విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్ లో గల ఆరిగెల పోతన్న హాస్పిటల్ లో ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అరిగెల గణేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం అవిష్ హాస్పిటల్ నిర్వహణలో జరుగుతున్నదని తెలిపారు. కాలల్లో సిరల వాపు వ్యాధి (వెరీ కోష్ వెయిన్స్), కీల్ల నొప్పికి దీర్ఘకాలిక ఉపశమనం (జి ఏ ఈ) మోకాలి నొప్పులకు కూడా మెరుగైన వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. మరింత సమాచారం, ఉచిత అపాయింట్మెంట్ కొరకు కొరకు సెల్ నెంబర్ 9989527715 ఫోన్ చేసి సంప్రదించారని తెలిపారు.