Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కొత్త దేవుడు

కళ్లెదుట కనిపిస్తున్న దృశ్యాల అంతరార్థం జనం గ్రహించలేనప్పుడు, ఆ జనం అజ్ఞానాన్ని తొలగించడానికి ఏదో ఓ ‘‘శక్తి’’ నడుం కట్టకుండా ఉంటుందా. మోదీ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆయన ఈ పదేళ్ల కాలంలో సందర్శించని దేవాలయంలేదు. దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలన్నింటినీ ఆయన దర్శించుకున్నారు. కేదార్‌ నాథ్‌ గుహలో నిశ్శబ్దంగా కూర్చుని చాలాసేపు ధ్యానం చేసినప్పుడు జనం మోదీకి ఉన్న అపారమైన భక్తిని చూసి మురిసి పోయారు. అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరించే సమయంలో బాల రాముడిని మోదీ చేయిపట్టుకుని నడిపించుకు పోయినప్పుడు మోదీ రామ మందిరం నిర్మించిన మహానుభావుడని అనుకున్నారు. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ముంబైలో మాట్లాడుతూ ‘‘శక్తి’’ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ప్రస్తావించింది దుష్ట శక్తి గురించి. కానీ మోదీ ఈ మహదవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. రాహుల్‌ గాంధీ శక్తిని అంతమొందిస్తా నంటున్నాడు చూశారా అని మహిళల మనోభావాలను రెచ్చ గొట్టడానికి ప్రయత్నించారు. తాను మాతృ మూర్తులను శక్తి స్వరూపిణులుగా పూజిస్తానని అలాంటి శక్తి స్వరూపిణులను రాహుల్‌ గాంధీ అంతమొందింప చేస్తున్నారా అని మోదీ మహిళలకు జ్ఞానభిక్ష పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించి వారిని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. శక్తి అంటే ఏమిటో వారికి జ్ఞానభిక్ష ప్రసాదించారు. ఇన్ని సంఘటనలు కళ్లెదుట ఉన్నా జనం మోదీ అసలు స్వరూపం ఏమిటో గ్రహించలేక పోయారు. ఇంత జరుగుతుంటే మోదీ మౌనంగా ఉండలేరు కదా. అందుకే మోదీ ఇటీవల న్యూస్‌ 18 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కలిగిన స్వస్వరూప జ్ఞానాన్ని గురించి జనానికి తెలియజెప్పాలని సంకల్పించారు. పాలకుడు ప్రజలకు ఏమిచేసినా ఏం చేయకపోయినా పాలకుడి స్వరూపం ఏమిటో అర్థం చేసుకోలేకపోతే ఎలా! అందుకే ఈ విషయంలో జ్ఞాన బోధన చేయాలని మోదీ సంకల్పించారు. భగవంతుడు అప్పుడప్పుడు జనాన్ని పరిశీలించడానికి మానవ రూపంలో సంచరిస్తాడని మన పురాణాల్లో లెక్కలేనన్ని కథలున్నాయి. అప్పటికీ జనం మధ్యలో ఆ మానవ రూపంలో తిరుగుతున్నది సాక్షాత్తు భగవంతుడేనని జనం గ్రహించక పోతే వారికి అవసరమైన జ్ఞానం కలిగించకపోతే ఎలా! అందుకే మోదీ న్యూస్‌ 18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి తనకు జన్మనిచ్చినా ఆమె మరణించిన తరవాత తన తల్లి తనకు జన్మ ఇవ్వలేదని, సాక్షాత్తు పరమాత్ముడే తనను ఒక నిర్దిష్ట కార్యక్రమం పూర్తి చేయడానికి పంపించాడనిపించిందని మోదీ విడమర్చి చెప్పవలసి వచ్చింది. మోదీ తనను పరమాత్ముడు పంపించాడన్నారు కానీ దేవుడు లేదా భగవంతుడు పంపించాడనలేదు. అలా చెప్పి ఉంటే ముక్కోటి దేవతల్లో ఏ దేవుడు మోదీని పంపించాడో అంతుపట్టక జుట్టు పీక్కుని బట్టతలలతో మిగిలే ప్రమాదం ఉంది కనక పరమాత్ముడు అన్న మాట మోదీ చాలా జాగ్రత్తగానే వాడారు. ఆత్మలన్నీ అంతిమంగా పరమాత్మలో కలిసిపోతాయనేగా మనం అనాదికాలంగా వింటున్నది. పరమాత్ముడే తనను పంపించాడన్న విషయంలో మోదీకి ఇసుమంతకూడా అనుమానంలేదు. తనకు ఈ విషయం పక్కాగా తెలిసిపోయిందని ఆయనే స్వయంగా చెప్పారు. ఇది తన అనుభవసారం అని కూడా సెలవిచ్చారు.
