Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

జిల్లా ఎస్పీ గౌతమి శాలి

విశాలాంధ్ర – అనంతపురం : సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు – 2024 కౌంటింగ్ ప్రక్రియ, తదితర అంశాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలను కాపాడాలన్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిందని, అధికారులు, పోలీసులు కష్టపడి పని చేశారన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించారని, చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలను స్పోర్టివ్ గా తీసుకోవాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలు అవుతోందని, 133 సెక్షన్ కింద రాళ్లు, రప్పలు, కర్రలు లాంటి ఇతరులకు హాని కలిగించేవి ఎవరూ పెట్టుకోకూడదని, ఎన్నికలు ముగిసే వరకు బాణాసంచా కాల్చడం చేయరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్ రూమ్ ఏర్పాటు చేయడం, టవర్ ఏసీలు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని రకాల ఏర్పాట్లను పూర్తిగా చేపడుతున్నామన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించరాదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల సహకారం అందించాలన్నారు.
ఎన్నికల కౌంటింగ్ లో ఎలాంటి హింసకు తావివ్వరాదు : జిల్లా ఎస్పీ గౌతమి శాలి*

ఎన్నికల కౌంటింగ్ లో ఎలాంటి హింసకు తావివ్వరాదని జిల్లా ఎస్పీ గౌతమి శాలి సూచించారు. ఎవరైనా ఎటువంటి హింస సృష్టించినా, సృష్టించాలని చూసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. లా అండ్ ఆర్డర్ ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి వీలు లేదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముఖ్యమైనదని, ఇందుకోసం బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 8 మందిని జిల్లా బహిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఎవరైతే గొడవలు చేసేందుకు ఆస్కారం ఉందని గుర్తించామో వారిని బైండోవర్ చేస్తున్నామని, అవి ఇంకా కొనసాగుతాయన్నారు. కౌంటింగ్ కు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును ఖచ్చితంగా స్వాగతించాలని, ఈ విషయం కార్యకర్తలకు కూడా చెప్పాలన్నారు. ఎటువంటి గొడవలు లేకుండా గెలుపు సంబరాలు జరుపుకోవాలన్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సందేహాలు వ్యక్తం చేయగా, వారి సందేహాలను నివృత్తి చేశారు. కౌంటింగ్ కోసం ఏజెంట్లను నియామకం, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విధివిధానాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అడిషినల్ ఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, వెన్నెల శ్రీను, జి.వెంకటేష్, పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ రమేష్ రెడ్డి, ఈఆర్ఓ శిరీష, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img