Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి : ఏఐఎస్ఎఫ్

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్ లను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యాసంవత్సరం పూర్తి కాక ముందే ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి, యథేచ్ఛగా ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, పెద్ద, పెద్ద హోర్డింగు లు మరియు రంగు రంగుల కరపత్రాలతో విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఎరా వేసి, ఆకర్షణీయమైన అలంకరణ తో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షింపజేసి అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు యాజమాన్యాల అడుగులకు మడుగులు వొత్తుతూ, వారిచ్చే మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు యథేచ్ఛగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు ఏ యొక్క ప్రకటన ఇవ్వకపోవడం, ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయకపోవడం,చర్యలు తీసుకోక పోవడం వెనక ఉన్న అంతర్యమేమీటని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వారి కార్యాలయాలకే పరిమితం కాకుండా, జిల్లా తో పాటు మండలాల్లో ఉన్న విద్యాసంస్థలను తనిఖీ లు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని, యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల ముందు ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, మండల నాయకులు కార్తీక్, అజిత్, నరసింహా, రాజు, కృష్ణ, లాలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img