Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నోరువిప్పితే అబద్ధాలే

. మోదీ ఎన్నికల ప్రచారమంతా దూషణలే
. ముస్లింలపై విద్వేషం…హిందూ ఓట్ల కోసం అగచాట్లు

న్యూదిల్లీ : నరేంద్రుడి లీలలు ఆయనకే చెల్లుతాయి. మాటలతో గారడీ చేయడంలో దిట్ట. వాస్తవాలను వక్రీకరించడంలో ఆరితేరారు. లేనిది ఉన్నట్లు… ఉన్నది లేనట్లు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీకి ఎవరూ సాటిరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన ప్రచారమంతా ప్రతిపక్షాలు, ముస్లింలను దూషించడంతోనే సరిపోతోంది.
‘హిందూవులకు, ముస్లింలకు మధ్య వివక్ష చూపితే ప్రజా జీవనానికి అర్హత కోల్పోతాను. నేనెప్పుడు అలా చేయలేదు. చేయను కూడా… ఇది నాకు నేనుగా తీసుకున్న ప్రతిజ్ఞ’ అంటూ అన్ని హద్దులను మర్చి మోదీ అబద్ధం చెప్పారు. ఆయన తన జీవితంలో దీనికంటే పెద్ద అబద్ధం చెప్పివుండకపోవచ్చు అన్న చర్చ దేశ, విదేశాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్‌ 1న ఏడవ దశ పోలింగ్‌ జరగబోతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చెప్పిన అవాస్తవాలుఅసత్యాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం జర్నలిస్టులు, విశ్లేషకులు, ఓటర్లు, అభ్యర్థులకు మోదీ ప్రసంగాలే చర్చనీయాంశాలు. హిందువులు, ముస్లింలను సమానంగా చూస్తానని చెప్పడాన్ని బట్టి అధికారం కోసం మోదీ ఏమైనా చేయగలరని తేలింది. సమాజంరాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నాగానీ ఆయన మాటల్లో నిజం లేదని అర్థమవుతుంది. ఇటీవల రాజస్థాన్‌లో బీజేపీ తరపున మోదీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విద్వేషపూరితంగా ముస్లింలను చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలుగల వారిగా వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
వాస్తవాలకు సుదూరంగా హామీలు
మోదీ అబద్ధాలకు హద్దంటూ లేదు… ఆయన పలికే అసత్యాలకు పరిధే లేదు. ఆయన ఇచ్చే హామీల్లోనూ నిజంలేదు. ‘మోదీ గ్యారెంటీ’ రూపేణ అనేక అబద్ధాలు చెప్పారు. అందులో మొట్టమొదటిది అచ్చేదిన్‌ కాగా ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమ, అవినీతి, ఉగ్రవాదంపై పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉక్కుపాదం, ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి వన్నీ జుమ్లాలుగా మిగిలాయి. హామీల అమలులో మోదీ ఘోరంగా విఫలమయ్యారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతం కార్డు ప్రయోగిస్తారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని ప్రస్తావిస్తారు. బీజేపీ సంకల్ప పత్ర/ మోదీ గ్యారెంటీలు వాస్తవికతకు సుదూరంగా ఉండటం, మతానికి పెద్ద పీట వేయడంతో అవి ఓటర్ల చెవులకు ఏ మాత్రం రుచించలేదని క్షేత్రస్థాయి పరిస్థితులతో తెలుస్తోంది. రామమందిరం పేరిట భారీగా ఓట్లు దండుకోవాలనే ఆలోచన మోదీ గ్యారెంటీలలో కనిపిస్తోంది. దీనిని ఓటర్లు అర్థంచేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, దిల్లీ తదితర ప్రాంతాల్లో కొన్ని వర్గాల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. హిందూత్వ అజెండాకు అనుకూలంగా మాట్లాడటం