Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాజ్యాంగ రక్షణ కీలకం

డి. రాజా,
సీపీఐ ప్రధాన కార్యదర్శి

భారత రాజ్యాంగ పరిరక్షణ సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యంత కీలకమైన సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, మోదీ ప్రభుత్వం దాడినుంచి రాజ్యాంగాన్ని కాపాడటం ప్రజల కీలకమైన ఎజెండాలో అత్యంత ప్రధానమైన అంశం. రాజ్యాంగం అవతారిక ప్రారంభ అంశాలు ఇలా ఉన్నాయి. ‘‘మనం భారతదేశ ప్రజలం. భిన్నమైన మతాలు, భాషలు, కులాల కేటగిరిలు ఎన్ని ఉన్నప్పటికీ, భిన్నత్వంలో ఏకత్వం ఉందని ప్రజలు చాటిచెప్తున్నారు. ఈ గొప్ప విషయం రాజ్యాంగం మనకు కల్పించింది. మనది సార్వభౌమాధికార సెక్యులర్‌, ప్రజాస్వామిక రిపబ్లిక్‌ అని రాజ్యాంగం ద్వారా దేశప్రజలంతా తీర్మానించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగ పౌరులందరికీ కల్పించింది.
ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు చాలామంది తమ పార్టీ 400 (మొత్తం 545) సీట్లు గెలుచుకుంటే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రద్దుచేసి కొత్త రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రకటించారు. దీనిపై దేశప్రజలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్దచర్చనీయాంశమైంది. ప్రత్యేకించి దళితులు సమాజంలో భిన్నకులాల ప్రజలు వివక్షకు, అన్యాయానికి గురయ్యారు. అణచివేతకు గురవుతున్న కొన్నికులాలు రాజ్యాంగాన్ని మార్చివేసినట్లయితే తమ అభ్యున్నతికి అవకాశం ఉండదని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారిపై ముస్లింలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం మార్పు జరిగినట్లయితే, రాజ్యాంగంలో పొందుపరచిన సమానత్వం, స్వేచ్ఛ ధ్వంసమవుతాయని విశ్వసిస్తున్నారు. ‘‘మేమంతా ప్రజలం’’ అంశాన్ని ఈ ప్రకటనల ద్వారా దాడిచేస్తున్నారు. 1950జనవరి 26 వ తేదీన దృఢంగా రిపబ్లిక్‌ను ఏర్పాటు చేస్తున్నాము. సెక్యులర్‌, సామాజిక, సోషలిస్టు, సార్వభౌమదేశంగా నిర్వచించుకున్నాము.
రాజ్యాంగ అసెంబ్లీకి నాయకత్వం వహించిన బాబా అంబేద్కర్‌ ప్రజలు మొదటిసారిగా ఇది ప్రజారాజ్యాంగమని దృఢంగా వ్యక్తం చేశారు. మొదటిసారిగా ఇండియాను ప్రకటించారు. అయితే 1949, నవంబరు 30న ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ అసెంబ్లీ మనరాజ్యాంగాన్ని ఆమోదించిన నాలుగు రోజులకు ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తూ సంపాదకీయాన్ని రాసింది. ఆ సంపాదకీయం ఇలా ఉంది. ‘‘కొత్త రాజ్యాంగం అధ్వాన్నంగా ఉంది. భారత్‌ అని మాత్రమే ఉందికానీ, అది భారతీయత కాదు. రాజ్యాంగ ముసాయిదాలో బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్‌ ఇంకా తదితర అంశాలను చేర్చారు. ప్రాచీన కాలంలోని భారతీయ రాజ్యాంగ చట్టాలు, సంస్థలు, పదజాలం ఇందులో లేవు. ప్రాచీన భారత్‌లో విశిష్టమైన రాజ్యాంగ అభివృద్ధిని పొందుపరచలేదు. పర్షియాలోని స్పార్టా లేదా సొలాన్‌లో లికర్జస్‌ రాసిన చట్టాలకు ముందే మనుధర్మాలను రాశారు. మనుస్మృతిలో పొందుపరచిన చట్టాలు ప్రపంచ మంతా ఆరాధించింది. విశ్వసనీయతను, దృఢత్వాన్ని ప్రకటించారు. మన రాజ్యాంగ పండితులు వీటిని పట్టించుకోలేదు’’. రాజ్యాంగాన్ని రూపొందించిన 1949లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ విషం కక్కింది. ఇప్పుడు 400 సీట్లు కావాలని కోరుకుంటున్నవారు రాజ్యాంగాన్ని మార్పుచేయడం కోసమే.
