Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డబ్బు చుట్టూ ఎన్నికలు

. సామాన్యుడు పోటీ చేసే ప్రసక్తే లేదు
. ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలం
. వీటిన్నింటిపై సుప్రీంలో కేసు వేస్తాం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర`అనంతపురం :
సామాన్యుడు అభ్యర్థిగా నిలబడే ప్రసక్తే లేదని, డబ్బు చుట్టూనే ఎన్నికలు నడుస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. గతంలో అభ్యర్థులు డబ్బు ఇస్తే కొంతమంది తీసుకునే వారని, మరికొంతమంది నిరాకరించేవారని ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లే డబ్బులు ఇవ్వాలనే దుస్థితి వచ్చిందని తెలిపారు. సోమవారం స్థానిక మొరార్జీ నగర ప్రాథమిక పాఠశాల, ఉమానగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థుల ఇంటి దగ్గరకు ఓటర్లు వచ్చి డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారని, ఇవ్వకపోతే అభ్యర్థులను తిడుతూ శాపనార్థాలు పెట్టడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందోనని అనిపిస్తోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో దాదాపు 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని చెబుతున్నారని తెలిపారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ అధ్వాన పరిపాలన చేశారని విమర్శించారు. ఈ కేంద్ర, రాష్ట్ర పాలనలు రివర్స్‌ గేర్‌లో నడుస్తుంటే, అదే రివర్స్‌లో ఓటర్లు కూడా తెగించి అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో డబ్బు ఇవ్వకపోతే అభ్యర్థులను ఓటర్లు కొట్టే పరిస్థితి వస్తుందన్నారు.
ఈ విషయంపై అన్ని పార్టీల నాయకులు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమంటూ, విశ్వగురువు అంటూ మాటలు చెబుతున్నాడని, అయితే దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగై ధనస్వామ్యం నడుస్తోందన్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మతాలను రెచ్చగొడుతూ నీచస్థితికి దిగజారడం చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్‌ ఏమి చేస్తుందని రామకృష్ణ ప్రశ్నించారు. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తుంటే ఎన్నికల కమిషన్‌ ఏమీ పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందన్నారు. మాలాంటి వామపక్ష పార్టీలు బ్యానర్లు కట్టుకుంటే తీసేస్తున్నారని, ర్యాలీలు నిర్వహిస్తుంటే సమయం అయిపోయిందని బలవంతంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డబ్బుల పంపిణీలో ఎన్నికల కమిషన్‌ వాటా పొందుతుందా అన్న అనుమానం వస్తోందన్నారు. దీనికి ఎన్నికల కమిషన్‌, పోలీసులు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలపై ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందని, వీటన్నింటిపై సుప్రీం కోర్టులో కేసులు వేస్తామన్నారు. ఎన్నికల కమిషన్‌ ద్వారా న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే సుప్రీం కోర్టు ద్వారా న్యాయం పొందాలని భావిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పాల్యం నారాయణస్వామి, చిరుతల మల్లికార్జున, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌ బాబు, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి పి.రామకృష్ణ, సింగనమల నియోజకవర్గ కార్యదర్శి పి.నారాయణస్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img