Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేంద్రంలో అధికార మార్పిడి తథ్యం

. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా స్పష్టీకరణ
. విద్రోహ చర్యలకు బీజేపీ తెగిస్తుందని విమర్శ
. కమ్యూనిస్టులదే భవిష్యత్తు: నారాయణ
. ఘనంగా సుబ్రహ్మణ్యం అధ్యయన కేంద్రం ప్రారంభం

గోపిశెట్టిపాలెం నుంచి టి. జనార్థన్‌

జూన్‌ 4న కేంద్రంలో అధికార మార్పిడి ఖాయమనీ, ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా చెప్పారు. అయితే బీజేపీ అనేక కుయక్తులతో ఇండియా కూటమి అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించనున్నదనీ, అందువల్ల దేశ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా గోపిశెట్టిపాలెంలో కమ్యూనిస్టు పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవస్థాపకులలో అతి ముఖ్యులైన సి.సుబ్రహ్మణ్యం స్మారక అధ్యయన కేంద్రాన్ని సోమవారం రాజా ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జర్మనీలో హిట్లర్‌ సైతం తన అధికార భవనమైన రీచ్‌ స్టాగ్‌ కు నిప్పంటించి ఆ ద్రోహం కమ్యూనిస్టుల పైన నెట్టివేశాడనీ, అలాగే ఫాసిస్ట్‌ బీజేపీి సైతం అధికారం కోల్పోతే విద్రోహ చర్యలకు పాల్పడి కమ్యూనిస్టులు, ప్రతిపక్షాలపై నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో అంబానీ, అదానీల వలనే అభివృద్ధి జరుగుతోందని నిరుద్యోగ సమస్య వారే పరిష్కరిస్తున్నారని, కృత్రిమ మేధ తో నిరుద్యోగ సమస్య ఏర్పడినా అంబానీ ఆదానిలే దానిని పరిశీలించ గలరని వారికి మోదీ భరోసా ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ఇండియా కూటమి దేశాన్ని పాకిస్తాన్‌ కో, లేక విదేశాలకో అమ్మకం చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే రూ. 150 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని అన్ని విధాలా విదేశాలకు తాకట్టు పెట్టింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
ఉత్తమ కమ్యూనిస్టు గురించి లీశాకీ పేర్కొన్నట్టుగా మార్క్సిస్ట్‌ మేధావి అయిన సి. సుబ్రహ్మణ్యం అన్ని విధాలా గొప్ప వ్యక్తిని డి. రాజా పేర్కొన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం అనేది కేవలం రాజ్యాధికారం కోసం మాత్రమే కాదని మానవ విలువలు, నైతికత తదితర విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కమ్యూనిస్టులు వర్గ సమాజం గురించి, అంబేద్కర్‌ కుల రహిత వ్యవస్థ గురించి జీవితకాలం కృషి చేశారనీ, దక్షిణ భారతదేశంలో వాటిని సమన్వయంచేసి విశేష కృషి సల్పిన సింగార్‌ వేల్‌ చెట్టియార్‌ లాంటి వారి జీవితాలను అధ్యయనం చేసిన ప్రముఖుడు సుబ్రహ్మణ్యం అని కొనియాడారు. సమాజాన్ని ఎలా మార్చాలి అనే అంశంపై ప్రకృతి శాస్త్రాల ఆధారంగా మార్క్సిస్టు దృక్పథంతో సుబ్రమణ్యం ఎంతో అవగాహనతో జీవితకాలం అధ్యయనం చేశారని పేర్కొన్నారు. తన భూమినీ, బ్యాంకులో ఉన్న డబ్బులను పార్టీ అవసరాల కోసం పార్టీకి అందజేయడం ఎంతో గొప్పతనం అన్నారు. ఆయన ఆశయం మేరకు సీపీఐ తమిళనాడు రాష్ట్ర శాఖ నిత్యం పార్టీసభ్యులకు నిత్యం అవగాహన కల్పించేందుకు ఈ భవనం తోడ్పడుతుందని నారాయణ పేర్కొన్నారు.
నిరుద్యోగ సమస్య పెంచే కృత్రిమ మేధ: నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ మాట్లాడుతూ, దేశంలో శాస్త్రసాంకేతిక రంగంలో అనేక మార్పులు శీఘ్రగతిన వస్తున్నాయనీ, కృత్రిమమేధ అందులో ప్రధాన పాత్రవహిస్తూ మానవ ప్రమేయం లేకుండా ఉత్పత్తులు సృష్టించే స్థితి ఏర్పడబోతోందని చెప్పారు. కృత్రిమ మేధ వంటివి దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచుతూ మన ముందు సవాలు విసురుతున్న నేపథ్యంలో మార్క్సిజం వాటికి సమాధానం చెప్పగలదని అందులో భాగంగానే కామ్రేడ్‌ సుబ్రహ్మణ్యం అధ్యయన కేంద్రం ఎంతగానో దోహద పడుతుందని అన్నారు. కమ్యూనిస్టుపార్టి భవిష్యత్తు పై అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారనీ, ఫీనిక్స్‌ పక్షిని బూడిద చేసినా తిరిగి పునరుజ్జీవం పొందినట్లు నిత్యం మార్క్సిస్ట్‌ దృక్పధంతో ముందుకు వెళుతూనే వుంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ కుల,మత,ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నదన్నారు. విచ్ఛిన్నకర, వినాశకర విధానాలను అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దమయ్యారని తెలిపారు. సీపీఐ అగ్రనేత చండ్రరాజేశ్వరరావు పేరిట స్థాపించిన సీఆర్‌ ఫౌండేషన నేడు,వృధ్ధాశ్రమం,పరిశోధనా కేంద్రం, ఆసుపత్రులను నిర్వహిస్తోందని,అలాగే కేరళలో సీకే చంద్రప్పన్‌, అచ్యుత మీనన్‌ పేరున నిర్మించిన స్మారక భవనాలు మధ్యతరగతి ప్రజానీకానికి సైతం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని చెప్పారు. సుబ్రహ్మణ్యం అధ్యయనం కేంద్రం భవిష్యత్తులో అనేక సమస్యలకు పరిష్కార వేదికగా తోడ్పడుతూ, పోరాటాలకు సైతం కేంద్ర బిందువుగా వుండగలదన్న ఆశాభావాన్ని నారాయణ వ్యక్తం చేశారు. సభకు సీపీఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ముతరాసన్‌ అధ్యక్షత వహించగా, ఎంపీ సుబ్బరాయన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పుదుచ్చేరి కార్యదర్శి సలీం సహాయ కార్యదర్శులు వీర పాండ్యన్‌ ,పెరియస్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు, జాతీయ సమితి సభ్యులు శివారెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు టి.జనార్థన్‌, నాగ సుబ్బారెడ్డి, విశ్వనాథ్‌, పి.ఎల్‌ నరసింహులు,పూర్వపు చిత్తూరు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img