అప్పుడప్పుడు ఇలా విషం కక్కడం ఆర్‌ఎస్‌ఎస్‌కి అలవాటైంది. ఏబీ వాజ్‌పేయి పాలనలో 1999లో రాజ్యాంగాన్ని సమీక్షించాలని ప్రతిపాదన వచ్చింది. అనేక ప్రజాసమూహాలు దళితులతో సహా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. అప్పటి రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ తీవ్రంగా ప్రశ్నించారు. ‘‘రాజ్యాంగం విఫలమైందా… లేక రాజ్యాంగాన్ని మనం వైఫల్యం చేశామా?’’ 2000 సంవత్సరంలో మన రిపబ్లిక్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి చరిత్రాత్మక ప్రసంగం చేశారు. వాజ్‌పేయి రాజ్యాంగ సమీక్ష నిర్ణయాన్ని వదిలేశారు. అందుకు బదులుగా రాజ్యాంగం పనితీరుపై ఒక కమిషన్‌ని ప్రకటించారు. ఆ విధంగా ఆరోజు రాష్ట్రపతి నారాయణన్‌ రాజ్యాంగాన్ని పరిరక్షించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత రాజ్యాంగాన్ని పవిత్ర పుస్తకం అని వర్ణించారు. ఆ తరువాత 2017లో మోదీ మంత్రివర్గంలోని అనంతకుమార్‌ హెగ్డే రాజ్యాంగాన్ని ఒక ప్రకటన చేశారు. ఆ తరువాత తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ కోరారు. గత నెలలోనూ హెగ్డే మోదీ తిరిగి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మార్పుచేస్తామని ప్రకటించారు. గత సంవత్సరం ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ పదేపదే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకే ఉందని చెప్పారు. గత సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ వివేక్‌ దేవ్‌రాయ్‌ చికాగో చట్టాల అధ్యయన స్కూలును తప్పుగా నిర్వచించారు. మన రాజ్యాంగంస్థానే కొత్తది రచించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. అవతారిక సోషలిస్టు, సెక్యులర్‌, ప్రజాస్వామిక, న్యాయం, సమానత్వం పదాలను మార్పుచేయాలని వీటి అర్థం ఏమిటని ఇప్పుడు ప్రశ్నించాలి. అవతారికలోని కీలకమైన సూత్రాలు ఇబ్బందులు పెడుతున్నాయని, అందువల్ల ఇప్పుడు రాజ్యాంగం స్థానంలో కొత్తది రూపొందించుకోవాలని అన్నారు. ఇలాంటి ప్రతిపాదన ద్వారా ఇండియాను చీకటి యుగాలకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో బీజేపీ నాయకులు అనంత హెగ్డే, అరుణ్‌ గోవిల్‌, లల్లూసింగ్‌, జ్యోతిమిర్థా కోరుకుంటున్న కొత్త రాజ్యాంగం అంశాన్ని తీవ్రంగా చూడాలి. రాజ్యాంగానికి ఇలాంటి ముప్పులు ఎదురవుతున్నందున ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా తదితర అనేక రాష్ట్రాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ రాజ్యాంగ రక్షణను ఎన్నికల ప్రచార అంశంగా చేయాలని కోరుకుంటు న్నారు. గతంలో మాజీ రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ బీజేపీ దాడుల నుండి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్న అంశాన్ని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం నుంచి మనప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పుఏర్పడుతున్నదని ఇండియా కూటమి ముందుకువచ్చి ప్రజలకు వివరిస్తున్నది. రాజ్యాంగంపై దాడిని అన్ని రాష్ట్రాలప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రధానమంత్రి ఇప్పుడు అంబేద్కర్‌ వచ్చినాకూడా రాజ్యాంగాన్ని మార్పుచేయలేమని బూటకపు మాటలు మాట్లాడుతున్నారు. హోం మంత్రి సైతం సెక్యులరిజం పట్లకొత్తగా ప్రేమను ఒలకబోస్తున్నారు. అలాగే రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ మార్పుచేయబోమని, అవతారికనుంచి సెక్యులరిజం పదాన్ని తీసివేయబోదని చెపుతున్నారు. బీజేపీలో నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కవిధంగా మాట్లాడుతారు. దీనివల్లనష్టం జరుగుతుందనుకుంటే తమ లక్ష్యాలకు భిన్నంగా బోలు మాటలు మాట్లాడుతారు. రాజ్యాంగాన్ని మార్పు చేయాలని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలపై మహారాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని మార్పు చేయబోదని ప్రకటన చేయవలసిందిగా ప్రజలు వత్తిడిచేశారు. బీజేపీ నాయకత్వం రాజ్యాంగంపై దాడి చేయడాన్ని ఈ ఎన్నికల్లో తిప్పికొట్టి ఓడిరచాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img