Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేజ్రీకి బెయిలు ప్రజాస్వామ్యానికి ఊతం

దిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్టయిన తొలి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడం చెప్పుకోదగ్గ విశేషమే. ఎందుకంటే డబ్బు అక్రమణ చెలామణి (పి.ఎం.ఎల్‌.ఎ.) కేసుల్లో అరెస్టయిన వారికి బెయిలు మంజూరు కావడం చాలా అరుదు. అదీ 40రోజుల స్వల్ప వ్యవధిలో కేజ్రీవాల్‌కు వచ్చే జూన్‌ ఒకటి దాకా షరతులతోనైనా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడం మరింత విశేషమే. విచిత్రం ఏమిటంటే కేజ్రీవాల్‌ పెట్టుకున్న పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ఏప్రిల్‌ 9న తోసిపుచ్చింది. ఆ మర్నాడే ఆయన సుప్రీంకోర్టులో అర్జీ దాఖలు చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ ప్రభుత్వం మీద ఉన్న మద్యం విధానం కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేట్‌ (ఇ.డి.) అరెస్టు చేయడాన్ని సవాలు చేశారు తప్ప మొదట్లో బెయిలు అడగనే లేదు. ఎన్నికలకు ముందు దురుద్దేశంతో తనను అరెస్టు చేశారన్నదే కేజ్రీవాల్‌ ప్రధాన ఫిర్యాదు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయడానికే అరెస్టు చేశారన్నది కేజ్రీవాల్‌ వాదన. ఇ.డి., సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపై చాలా కాలంగా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో రాజకీయ కక్షతో తనను అరెస్టు చేశారన్న కేజ్రీ వాదనకు బలం చేకూరింది. దిల్లీ మద్యం కేసు చాలా కాలం నుంచి నానుతున్నప్పటికీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారని సుప్రీంకోర్టు ఇ.డి.ని నిలదీసిన సందర్భాలున్నాయి. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ పెట్టుకున్న అర్జీని సుప్రీంకోర్టు రెండు భాగాలు చేసి విచారించినట్టు స్పష్టం అవుతోంది. మొదటిది: తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధం అని కేజ్రీవాల్‌ చేసిన వాదన. రెండవది: సార్వత్రిక ఎన్నికల క్రమం మొదలైన తరవాత ఆయనను అరెస్టు చేశారు కనక అది సబబా కాదా అని వివేచించడం. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా దీపాంకర్‌ దత్తా మధ్యంతర బెయిలు మంజూర్‌ చేసేటప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలగ కూడదనే అనుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి కేజ్రీవాల్‌ తన అరెస్టు చట్ట విరుద్ధం అని సవాలుచేస్తూ పెట్టుకున్న అర్జీపై ఇంకా విచారణ పూర్తి కావలసి ఉంది. ఈ మధ్యంతర బెయిలును పొడిగించే అంశాన్ని సుప్రీంకోర్టు వచ్చే వారం పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే జూన్‌ ఒకటవ తేదీ దాకా మధ్యంతర బెయిలు మంజూరు చేశారు. జూన్‌ రెండున ఆయన జైలు అధికారుల దగ్గర లొంగిపోవలసి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4 దాకా మధ్యంతర బెయిలు మంజూరు చేయాలన్న అభ్యర్థనను మాత్రం సుప్రీంకోర్టు అంగీకరించలేదు. జూన్‌ ఒకటవ తేదీన ఆఖరిది, ఏడవది అయిన తుది విడత పోలింగ్‌ జరుగుతుంది. దీనికి ప్రచారం మే 30 తో ముగుస్తుంది. సుప్రీంకోర్టు మాత్రం జూన్‌ ఒకటవ తేదీ దాకా మధ్యంతర బెయిలు మంజూరు చేయడానికి సమ్మతించింది. ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేయడానికి గల కారణాలను సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో పాటే ప్రకటించలేదు. దిల్లీ మద్యం కేసులో బెయిలు మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు భిన్న కొలమానాలను పాటిస్తున్నట్టుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్‌కు ఆరేడు నెలల తరవాత బెయిలు మంజూరు అయింది. