విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని టీచర్స్ కాలనీలో పవర్లూమ్ మగ్గం చేనేత కార్మికుడైన వెంకటరెడ్డి (26 సంవత్సరాలు) తన ఇంటికి సమీపంలో గల కాళీ ప్రదేశంలో సూపర్ వాజ్ మాల్ అనే విష ద్రావకాన్ని సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెనివెంటనే వెంకటరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తదుపరి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వైద్యులు తరలించారు. వెంకట్ రెడ్డికి ఇంకను వివాహం కాలేదు. అసలు వెంకటరెడ్డి ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు? ఏవైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రైవేట్ డ్రైవర్ వలి ఆత్మహత్యాయత్నం:: పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన దూద్ వలి (25 సంవత్సరాలు) ఆరోగ్యం సరిగా లేక మనస్థాపానికి గురై పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద సూపర్ వాచ్మెన్ అనే విష ద్రావకాన్ని సేవించి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. మార్కెట్ వద్ద గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దూద్వాలకి ఇంకనూ వివాహం కాలేదు. ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరాధిస్తూ, కేసు నమోదు చేసుకున్నారు.