Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అల్లర్లకు ఆస్కారం!

. ఓట్ల లెక్కింపునాడు విధ్వంసాలకు కుట్ర
. దడ పుట్టిస్తున్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు
. ఈసీ, పోలీస్‌ విభాగం అప్రమత్తతపై సందేహాలు
. బాధ్యతారహితంగా వైసీపీ, ఎన్డీఏ పక్షాల వైఖరి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలకు కౌంటింగ్‌ సమయంలోను అల్లర్లు జరిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం చేసిన హెచ్చరికలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈనెల 13న పోలింగ్‌ సమయంలోజరిగిన హింసాత్మక సంఘటనలు…జూన్‌ 4న కౌంటింగ్‌ నాటికి పునరావృతమయ్యే ప్రమాదముందని నిఘా విభాగం తేల్చిచెప్పింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రాజకీయపక్షాల మధ్య ఘర్షణలకు ఆస్కారముంది. దీనిపై ఈసీ, పోలీసు యంత్రాంగం ఎంతవరకు అప్రమత్తంగా ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లకు కేవలం పోలీసులనే బాధ్యులుగా చేసి, ఎన్నికల అధికారులను మాత్రం మినహాయించడంపై అనుమానాలున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కనుసన్నల్లో ఈసీ పనిచేస్తున్నదన్న విమర్శల నుంచి బయటపడాల్సిన అవసరముంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ నుంచి పల్నాడు, చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బందిని మార్చడం ద్వారా ఈసీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నియమించిన పోలీసు పరిశీలకుడు దీపక్‌ మిశ్రా తొలగింపులో ఈసీ మౌనం దాల్చుతున్నది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటినుంచి ఎన్నికలు జరిగేంత వరకు ఈసీకి ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా తగిన ఆధారాలతో ఫిర్యాదులు అందించారు. అందులో మొక్కుబడిగా కొన్నింటిపైనే ఎన్నికల అధికారులు స్పందించారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురంజిల్లాల్లో హింసాత్మక సంఘటనలు ఓటర్లను భయాందోళనకు గురిచేశాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో దాడులు జరిగాయి. దీనికి పోలీసుల భద్రతా వైఫల్యమేనని సిట్‌ తేల్చిచెప్పింది. ఇప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే పోలీసు అధికారులు, పోలీస్‌ సిబ్బందిని బదిలీ చేస్తేనే దీనికి అడ్డుకట్ట పడే ఆస్కారం ఉంటుంది. లేదా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణంలో భారీగా పోలీస్‌ బలగాను రంగంలోకి దించాలి. పిఠాపురం, కాకినాడ ప్రాంతాల్లో భారీగా అల్లర్లు జరుగుతాయని ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఈసీకి నివేదిక ఇచ్చారు. అక్కడ శాంతిభత్రల పర్యవేక్షణపై పోలీసులు భారీ స్థాయిలో దృష్టి పెట్టాలి. పిఠాపురం నుంచి జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, కాకినాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బరిలో నిలిచారు. వారిద్దరి మధ్య రాజకీయంగా గతంలో మాటల దాడి జరిగింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల ఎవరికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చినా దాడులు చెలరేగే ప్రమాదముంది. వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.30కోట్లపైబడే అభ్యర్థికి ఖర్చయింది. అనుకున్న విధంగా ఫలితాలు రాకుంటే… ఓటర్లపై కూడా ఆయా పార్టీల నాయకులు దాడులకు తెగబడే ప్రమాదముంది.
సున్నిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించాలి
అల్లర్లు జరిగిన పల్నాడుజిల్లాలోని పల్నాడు, నరసరావుపేట, మాచర్ల తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించితేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. తిరుపతిజిల్లా చంద్రగిరి, అనంతపురంజిల్లా తాడిపర్తి తదితర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకుంటేనే…అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తదు. ఎన్నికల కౌంటింగ్‌ జరిగే లోగా మళ్లీ దాడులు జరిగితే… మొత్తం కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదముంది. కౌంటింగ్‌ సమయంలో ఆయా బూత్‌ల గ్రామాలు, ప్రాంతాలకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి తగ్గినా, పెరిగినా అందుకు కక్షసాధింపుగా గ్రామాలపై దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంది. పోలింగ్‌ జరిగిన 13వ తేదీనే ఇందుకు సాక్ష్యం. కొందరు ఎన్డీఏ కూటమికి, వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ఉద్దేశంతోనే గ్రామాల మీదకు వెళ్లి దాడులకు తెగబడ్డారు. రెండు, మూడు రోజుల వరకు గ్రామాలను ఓటర్లు వదిలిపెట్టి బయట తలదాచుకున్న దయనీయ సంఘటనలున్నాయి. ఏ మాత్రం పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించినా… మళ్లీ శాంతిభద్రలు అదుపు తప్పే ప్రమాదముంది. ఏలూరుజిల్లా దెందులూరు, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని విజయవాడ సెంట్రల్‌, పెనమలూరు, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లోనూ అల్లర్లు జరిగే అవకాశముంది. కడపజిల్లాలోని జమ్మలమడుగులోను గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేస్తేనే అల్లర్లు అదుపులోకి వస్తాయి. ఈ దాడులపై వైసీపీ, ఎన్డీఏ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కనుసన్నల్లోనే అధికారులను బదిలీ చేశారని, అక్కడే అల్లర్లు తలెత్తాయని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఓటమి భయంతోనే అల్లర్లకు దిగిందని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కేంద్రం నియమించిన పోలీసు పరిశీలకుడు దీపక్‌ మిశ్రాపై గవర్నరుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసిన రోజు ఓ బీజేపీ నేత ఇచ్చిన విందుకు దీపక్‌ మిశ్రా హాజరైనట్లుగా ప్రచారముంది. ఎన్నికల సమయంలో ఎస్సీఎస్టీలకు చెందిన ముగ్గురు ఐఏఎస్‌లను అకారణంగా బదిలీచేశారని రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈసీ మేల్కొని ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలను పరిగణలోకి ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో అల్లర్లు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img