ఉబికిన రక్తం
చిందించిన చెమటకు
రాసిన నిర్వచనం
మేడే….
ఇనుప కండరాల
రణనినాదం
మేడే….
ఆకలి మంటల
ఆర్తగీతం
మేడే….
అసహాయతను కాల్చేసి
పుట్టిన అగ్నిజ్వాల
మేడే….
సంఘటిత పోరాటాలకు
అద్దిన పుప్పొడి
మేడే….
కార్మిక కర్షక
బహుజన శ్రామిక లోకం
ఎలుగెత్తిన ఇంక్విలాబ్
మేడే….
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764