వల్ల బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు విమర్శలను ఎదుర్కొన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న ప్రచారం ప్రతికూలంగా పరిణమించింది. ఉచిత విద్యుత్‌, నల్లా నీళ్లు, పక్కా ఇళ్లు అంటూ రాష్ట్ర పరిధిలోని వాటిని మోదీ గ్యారెంటీలుగా ప్రచారం చేయడం ఓటర్లు ఇష్టపడలేదు. మోదీ హామీలంటూ వీడియో ఫిలిమ్‌లతో ‘గోదీ మీడియా’ ప్రచారం, ప్రింట్‌ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రకటనలు ఓటర్లను ఆకట్టుకోలేదు. 2014లో, 2019లో ఇచ్చిన హామీలే అందులో కనిపించాయి. కొత్త సీసాలో పాత సారా చందంగా 2024లో మోదీ ఎన్నికల ప్రచారం సాగింది. గుజరాత్‌లో 2002గోద్రా అల్లర్లు, బూటకపు ఎన్‌కౌంటర్ల పర్వంతో మోదీ ఎవరో ప్రపంచానికి తెలిసింది. 1995లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిరది. 1985, 1987, 1989, 1992లో గుజరాత్‌లో మతఘర్షణలు జరిగాయి. గోద్రా అల్లర్లను ముస్లింలపై కక్షసాధింపుగా చెప్పుకున్నారు. అనేక హత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లు మోదీ హయాంలో జరిగాయి. మితిమీరిన హింసకుగాను అప్పటి హోంమంత్రి అమిత్‌షా అరెస్టుకు గురయ్యారు. ఎన్‌కౌంటర్‌ బాధితుల్లో ముస్లింలే ఎక్కువ కాగా షేక్‌ షొహ్రాబుద్దీన్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, ఇష్రత్‌ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్లు విదితమే.
ముస్లింలపై మోదీ అయిష్టతకు సీఏఏ చట్టం2019 మరో ఉదాహరణ. ఈ చట్టం తెచ్చేందుకు 2003లోనే కసరత్తు మొదలైంది. పౌరసత్వ చట్టం1955లో అక్రమ వలసదారులను చేర్పించే అంశం అప్పట్లో తెరపైకొచ్చింది. 2016లో పౌరసత్వ చట్టాన్ని సవరించింది…బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. మొత్తానికి 2019లో ముస్లింలు మినహా మైనారిటీలకు పౌరసత్వం కల్పించేలా సీఏఏ చట్టాన్ని తెచ్చారు.
2021లో జనగణన నిర్వహించకపోవడానికి తాజా సార్వత్రిక ఎన్నికల్లో హిందువులు ప్రమాదంలో ఉన్నారన్న ప్రచార అజెండానే కారణం. ఇందుకోసం ప్రధాన మంత్రి ఆర్థిక సలహారు సంఘం సభ్యుడు షమికా రవి వంటి ఆర్థికవేత్తల సాయంతో తప్పుడు గణాంకాలను మోదీ సృష్టించారు. 19502015లో హిందువుల జనాభా 7.82శాతం తగ్గిందని, ముస్లిం జనాభా 43.15శాతం పెరిగిందని మోదీ గణాంకాలు చెప్పాయి. వాస్తవానికి 195161లో హిందువులు, ముస్లింల జనాభాలో పెంపుదల 20.7శాతం, 32.7శాతం చొప్పున ఉంది. అలాగే 198191లో 22.7శాతం, 32.9శాతంగాÑ 19912001లో 19.9శాతం, 29.4శాతంగాÑ 2001`2011లో 16.7శాతం, 24.7శాతంగా నమోదైంది. రెండు వర్గాల జనాభాలో క్షీణత ఉంది. (మూలం:మెరుకోరోనెన్‌ ఆస్ట్రో (వెపెన్‌ ఫర్‌ పోలరైజేషన్‌) శాశ్వత ఘోశ్‌ వ్యాసం 2024, మే 20). ఇక 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 1.210.86 మిలియన్లు కాగా ఇందులో 14.2శాతం అంటే 172.2 మిలియన్ల మేర ముస్లింలు ఉన్నారు. ఈ లెక్కలు చూసిన తర్వాత కూడా హిందువులకు ముస్లింల నుంచి ముప్పు ఉందని నమ్మగలమా? మోదీ ఆయన అనుచరులు మాత్రం ఇది నిజమని చెప్పడంతో హిందువులు, ముస్లింలను సమానంగా మోదీ చూడలేరని రుజువైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img