కొన్నాళ్ల కింద మోదీ తాను భారత మాత పూజారిని అన్నారు. అప్పుడు ఆయనకు తాను పరమాత్మ పంపిన దైవాంశ సంభూతిడినని తెలియక కాదు. కాని పిసరంత ఉప్పందిస్తే జనం తాను దైవాంశ సంభూతుడినని గ్రహించకపోతారా అనుకున్నట్టు న్నారు. కాని అక్షరాస్యత ఎంత పెరిగినా జనానికి బుద్ధి వికసించక పోతే తన ఉద్దేశం ఏమిటో విప్పి చెప్పక మోదీకి తప్పుతుందా. అందుకే ఈసారి నేరుగానే తాను తన అమ్మ కడుపున మానవ మాత్రుడిగా పుట్టలేదని, సాక్షాత్తు ఆ పరమాత్మే తనను పంపించాడని మోదీ టీకా టిప్పణితో సహా చెప్పవలసి వచ్చింది. మోదీ ఉద్దేశం ప్రకారం ఆయనని పరమాత్ముడే పంపించారు కనక దేవదూత అనుకుందాం. అలా అనుకోవడం కూడా మోదీ జన్మ కారణాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్టు కాదేమో. దేవదూతను అని చెప్పడంలో మోదీలో వల్లమాలిన అణకువ కొట్టొచ్చి నట్టు కనిపిస్తోంది. అదే లేకపోతే ఆయన తానే దేవుణ్నని చెప్పుకోవలసి వచ్చేది. ఈ విషయ గ్రహణశక్తి లేనందువల్లే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంటి వారు అమాయకంగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 75 ఏళ్లు నిండినవారు పదవుల్లో ఉండకూడద న్నది బీజేపీ నియమం కనక ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే 2025లో మోదీకి 75 ఏళ్లు నిండుతాయి కనక ప్రధాని బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తారా అని కేజ్రీవాల్‌ చొప్పదంటు ప్రశ్నలు లేవనెత్తు తున్నారు. అవతార పురుషులు, దేవ దూతలు, దైవాంశ సంభూతులు – ఈ మాటల్లో ఏ మాట వాడినా పరమాత్ముడు ఏ లక్ష్య సాధనకైతే ఎవరినైనా పంపితే ఆ లక్ష్యం పూర్తి కాకుండా ఆ వ్యక్తి అర్థాంతరంగా వదిలేయగలరా! అది దైవాపచారం కాదా. కేజ్రీవాల్‌ లాంటివారి జ్ఞాన రాహిత్యాన్ని దూరం చేయడానికే మోదీ అద్భుతమైన రీతిలో సమాధానం చెప్పారు. ఈ దేశాన్ని సంపద్వంతమైన దేశంగా మలచడానికి 2047 దాకా సమయం పడ్తుందని ప్రధానిగా కొంతకాలం అనుభవం గడిరచాక మోదీకి అర్థం అయింది. దేవలోకంలోలా భూలోకంలో అన్ని గిరిగీసినట్టు జరగవుగా. ఒకసారి కొంచెం అటూ ఇటూ కాక తప్పదు. లేకపోతే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన వాగ్దానానికి మోదీ కట్టుబడి ఉండేవారే. అప్పుడేమన్నారో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అధికారం ఇచ్చారు నాకు 60 నెలలు ఇవ్వండి చాలు అన్నారు. ఎంత దైవాంశ సంభూతులకైనా ఈ పాడులోకంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రతిపక్షాలు ఉన్నదే ఇలా అడ్డంకులు కల్పించడానికేగా. అందుకే స్వీయానుభవం తరవాత దేశం సుసంపన్నం కావడానికి ప్రస్తుతానికి తుది గడువు 2047 అంటున్నారు. అప్పటిదాకా తానే అధికారంలో ఉంటానని కూడా చెప్పకనే చెప్పారు. ఒక వేళ అప్పటికీ దేశాభివృద్ధి సాధ్యం కాకపోతే మోదీ చేతులు కట్టుకుని కూర్చోరుగా! ఆయన దగ్గర వెయ్యేళ్ల ప్రణాళిక ఎటూ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img