Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైసీకి అంతిమ వీడ్కోలు

తెహ్రాన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. రజావీ ఖోంరాసన్‌ ప్రావిన్స్‌లోని ఆయన స్వస్థలమైన మషాద్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. మషాద్‌ నగరంలోని ఇమామ్‌ రెజా పుణ్యక్షేత్రంలో రైసీని ఖననం చేశారు. ఆ ప్రాంతంలో ఖననమైన తొలి రాజకీయ నాయకుడిగా రైసీ నిలిచారు. మషాద్‌కు తరలించడానికి ముందు బిర్జాండ్‌లో నిర్వహించిన అంతిమ యాత్రలో నల్ల వస్త్రాల్లో జనం పాల్గొన్నారు. వేలాది మంది వాహనం వెంట నడిచారు. ఆయన శవపేటికను తాకేందుకు ప్రయత్నించారు. దానిపైకి పూలు, స్కాఫ్‌లు విసిరారు. కాగా, విమాన దుర్ఘటనలో రైసీతో పాటు ప్రాణాలు కోల్పోయిన విదేశాంగ మంత్రి అమీర్‌ అబ్దుల్లాహియన్‌ అంత్యక్రియలు కూడా తెహ్రాన్‌లోని మషగ్‌ స్వ్కేర్‌లో ముగిశాయి. కుటుంబ సభ్యులు, విదేశాంగ వ్యవహారాల శాఖ సిబ్బంది సమక్షంలో ఆయనను రే నగరంలోని షా అబ్దుల్‌ అజీమ్‌ హుస్సేనీ పుణ్యక్షేత్రంలో ఖననం చేసినట్లు అధికారులు వెల్లడిరచారు. అంతకుముందు విదేశీ ప్రతినిధులు ఇరాన్‌ అధ్యక్షుడితో సహా మిగతావారికి నివాళులర్పించారు. భారత ఉపరాష్ట్రపతి ధన్కర్‌ కూడా రైసీకి అంజలి ఘటించారు. ఆదివారం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ కూలిపోగా మొత్తం ఎనిమిది మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img