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను అరెస్టుచేసి ఏడాది దాటినా ఇప్పటికీ బెయిలు ఊసేలేదు. కేజ్రీవాల్‌ విషయంలో మాత్రం గత మూడవ తేదీన, మళ్లీ ఏడో తేదీన ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు అవుతుందన్న సూచన సాక్షాత్తు న్యాయమూర్తుల నుంచే వచ్చింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిలు మంజూరు చేయడానికి ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు జైలులో ఉండడం భావ్యం కాదని న్యాయమూర్తులు భావించినట్టున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలమైన ధోరణి. కానీ న్యాయపరమైన అంశాలతో బెయిలు మంజూరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
ఇలాంటి కేసుల్లో వివిధ సందర్భాలలో హైకోర్టులు తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పక్కకు తోసేసినట్టున్నారు. ‘‘సత్యం ఓడి పోదు,’’ ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’ అన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుల వ్యాఖ్యలు కూడా ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు సహించనందుకే అనుకోవాలి. రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన ప్రత్యేక దృష్టితో చూడనవసరంలేదు అన్న ఇ.డి. వాదనను న్యాయమూర్తులు అంగీకరించలేదు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిలును అడ్డుకోవడానికి ఇ.డి. చేయని ప్రయత్నం లేదు. చివరి నిముషంలో కూడా మరో ప్రమాణ పత్రం దాఖలు చేసినా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. అరెస్టు అయిన తరవాత కూడా కేజ్రీవాల్‌ రాజీనామా చేయకపోవడం అంశంలోనూ న్యాయస్థానం ప్రతికూలంగా స్పందించడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్‌ మీద విధించిన ఆంక్షలు మునుపు న్యాయస్థానాలు వ్యక్తంచేసిన అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయి. జైలు నుంచే పాలన కొనసాగిస్తాను అన్న కేజ్రీ వాదన కూడా మొన్నటి దాకా న్యాయస్థానానికి అంత అభ్యంతరకరం కాలేదు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ల కూడదని, ఫైళ్ల మీద సంతకాలు చేయకూడదని ఆంక్ష విధించింది. ఆయన దిల్లీ ప్రభుత్వ సచివాలయానికి కూడా వెళ్లకూడదని షరతు విధించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి తీసుకోవడానికి సంబంధించిన వ్యవహారాల్లో అయితే కేజ్రీ జోక్యం చేసుకోవచ్చునని న్యాయమూర్తులు అంటున్నారు. అరెస్టయిన ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలని కానీ, జైలు నుంచి అధికార విధులు నిర్వర్తించకూడదని రాజ్యాంగంతో సహా ఏ చట్టమూ చెప్పలేదు కనక సుప్రీంకోర్టు ఈ విషయంలో ఔదార్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆయనను అధికార విధులకు దూరంగా ఉండాలంటోంది. ఈ విషయంలో కూడా న్యాయమూర్తులు న్యాయాన్యాయాల జోలికి వెళ్లకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వ్యవహరించినట్టు కనిపిస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని న్యాయమూర్తులు ఆంక్షలు విధించారు. చాలా జాప్యం తరవాత కేజ్రీవాల్‌ను ఇ.డి. అరెస్టు చేయడం మొదటి నుంచి సుప్రీంకోర్టుకు అభ్యంతరకరంగానే కనిపించినట్టు రుజువు అవుతోంది. 2022 ఆగస్టులో ఎన్‌ఫోర్స్‌మెంటు కేసు ఇన్‌ఫర్మేషన్‌ నివేదిక దాఖలు చేసినా గత మార్చి 21ననే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయవలసి వచ్చింది అని సుప్రీంకోర్టు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంది. ఇ.డి. వ్యవహార సరళిని ఇటీవలి కాలంలో అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాలలో తప్పు పడ్తూనే ఉంది. వ్యవస్థలను అధికారపక్షం గుప్పెట్లో ఉంచుకోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం సహించడం లేదనే అనుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img