Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మొగ్గు ఎటువైపు?

. గెలుపోటములపై ఉత్కంఠ
. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక పోలింగ్‌
. 64 నియోజకవర్గాల్లో భారీ పెరుగుదల
. అర్బన్‌లో 27 స్థానాల్లో పోటెత్తిన ఓటర్లు
. సర్వే సంస్థలకు అంతుచిక్కని ఓటరు నాడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి… ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్ణయించేదీ ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే ఓట్ల లెక్కింపు వరకు ఉత్కంఠంగానే ఉంటుంది. గెలుపు, ఓటముల్లో కీలకంగా నిలిచేదీ గ్రామీణ ఓటర్లా, మహిళలా? అనేదీ అంతుచిక్కడం లేదు. ఓటర్ల నాడి ఎటు ఉందనేదీ పూర్తిగా తెలియడం లేదు. గ్రామీణులు, మహిళలదనే దిశగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుల ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాల్లో గ్రామీణుల ఓటర్లదే పైచేయిగా నిలవనుంది. మహిళలూ కీలకం కానున్నారు. ఈ రెండు వర్గాల మద్దతు ఓట్లను అత్యధికంగా కూడగట్టుకున్న వారే…గెలుపు అంచున ఉండే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 3.23 కోట్ల మంది (81.86శాతం) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2014, 2019తో పోల్చుకుంటే… ఇది భారీగా ఓటింగ్‌ శాతం నమోదైనట్లుగా భావిస్తున్నారు. 2024లో ఓటర్లు భారీగా పెరగడంతోనే ఈ ఓటింగ్‌ శాతం నమోదైనట్లుగా సమాచారం. 2014లో మొత్తం ఓటర్లు 3.67కోట్ల మంది ఉండగా, అందులో 2.87 కోట్ల మంది ఓట్లేయగా, 78.04 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019లో 3.67 కోట్ల మంది ఓటర్లు ఉండగా… వారిలో 3.16 కోట్ల మంది ఓట్లేశారు. మొత్తం 79.77 శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌కు వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం సీట్ల సర్దుబాటుతో పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమి(బీజేపీ, టీడీపీ, జనసేన) కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు పొత్తుల ద్వారా పోటీకి దిగాయి. దీంతో ఓట్లేసిన ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
2024 ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాల ఆధారంగా…ప్రాంతాలు, పార్టీలు, మహిళల ఓట్ల శాతం ఆధారంగా గెలుపు, ఓటమిని నిర్ణయించే ప్రధాన రంగాల ఓట్లపై విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం అధికంగా నమోదైంది. ఈసీ వెల్లడిరచిన ప్రకారం 175 అసెంబ్లీ స్థానాలకుగాను గ్రామీణ ప్రాంతంలో ఓటింగ్‌ శాతం పెరిగిన నియోజకవర్గాలు 124 ఉన్నాయి. ఇందులో రెండు శాతం నుంచి 7.53 శాతం మధ్య ఓట్లు పెరిగిన నియోజకవర్గాలు 64. ఒక శాతం నుంచి 1.99 శాతం వరకు ఓటింగ్‌ పెరిగిన నియోజకవర్గాలు 34, చివరగా 0 శాతం నుంచి ఒక శాతం వకు ఓట్లు పెరిగిన నియోజకవర్గాలు 26గా నమోదయ్యాయి. ఇందులో గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా ఓట్ల శాతం పెరిగిన 64 నియోజకవర్గాలు గెలుపు, ఓటములను కీలకంగా నిర్ణయించే అవకాశాలున్నాయని ఒక అంచనాకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో తొమ్మిది శాతం నుంచి 1.92 శాతం వరకు ఓటింగ్‌ శాతం తగ్గిన నియోజకవర్గాలు 19 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతవాసులు తమ వైపు ఉన్నారనే దిశగా ప్రధాన పార్టీలైన ఎన్డీఏ కూటమి, వైసీపీలు చెప్పుకుంటున్నాయి. అర్బన్‌ ప్రాంతంలోను 0.31 శాతం నుంచి 13.48 శాతం వరకు అనగా 27 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నియోజకవర్గాలు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మహిళా ఓటర్లపైనే పార్టీల నమ్మకం
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళా ఓటర్లపైనే నమ్మకం పెట్టుకున్నాయి. ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బారులు తీరి ఓట్లు వేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా మహిళలు, వృద్ధులు ఉన్నారు. అదే దిశగా పోలింగ్‌ శాతం భారీగా నమోదైంది. దీంతో గ్రామీణ మహిళలు, వృద్ధుల ఓట్లు అత్యధికంగా తమకే దక్కుతాయన్న ఆశతో ఓ పార్టీ ఉంది. అర్బన్‌లోనూ మహిళలు బారులు తీరారు. అర్బన్‌లోని 27 నియోజకవర్గాల్లో అత్యధికంగా పోలింగ్‌ నమోదు కావడంపై మరో పార్టీ తమదే హవాగా భావిస్తున్నది. పట్టణ ప్రాంత వాసులంతా తమకే మద్దతిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో 1.69 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా, 80.30 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2019లో మహిళా ఓటర్లు 1.57 కోట్ల మంది(79.56శాతం) ఓట్లేశారు. మహిళల ఓట్లను పరిశీలిస్తే 2019 కంటే 2024లో 0.74 శాతం ఓట్లు అధికంగా నమోదైంది. 2019తో పోలిస్తే… 2024లో అత్యధికంగా మహిళా ఓటర్లు పెరగడమూ ఒక ప్రధాన కారణం. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బారులు తీరి మహిళా ఓటర్లు, వృద్ధులు ఓట్లేశారు. దీంతో రాబోయే ఫలితాల్లో మహిళా ఓటర్లే…గెలుపు, ఓటములను నిర్ణయించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్రను గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలు పోషిస్తారన్న దిశగా ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ఓటు నాడి సర్వే సంస్థలకు సైతం పూర్తిగా చిక్కడం లేదు. ప్రస్తుతం గెలుపు, ఓటములపై ధీమాతో ఉన్న రాజకీయ పార్టీలకు…ఫలితాలు వచ్చాక అసలు లెక్క తేలనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img