంలో పెట్టుబడిదారి విధానం పదిహేను ఇరవైమంది పెట్టుబడులకు, వ్యాపార సంస్థలకు పరిమితం అయిపోయింది. అందువల్ల మనుగడకోసం ప్రయాస పడ్తున్న ఇతర పెట్టుబడిదారీ వర్గాలకు కూడా మోదీ విధానాలు మింగుడు పడడం లేదు. మోదీ హయాంలో ప్రజాస్వామ్య మూలకందాన్నే ఛిద్రం చేసిన వైనం సకల ప్రజాస్వామ్య శక్తులను ఆలోచింప చేస్తోంది. రెండవ విడత పోలింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాలు గతంలో బీజేపీకి అనుకూలంగా ఉండిఉండవచ్చు. కానీ అప్పుడు మోదీని గెలిపించిన వర్గాల వారే ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఈ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం రెండో విడత పూర్తిఅయితే మిగతా అయిదు విడతల్లో కూడా బీజేపీ గుండె మీద చేయివేసుకుని ఉండే పరిస్థితి ఏ విడతలోనూ కనిపించడం లేదు. బీజేపీ అంతర్గత సర్వేతో పాటు వివిధ సర్వేలు మోదీకి పరాజయం తప్పదని ఘోషిస్తున్నాయి. గోదీ మీడియా స్వరం క్రమంగా మారుతుండడాన్ని గమనిస్తే జనం నిర్ణయం ఎలా ఉండబోతోందో అంచనా వేయడం కష్టం కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img